News


నేటి వార్తల్లోని షేర్లు

Wednesday 5th February 2020
Markets_main1580881603.png-31524



వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం స్టాక్‌ మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు

రిలయన్స్‌ ఇన్‌ఫ్రా: రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనీల్‌ అంబానీ కుమారులు జై అనమోల్‌ అంబానీ, జై అన్షల్‌ అంబానీలు రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బోర్డుకు నియమితులైన ఆరునెలల్లోనే రాజీనామా చేశారు.

ఐఓసీ:  ఇజ్రాయిల్‌కు చెందిన బ్యాటరీ డెవలపర్‌ ఫినర్జీలో ఐఓసీ చిన్నమొత్తం వాటాను కొనుగోలు చేసినట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించింది

సన్‌ఫార్మా: పెద్ద పరిమాణంలో ఇబ్బంది పెట్టె మొటిమలను నివారించేందుకు ఆబ్సొరికా ఎల్‌డీ క్యాప్య్సూల్‌లను అమెరికా మార్కెట్‌లో ప్రవేశపెట్టినట్లు సన్‌ఫార్మా వెల్లడించింది. ఈ క్యాప్య్సూల్‌ను 12 ఏళ్లు పైబడిన వారు తీసుకోవచ్చని తెలిపింది. 

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌:  భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ పై ఉన్న నేరారోపణలు , దాన్ని కొనుగోలు చేసిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు ఎంతవరకు వర్తిస్తాయనే దానిపై ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

జీ మీడియా: జీ మీడియా కార్పొరేషన్‌ కంపెనీకి చెందిన బాండ్లు భారీ డిస్కౌంట్‌లో ట్రేడ్‌ అయ్యాయి.

ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌: ప్రేస్టేజ్‌ గ్రూప్‌ 400 మిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించేందుకు  కెనడాకు చెందిన ఒంటారియో టీచర్స్‌ పెన్షన్‌ ప్లాన్‌, సింగపూర్‌ కేం‍ద్రంగా పనిచేస్తున్న కాంగ్లోమీరేట్‌ కెప్పల్‌ కార్పొరేషన్‌, జపానీస్‌ ఇన్‌స్టీట్యూషనల్‌  ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతుంది.

ఫస్ట్‌ సోర్స్‌ సొల్యూషన్స్‌: ఈ కంపెనీ క్యూ3లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 9 శాతం తగ్గి రూ.89.5 కోట్లుగా నమోదైంది. 2018లో మూడోత్రైమాసికంలో నికర ఆదాయం రూ.98.1 కోట్లని కంపెనీ తెలిపింది

ఆర్‌ఈసీ: డిసెంబర్‌తో ముగిసిన క్యూ3లో  ఆదాయం పెరగడంతో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 30 శాతం పెరిగి రూ.1,667 కోట్లకు చేరింది. 2018లో ఇదే త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.1,284 కోట్లుగా ఉంది.

టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ: విక్రయాలు పడిపోవడంతో ఈ కంపెనీ డిసెంబర్‌తో ముగిసిన క్యూ3లో నికర లాభం 21 శాతం తగ్గి రూ.157 కోట్లకు చేరింది.

జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ: ఈ కంపెనీ క్యూ3లో నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ.394 కోట్లకు చేరింది. కాగా 2018 క్యూ3లో నికర లాభం రూ.146 కోట్లుగా ఉంది. 

టాటా గ్లోబల్‌ బేవరేజస్‌: డిసెంబర్‌తో ముగిసిన క్యూ3లో కంపెనీ నికర లాభం 25శాతం వృద్ధి చెంది రూ.136 కోట్లకు చేరింది. 2018 ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.109 కోట్లుగా ఉంది.



You may be interested

లాభాల్లో బ్యాంకింగ్‌ రంగ షేర్లు: అరశాతం పెరిగిన బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 5th February 2020

మార్కెట్లో బుధవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ దాదాపు 1శాతం(287 పాయింట్లు) పెరిగింది.  మార్కెట్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్‌ రంగ షేర్ల కొనుగోళ్లకు ఆసక్తిచూపారు. ఫలితంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఒకదశలో 0.84శాతం(287 పాయింట్లు) పాయింట్ల పెరిగి 30,945.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్‌ మునుపటి ముగింపు (30,686.70)తో

అవంతీ ఫీడ్స్‌ పతనం- గ్రాన్యూల్స్‌ జోరు

Wednesday 5th February 2020

13 శాతం కుప్పకూలిన అవంతీ 5 శాతం జంప్‌చేసిన గ్రాన్యూల్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ఆక్వా రంగ కంపెనీ అవంతీ ఫీడ్స్‌ కౌంటర్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అయితే మరోపక్క అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ) నుంచి ఏఎన్‌డీఏకు అనుమతి లభించినట్లు వెల్లడించడంతో ఫార్మా రంగ కంపెనీ గ్రాన్యూల్స్‌ ఇండియా జోరందుకుంది. అవంతీ ఫీడ్స్‌ లిమిటెడ్‌ ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌- డిసెంబర్‌)లో అవంతీ ఫీడ్స్‌ లిమిటెడ్‌ నికర

Most from this category