News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 28th May 2019
Markets_main1559018896.png-25946

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
అదానీ పోర్ట్స్‌:-
జూన్‌ 04న జరిగే బోర్డు సమావేశంలో కంపెనీ డివిడెండ్‌, షేర్‌  బైబ్యాక్‌ ఇష్యూ అంశంపై చర్చించనుంది. 
రిలయన్స్‌ క్యాపిటల్‌:- బిగ్‌ 92.7 ఎఫ్‌ఎం రేడియాను జాగరణ్‌ ప్రకాశణ్‌ మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌కు విక్రయించనుంది. ఈ వాటా విక్రయ విలువ సుమారు రూ.1200 కోట్లు ఉంటుందని అంచనా.
వీ-మార్ట్‌:- అస్సాంలో నూతనంగా రీటైల్స్‌ షాప్‌ను ప్రారంభించింది
వక్రంజీ:- లెండింగ్కార్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో వ్యాపార భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 
వాస్కన్‌ ఇంజనీరింగ్‌:- అవంతీ ప్రాజెక్ట్స్‌ నుంచి రూ.200 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుంది. 
మన్‌పసంద్‌ బేవరీజెస్‌:- నేడు(మే 28న) జరగాల్సిన బోర్డు సమావేశం రద్దు అయ్యింది. 
ఇన్ఫో ఎడ్జ్‌(ఇండియా):- హై ఆర్బిట్‌ కేరియర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను విలీనం చేసుకునేందుకు ఆమోదం తెలిపింది. 
నేడు క్యూ4 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, స్పైస్‌ జెట్‌, అదానీ ట్రాన్స్‌మిషన్స్‌, ఆర్‌బీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌, మాక్స్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌, ఎన్‌ఎండీసీ, ఫిజర్‌, షిప్పింగ్‌ కార్పోరేషన్‌, షాలీమార్‌ పేయింట్స్‌, ఎస్‌ఎంఎల్‌ కంపెనీలతో సుమారు 380 కంపెనీలు తమ క్యూ4 ఫలితాలను ప్రకటించినున్నాయి. 

 



You may be interested

స్వల్పంగా తగ్గిన పసిడి ధర

Tuesday 28th May 2019

అమెరికా- చైనాల మధ్య వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటీకీ.., మంగళవారం ప్రపంచమార్కెట్లో పసిడి సైతం తగ్గుముఖం పట్టాయి. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ 2.50డాలర్లు తగ్గి 1,281.45డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అయితే రానున్న రోజుల్లో మాత్రం పసిడి ర్యాలీకే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా మేలో విడుదల చేసిన బలహీన ఆర్థిక గణాంకాలకు తోడు, అమెరికా - చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు రోజుకోమలుపు తీసుకుంటున్న నేపథ్యంలో

లాభాల ప్రారంభం

Tuesday 28th May 2019

లోక్‌సభ ఎన్నికల్లో మార్కెట్‌ అంచనాల్ని మించి బీజేపీ విజయం సాధించడంతో గతవారం మార్కెట్లో మొదలైన ర్యాలీ మంగళవారం ప్రారంభసమయంలో కూడా కొనసాగింది. 70 పాయింట్లకుపైగా లాభంతో 39,750 పాయింట్ల పైన  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ట్రేడింగ్‌ ప్రారంభంలో 15 పాయింట్ల లాభంతో 11,940 పాయింట్ల ఎగువన మొదలయ్యింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో అదాని పోర్ట్స్‌, వేదాంత, యస్‌బ్యాంక్‌, కోల్‌ ఇండియా, హిందాల్కోలు 1-2 శాతం పెరగ్గా, జీ టెలి, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, గ్రాసిమ్‌లు 1

Most from this category