News


మంగళవారం వార్తల్లో షేర్లు

Tuesday 27th August 2019
Markets_main1566880935.png-28041

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
సన్‌ఫార్మా:-
అజెలైక్ యాసిడ్ జెల్‌ను మార్కెట్లో విక్రయించేందుకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకుంది. 
ఇన్ఫోసిస్‌:- బై బ్యాక్‌ ఇష్యూ ముగించేందుకు బోర్డు అనుమతులు ఇచ్చింది. 11.05 కోట్ల ఈక్విటీ షేర్లను సగటున రూ .747.38 చొప్పున కొనుగోలు చేసింది. 
పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌:- బెంగళూర్‌ ఆధారిత కంపెనీ చేతన ఎక్స్‌పొటెన్షియల్‌ టెక్నాలజీస్‌తో కలిసి జాయింట్‌వెంచర్‌ను ఏర్పాటుకు సిద్ధమైంది.
కజారియా సిరామిక్స్‌:- తన అనుబంధ సం‍స్థ కజారియా టైల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ విలీనానికి బోర్డు ఆమోదం తెలిపింది.
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా:- టైర్‌-I, టైర్‌-II బాండ్ల జారీ ద్వారా రూ.2150 కోట్ల రుణ సమీకరణకు రుణాదాతలు ఆమోదం తెలిపారు.
రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌:- నిప్పన్‌ లైఫ్‌ ఓపెన్‌ ఆఫ్‌ ద్వారా కంపెనీ 10.6శాతం వాటాను కొనుగోలు చేసింది. తద్వారా కంపెనీలో మొత్తం వాటా 53.46శాతానికి పెంచుకుంది. 
వడిలాల్‌ ఇండస్ట్రీస్‌:- కేర్‌ రేటింగ్‌ సంస్థ.. కంపెనీ దీర్ఘకాలిక రుణ సదుపాయంపై రేటింగ్‌ను బిబిబి(+) నుంచి బిబిబికు డౌన్‌గ్రేడ్‌ చేసింది. నెగిటివ్‌ అవుట్‌లుక్‌ కేటాయించింది. 
ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్స్‌:- ఎన్‌సీడీలపై ఆగస్ట్‌ 24న చెల్లించాల్సిన వడ్డీని చెల్లించడంలో విఫలమైంది. 
సాతిన్‌ క్రిడెట్‌కేర్‌ నెట్‌వర్క్‌:- కంపెనీ సెక్రటరీ, కంపల్సన్‌ అధికారిగా చౌదరీ రణ్‌వీర్‌ కృష్ణణ్‌ నియమితులయ్యారు.
బ్రూక్స్‌ ల్యాబ్స్‌:- కంపెనీ అదనపు డైరెక్టర్‌గా సురేష్‌ గార్గ్‌ నియమితులయ్యారు.
స్టోన్‌ ఇండియా:- కంపెనీ ఛైర్మన్‌ పదవికి గౌరీ ప్రసాద్‌ గోయెంకా రాజీనామా చేశారు. 



You may be interested

నష్టాలో ఒరాకిల్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు

Tuesday 27th August 2019

దేశియంగా ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడవుతున్నప్పటికి అంతర్జాతీయంగా ట్రేడ్‌  వార్‌ ఆందోళనలతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌​ నష్టాల్లో ట్రేడవుతోంది. ఉదయం 10.04 సమయానికి నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 1.35 శాతం నష్టపోయి 15,675.00 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవి వెయిట్‌ షేర్లయిన ఇన్ఫోసిస్‌ 2.49 శాతం నష్టపోయి రూ. 782.60 వద్ద, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2.11 శాతం నష్టపోయి రూ. 1,069.75 వద్ద, టీసీఎస్‌ 1.28 శాతం

71.70 వద్ద రూపీ ప్రారంభం

Tuesday 27th August 2019

అంతర్జాతీయ పరిణామాలతో పాటు చైనా తన కరెన్సీ యువాన్‌ విలువను తగ్గించుకోవడంతో రూపీ డాలర్‌ మారకంలో స్వల్పంగా బలహీనపడి 71.70 వద్ద ప్రారంభమైంది. తీవ్రమైన యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ వలన గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 72 మార్కును దాటగా, దేశియ ఈక్విటీ మార్కెట్‌లు ర్యాలీ చేయడంతో తిరిగి కోలుకొని​ 71.67 వద్ద ముగిసింది. ఉదయం 9.49 సమయానికి రూపీ డాలర్‌ మారకంలో 71.83 వద్ద ట్రేడవుతోంది.

Most from this category