News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 4th September 2019
Markets_main1567571387.png-28174

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
టాటా కమ్యూనికేషన్స్‌:-
ఐఓటీ సర్వీస్‌ల కొరకు నీకో గ్లోబల్‌ ఐసీటీ సర్వీస్‌ సంస్థ తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 
గుజరాత్‌ అపోలో ఇండస్ట్రీస్‌:- తన అనుబంధ సంస్థ ఏఈఎంల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ జాయింట్‌ వెంచర్‌ కంపెనీలో తన మొత్తం వాటాను విక్రయించింది. 
సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా:- వాహన, గృహ రుణాలకు రెపో లింక్డ్ వడ్డీ రేటును ప్రవేశపెట్టింది 
ఫ్యూచర్‌ మార్కెట్‌ నెట్‌వర్క్స్‌:- నాగపూర్‌, జార్ఖండ్‌లో లాజిస్టిక్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ ఆస్తుల అభివృద్ధి ‍కొరకు ఈఎస్‌ఆర్‌ సంస్థ భాగస్వామ్యంలో రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. 
భారత్‌ హెవీ ఎలక్ట్రానిక్స్‌:- బ్యాంకు గల ధీర్ఘకాలిక రుణ సదుపాయ సౌకర్యాలపై కేర్‌ రేటింగ్స్‌ సంస్థ ఎఎ(+)/స్థిరత్వం రేటింగ్‌, కమర్షియల్‌ పేపర్ల జారీ ఇష్యూకు కేర్‌ ఎ1(+) రేటింగ్‌ను కేటాయించింది. 
ఇండియామార్ట్‌ ఇంటర్‌మెస్‌:- సింప్లి వ్యాపర్ యాప్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఒక ఒప్పందం కుదుర్చుకుంది 
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా:- అర్హత కలిగిన ఉద్యోగులకు ఈఎప్‌పీఎస్‌ పథకంలో భాగంగా 15 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేసేందుకు కంపెన్షన్‌ కమిటీ ఆమోదం తెలిపింది.  
బీఎల్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ సర్వీసెస్‌:- కంపెనీ డెరెక్టర్‌ పదవికి సురీందర్‌ సింఘ్‌ కోహ్లీ రాజీనామా చేశారు. 
ఆర్‌పీపీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్‌:- కంపెనీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ స్వతంత్ర డెరెక్టర్‌గా రామస్వామి కలైమోనీ ఎన్నికయ్యారు. 
ఆంధ్రా బ్యాంక్‌:- యూనియన్‌ బ్యాంక్‌లో విలీనం చేసే ప్రతిపాదనపై చర్చించేందుకు సెప్టెంబర్‌ 06న సమావేశం నిర్వహించనుంది. 
కెల్‌టన్‌ టెక్‌ సర్వీసెస్‌:- కంపెనీ సీవోగా క్రిష్టారెడ్డీ చింతన్‌ ఎన్నికయ్యారు
కోఠరీ షుగర్స్‌ అండ్‌ కెమికల్స్‌:- ధీర్ఘకాలిక రుణ సౌకర్య సదుపాయానికి ఇక్రా రేటింగ్‌ సంస్థ బిబిబి(-) రేటింగ్‌ను సవరించింది. 
రెడింగ్టన్‌:- స్టాండర్డ్‌ ఛార్టెడ్‌ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ ఓపెన్‌ మార్కెట్‌ పద్దతిలో 2.72శాతానికి సమానమైన 10.50 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించింది.You may be interested

నష్టాల్లో మారుతి, బజాజ్‌ ఆటో

Wednesday 4th September 2019

దేశ జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టానికి పడిపోవడంతో పాటు, తగ్గిన వాహన విక్రయాలు వలన దేశియ ఆటోరంగ షేర్లు  బుధవారం సెషన్‌లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. హెవివెయిట్‌ షేర్లయిన  మారుతి 1.32 శాతం  (ఉదయం 10.29 సమయానికి),  బోచ్‌ లి. 1.07 శాతం, ఐషర్‌ మోటర్స్‌ 0.58 శాతం, బజాజ్‌ ఆటో 0.26 శాతం, ఎంఆర్‌ఎఫ్‌ 0.09 శాతం నష్టపోవడంతో నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ 0.82 శాతం కోల్పోయి 6,841.20

పెరిగిన చమురు ధరలు

Wednesday 4th September 2019

  గత వారానికి సంబంధించి యుఎస్‌ చమురు నిల్వలు తగ్గుతాయనే అంచనాల నేపథ్యంలో బుధవారం​ చమురు ధరలు పెరిగాయి. ఉదయం 9.39 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.15 శాతం పెరిగి బారెల్‌ 58.35 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.32 శాతం పెరిగి బారెల్‌ 54.11 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. అగష్టు 30తో ముగిసిన వారానికి గాను క్రూడ్‌ యుఎస్‌ నిల్వలు 30 లక్షల బారెల్‌లు, యుఎస్‌ గ్యాసోలిన్‌ నిల్వలు

Most from this category