News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 21st August 2019
Markets_main1566361838.png-27905

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
సన్‌ఫార్మా అడ్వాన్డ్స్‌ రీసెర్చ్‌:-
టాక్లాంటిస్ ఇంజెక్షన్ కోసం కంపెనీ యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతులు కోసం ధాఖలు చేయడం ఆరెంజ్ బుక్ లిస్టెడ్ పేటెంట్లను ఉల్లంఘించే చర్య అని ఆరోపిస్తూ యుఎస్ కంపెనీ అబ్రక్సిస్ బయోసైన్సెస్ ఎల్ఎల్సి యూఎస్‌ కోర్టులో పిటిషన్‌ ధాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్‌ అర్హత లేకుండా ఉందని, ఈ ఆరోపణలు అర్థరహితం‍గా ఉన్నట్లు కంపెనీ అభిప్రాయపడింది. 
స్పైస్‌ జెట్‌, ఇండిగో:- కంపెనీలకు విమానయన మంత్రిత్వశాఖ కేటాయించిన స్లాట్ల కాలపరిమితిని డిసెంబర్‌ వరకు పొడిగించింది. 
ఎన్‌ఎండీసీ:- డోనిమలై మైనింగ్ లీజును పొడిగిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఎన్‌ఎండీసీ కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో పునఃపరిశీలన పిటిషన్‌ ధాఖలు చేసింది.
స్పైస్‌జెట్‌:- వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా కంపెనీ కార్యకలాపాలను అక్టోబర్‌ 01 నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్  ఇంటర్నేషనల్‌ విమానశ్రయం టెర్మినల్‌ 2కు మారస్తుంది.
అలెంబిక్‌ ఫార్మాస్యూటికల్స్‌:- ఇటీవల వడోదర ప్లాంట్‌ను తనిఖీలు చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ ఎలాంటి లోపాలను గుర్తించలేకపోవడంతో పాటు జీరో అబ్జర్వేషన్లు కేటాయించింది. 
డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌:- దువ్వాడా ఫార్మూలేషన్‌ తయారీ ఫ్లాంట్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ 8 అబ్జరేషన్‌లతో కూడిన 483-ఫామ్‌ను కేటాయించింది.
రిలయన్స్‌ క్యాపిటల్‌:- జూపిటర్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ తన మొత్తం 4.65శాతం వాటాను విక్రయించనుంది. 
దీపక్‌ నైట్రేట్‌:-  ఇక్రా రేటింగ్‌ సంస్థ ధీర్ఘకాలిక రేటింగ్‌ను ‘ఎ+’ నుంచి ‘ఎఎ-’కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. 
షాపూర్‌జీ పల్లోంజి ఫైనాన్స్‌:- టూరిజం ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లో వాటాను 6.61 శాతం నుంచి 4.41శాతానికి తగ్గించుకుంది.
నేడు క్యూ1 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- జీటీఎన్‌ ఇండస్ట్రీస్‌, ప్రోక్టర్‌ అండ్‌ గమబల్‌ హైజనిక్‌, థక్రల్‌ సర్వీసెస్‌, వలేచా ఇంజనీరింగ్స్‌You may be interested

ఎస్‌బీఐ పండుగ ధమాకా..!

Wednesday 21st August 2019

తక్కువ వడ్డీపై గృహ, వాహన రుణాలు ప్రాసెసింగ్‌ ఫీజు మాఫీ ప్రీ–అప్రూవ్డ్‌ డిజిటల్‌ రుణాలు కూడా న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా పండుగ సీజన్‌ ఆఫర్లు ప్రకటించింది. తక్కువ వడ్డీకే గృహ .. వాహన రుణాలు, ప్రాసెసింగ్‌ ఫీజులు మాఫీ, ప్రీ–అప్రూవ్డ్‌ డిజిటల్‌ రుణాలు మొదలైన ఆఫర్లు అందిస్తున్నట్లు వెల్లడించింది. ‘అత్యంత తక్కువగా 8.70 శాతం వడ్డీ రేటు నుంచి కారు రుణాలు అందిస్తున్నాం. పండుగ

బలపడిన రూపీ..71.45 వద్ద ప్రారంభం

Wednesday 21st August 2019

రూపీ డాలర్‌ మారకంలో బుధవారం 25 పైసలు బలపడి 71.45 వద్ద ప్రారంభమైంది. అనిశ్చితిలో ఉన్న దేశియ ఆర్థిక వ్యవస్థ కారణాన గత సెషన్లో రూపీ డాలర్‌మారకంలో మరో 28 పైసలు బలహీనపడి 71.70 వద్ద ముగిసింది. ఆర్థిక మందగమనం, విదేశీ నిధుల ఔట్‌ఫ్లో దృక్పథం, చాలా వరకు అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీలలో బలహీనత వంటి అంశాల వలన ఫారెక్స్‌ ఇన్వెస్టర్లు జాగ్రత్త వహిస్తున్నారు. కాగా వివిధ రంగాలలో

Most from this category