News


నేటి వార్తల్లోని షేర్లు

Monday 10th February 2020
Markets_main1581311960.png-31649

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం స్టాక్‌ మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు

సెయిల్‌: ఖజానాకు రూ.1,000 కోట్లను సమీకరించేందుకు సెయిల్‌లోని 5 శాతం వాటాను విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

ఎస్‌బీఐ, బీఓబీ అండ్‌ హెచ్‌డీఎఫ్‌సీ: రిలయన్స్‌ జియో ఇన్‌ఫ్రాటెల్‌ పబ్లిక్‌ ఇష్యూ జారీ ద్వారా రూ.25,000 కోట్ల నిధులు సమీకరించి, దీనిలో మూడోవంతును ఈ బ్యాంకుల రుణాలను చెల్లించనుంది.

డీఎల్‌ఎఫ్‌: హర్యాణాలోని గురుగావ్‌, పంచకులలో ఇండిపెండెంట్‌ గృహాలను అమ్మడం ద్వారా వచ్చే రెండేళ్లల్లో రూ.5,000 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని డీఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌ భావిస్తోంది.

జేకే సిమెంట్‌: డిసెంబర్‌తో ముగిసిన క్యూ3లో ఈ కంపెనీ నికర లాభం రెండు రెట్లు పెరిగి 137.5 కోట్లకు చేరింది. కాగా గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.61 కోట్లుగా ఉంది.

సిప్లా: మహిళల ఆరోగ్య విభాగంలో మరింత ముందుకు సాగేందుకు వ్యాన్‌బరీ లిమిటెడ్‌ నుంచి నాలుగు బ్రాండ్లను కొనుగోలు చేసినట్లు సిప్లా వెల్లడించింది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భాగ స్వామ్య కంపెనీ యూకేకు చెందిన బీపీ పీఎల్‌సీతో కలిసి ఈ నెలలో కేజీ-డీ6 బ్లాక్‌లోని సహజవాయువును విక్రయించనుంది.



You may be interested

మహీంద్రా అండ్‌ మహీంద్రా 5 శాతం డౌన్‌

Monday 10th February 2020

మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో వాహన వ్రియాలు తగ్గడంతో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 73 శాతం తగ్గి  రూ.380 కోట్లకు చేరింది. కాగా గత ఆర్థిక సంవత్సంలో ఇదే త్రైమాసికంలో పన్ను చెల్లింపులు అన్ని పోగా నికర లాభం రూ.1,396 కోట్లుగా ఉందని కంపెనీ తెలిపింది. దీంతో సోమవారం 11 గంటల ప్రాంతంలో మహీంద్రా అండ్‌ మహీంద్ర షేరు 5.10 శాతం తగ్గి 540.10

కరోనా ఎఫ్టెక్ట్‌- ఫార్మా ఎగుమతులకు చెక్‌?!

Monday 10th February 2020

చైనా నుంచి తగ్గుతున్న బల్క్‌డ్రగ్‌ దిగుమతులు యాంటిబయోటిక్స్‌ తయారీకి ముడిసరుకుల కొరత? ఇప్పటికే ఏపీఐ, తదితరాల ధరలు పెంచిన ట్రేడర్లు కొన్ని కీలకమైన యాంటీబయోటిక్స్‌ ఎగుమతులను నియంత్రించాలని దేశీ ఔషధ శాఖ(డీఓపీ) భావిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇందుకు వీలుగా ఒక అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ కారణంగా చైనాలో పలు ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోవడంతో కొంతమంది ట్రేడర్లు బల్క్‌డ్రగ్స్‌ ధరలను పెంచుతున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో దేశీయంగా అత్యవసరమైన ఔషధాల

Most from this category