News


నేటి వార్తల్లోని షేర్లు

Thursday 27th February 2020
Markets_main1582779743.png-32131

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు

హెయూఎల్‌, జీఎస్‌కే కన్జూమర్‌: గ్లాక్సోస్మిత్‌క్లైన్‌ కన్జూమర్‌కుచెందిన ఫుడ్‌ బ్రాండ్లను హెచ్‌యూఎల్‌లో  విలీనం చేసేందుకు చండీఘడ్‌ ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ క్లియరెన్స్‌ ఇచ్చింది. తద్వారా  హెచ్‌యూఎల్‌లో 5.7 శాతం వాటాను జీఎస్‌కే కన్జూమర్‌ సొంతం చేసుకోనుంది.

అపోలో టైర్స్‌: గ్లోబల్‌ కంపెనీ అయిన వార్‌బర్గ్‌ పిన్‌కస్‌ 150 మిలియన్‌ డాలర్లను అపోలో  టైర్స్‌లో పెట్టుబడులు పెట్టబోతున్నట్లు అపోలో టైర్స్‌ వెల్లడించింది.

వేదాంత: బీపీసీఎల్‌లో ఉన్న ప్రభుత్వ వాటాను కొనుగోలు చేసేందుకు వేదాంత గ్రూప్‌ ప్రయత్నిస్తుందని, అయితే వేదాంత ఆస్తుల మదింపు అంచనాలను బట్టి కొనుగోలు ఉంటుందని వేదాంత కంపెనీ స్పష్టం చేసింది.

శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌: ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ బేసీస్‌ ద్వారా బాండ్లను జారీ చేసి రూ.500 కోట్ల నిధులను సమీకరించాలని శ్రీరామ్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ ఫైనాన్స్‌ నిర్ణయించింది.

థామస్‌కుక్‌: థామస్‌కుక్‌ ఇండియా కంపెనీ సొంత ఈక్విటీ షేర్లు సుమారు 26,08,956షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది.ఒక్కో షేరును రూ. 57.50 ధరకు కొనుగోలు చేయడం ద్వారా రూ.150 కోట్లను వెచ్చించనుంది. 



You may be interested

మార్చి నెలకు నిఫ్టీ షార్ట్‌ రోలోవర్స్‌!

Thursday 27th February 2020

మార్చి నిఫ్టీ ఫ్యూచర్స్‌ బుధవారం ఫిబ్రవరి నిఫ్టీ ఫ్యూచర్స్‌ కన్నా డిస్కౌంట్‌లో ట్రేడయ్యాయి. చాలా మంది ట్రేడర్లు ఫిబ్రవరి షార్ట్‌ పొజిషన్లను మార్చికి రోలోవర్‌ చేసుకోవడంతో పాటు పలు కొత్త షార్ట్స్‌ పెరిగాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రపంచ మార్కెట్లన్నీ భయం నీడలో నడుస్తున్నాయి. గురువారం ఉదయం 11 గంటల సమయానికి మార్చి నిఫ్టీ ఫ్యూచర్స్‌ 11573 పాయింట్ల వద్ద, స్పాట్‌ నిఫ్టీ 11565 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.

స్వల్పంగా పెరిగిన పుత్తడి

Thursday 27th February 2020

రెండురోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర గురువారం స్వల్పంగా పెరిగింది. గురువారం దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే రూ.24 పెరిగి 10 గ్రాముల పసిడి రూ.42,676.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ నిన్నటితో పోలిస్తే 9 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం ధర 1,651 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. (బుధవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)

Most from this category