STOCKS

News


సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 19th August 2019
Markets_main1566187397.png-27842

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌:-
సంస్థ రుణాలపై స్పష్టతనిచ్చింది. ఈ ఏడాది జూలై 31నాటికి సంస్థకు మొత్తం రూ. 4,970 కోట్ల రుణాలున్నట్లు తెలిపింది. గ్లోబల్‌ విలేజ్‌ టెక్‌ పార్క్‌ను బ్లాక్‌స్టోన్‌ సంస్థకు విక్రయంతో వచ్చిన నిధుల ద్వారా మొత్తం రుణాన్ని రూ.2400 కోట్లకు పరిమితం చేసుకోవాలని భావిస్తుంది.
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:- ప్రస్తుత పరిస్థితులో క్యూ1 ఫలితాలను అనుకున్న తేదికి విడుదల చేయలేమని ప్రకటించింది. అయితే సెప్టెంబర్‌ 14నాటికి ప్రకటించే అవకాశం ఉందని తెలిపింది.
కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌:- 3నెలల కాలవ్యవధి నుంచి 3 ఏళ్ల కాలపరిమితి కలిగిన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేటు (ఎంసీఎల్‌ఆర్)ను 10బేసిస్‌ పాయింట్లు పెంచింది. 
సుందరమ్‌ క్లేటన్‌:- అటో రంగంలో మందగమనంలో నేపథ్యంలో చెన్నై యూనిట్‌ రెండురోజుల మూసివేసినట్లు ప్రకటించింది. 
అపోలో హాస్పిటల్స్‌:- ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ (ఇఇఎస్ఎల్) పబ్లిక్ ఈవి ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి అపోలో హాస్పిటల్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది 
టెక్‌ మహీంద్రా:- తన అనుబంధ సం‍స్థ ఫిక్స్‌స్ట్రీమ్‌ నెట్‌వర్క్‌ సంస్థలో 73.38శాతం వాటాను 2 మిలియన్‌ డాలర్లకు యూఎస్‌ ఆధారిత అనుబంధ సంస్థ రిసాల్వ్‌ సిస్టమ్స్‌కు విక్రయించింది. 
సిప్లా:- షేర్‌ హోల్డర్లు రూ.3000 కోట్ల నిధుల సమీకరణకు ఆమోదం తెలిపారు. 
పంజాజ్‌ సింధ్‌ బ్యాంక్‌:-  మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేటు (ఎంసీఎల్‌ఆర్)ను 20బేసిస్‌ పాయింట్లు పెంచింది. 
టీవీఎస్‌ మోటర్‌ కంపెనీ:- ప్రిడిక్ట్రానిక్స్ కార్పొరేషన్స్‌లో 3.2 మిలియన్‌ డాలర్ల వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టింది. 
టైటాన్‌ కంపెనీ:- తన అనుబంధ సంస్థ కారెట్‌ లైన్‌లో ప్రతి షేరు ధర రూ.328 చొప్పున మొత్తం 2.8శాతం వాటాను కొనుగోలు చేసింది.

నేడు క్యూ1 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ సెల్యూషన్స్‌, క్వాలిటీ, ఓప్టో సర్క్యూట్స్‌, ధృవ్‌ వెల్‌నెస్‌, గ్లాన్‌సీ ఫైనాన్స్‌, ఇండస్ట్రీయల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌, ఐఐటీఎల్‌ ప్రాజెక్ట్స్‌, రియల్‌ గ్రోత్‌ కమర్షియల్‌, ట్రిడెంట్‌ టూల్స్‌.You may be interested

క్రూడ్‌ కేంద్రంపై దాడి..పెరిగిన చమురు

Monday 19th August 2019

సౌదీ చమురు కేంద్రంపై యెమెన్ వేర్పాటువాదులు శనివారం దాడి చేయడంతో సోమవారం(అగష్టు 19) ట్రేడింగ్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరిగాయి. కానీ చమురు ధరల వృద్ధి తగ్గుదలను ఒపెక్ నివేదిక పేర్కొనడంతో, అంతర్జాతీయంగా చమురు డిమాండ్ ఆందోళనలు క్రూడ్‌ ఆయిల్‌ను వెంటాడుతున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 0.8 శాతం పెరిగి బ్యారెల్‌ 59.09 డాలర్లకు, డబ్యూటీఐ క్రూడ్‌ 0.7 శాతం పెరిగి బ్యారెల్ 55.26 డాలర్లకు చేరుకున్నాయి.    తూర్పు సౌదీ అరేబియాలోని

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Monday 19th August 2019

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావంతో భారత్‌ స్టాక్‌ సూచీలు సోమవారం గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 135 పాయింట్లు జంప్‌చేసి 37,485 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 47 పాయింట్ల పెరుగుదలతో 11,095 పాయింట్ల వద్ద ఆరంభమయ్యింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ 3 శాతం లాభాలతోనూ, టైటాన్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌,  సన్‌ఫార్మాలు 1-2 శాతం మధ్య లాభాలతోనూ ట్రేడింగ్‌ ప్రారంభించాయి. మరోవైపు టాటా మోటార్స్‌, యూపీఎల్‌, బ్రిటానియా,

Most from this category