News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 13th August 2019
Markets_main1565668744.png-27725

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
అలహదాబాద్‌ బ్యాంక్‌:-
అన్ని రకాల వడ్డీరేట్లపై ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను 15నుంచి 20శాతం తగ్గించింది. 
ఐఆర్‌బీ ఇన్ఫ్రా:- తన అనుబంధ సంస్థ ముంబైలోని పూణే ప్రాజెక్ట్‌ను నిర్ణీత సమయం(ఆగస్ట్‌ 09)లో పూర్తి చేసినట్లు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది.
సింటెక్స్‌ ప్లాస్టిక్‌:- తన అనుబంధ సంస్థ సింటెక్స్‌ ఎన్‌పీ సీఎఎస్‌ సంస్థలో మొత్తం ఈక్విటీని వాటాను ఒక ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థకు విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ వాటా మొత్తం వాటా విలువ రూ.1232.60 కోట్లుగా ఉండవచ్చని మార్కెట్‌ వర్గాల అంచనా. 
వారెకో ఇంజనీరింగ్స్‌:- టెలిమాస్టిక్‌ సెల్యూషన్‌ ప్రొవైడర్‌ కార్‌ఐక్యూలో 74శాతం వాటాను విలీనం చేసుకుంది.
అలెంబింక్‌ ఫార్మాస్యూటికల్స్‌:- డోర్జోలామైడ్ హైడ్రోక్లోరైడ్ ఆప్తాల్మిక్ సొల్యూషన్ ఔషధ తయారీకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకుంది. 
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- రీఫైనరీ, పెట్రోకెమికల్‌ వ్యాపారంలో 20శాతం వాటాను నాన్‌ బైండింగ్‌ పద్దతిలో సౌదీ ఆరాకో సం‍స్థకు రూ. 1.05లక్షల కోట్లకు విక్రయించనుంది.
గ్రాసీం ఇండస్ట్రీస్‌:- నాన్‌ కన్వర్టబుల్‌ డివెంచర్ల జారీ ద్వారా నిధులను సమీకరించేందుకు బోర్డు ఆగస్ట్‌ 14ను బోర్డు సమావేశాన్ని నిర్వహించనుంది.
డీబీ రియల్టీ:- ఆగస్ట్‌6న ప్రమోటర్‌ తనఖా పెట్టిన 2.1 శాతం ఈక్విటీ షేర్లను విడిపించింది.
ప్రజ్‌ ఇండస్ట్రీస్‌:- బ్రెజిల్‌ కంపెనీ డెడిని ఎస్ /ఎ లండస్ట్రియాస్ డి బేస్‌కి ఇథనాల్‌ ఉత్పత్తి సాంకేతిక సేవలను అందించేందకు సహకార ఒప్పందం కుదుర్చుకుంది.

నేడు క్యూ1 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- ఓఎన్‌జీసీ, సన్‌ ఫార్మా, కోల్‌ ఇండియా, నాల్కో, అపోలో హాస్పిటల్స్‌, గ్లెన్‌మార్క్‌ ఫార్మా, భారత్‌ ఫోర్జ్‌, రీట్స్‌, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌, హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌, బ్లూ స్టార్‌, గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, నాగార్జున ఫెర్టిలైజర్స్‌, వీనస్‌ రెమిడీస్‌, అమృతాంజన్‌ హెల్త్‌, అశోక బిల్డ్‌కాన్‌, మణప్పురమ్‌ ఫైనాన్స్‌, పార్శ్వనాధ్‌ డెవలపర్స్‌, రెడింగ్టన్‌ ఇండియా, ఇప్కా ల్యాబ్స్‌, 



You may be interested

తగ్గిన చమురు

Tuesday 13th August 2019

గత సెషన్లో(సోమవారం) స్వల్ప లాభాలను అందుకున్న చమురు, మంగళవారం ట్రేడింగ్‌లో నష్టాల్లో  ట్రేడవుతోంది. అంతర్జాతీయ మందగమన ఆందోళనల వలన  ప్రధాన చమురు ఉత్పత్తిదారులు, చమురు సరఫరా కోతను కొనసాగించే అవకాశం ఉండడంతో గత సెషన్‌లో చమురు స్వల్పంగా లాభపడింది. అంతర్జాతీయ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్‌ ఫ్యూచర్స్ మంగళవారం  0.2 శాతం క్షీణించి బ్యారెల్కు  58.46 డాలర్లకు చేరుకుంది. అదే విధంగా డబ్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ 0.2 శాతం తగ్గి

రిలయన్స్‌ ర్యాలీ....8 శాతం అప్‌

Tuesday 13th August 2019

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) ఆయిల్‌ రిఫైనింగ్‌, పెట్రో కెమికల్‌  విభాగాలలో  సౌదీ ఆరామ్‌తో లక్ష కోట్ల ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ కంపెనీ షేరు మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 6 శాతంగ్యాప్‌అప్‌తో మొదలై, క్షణాల్లో మరో 3 శాతం ఎగబాకి రూ.1,268 వద్ద గరిష్టస్థాయిని నమోదుచేసింది. ఉదయం 9.21 సమయానికి 7.99 శాతం పెరిగి రూ. 1,254.90 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో(శుక్రవారం)  రూ.1,162.10 వద్ద ముగిసిన ఈ షేరు, మంగళవారం ట్రేడింగ్‌లో రూ. 1,233.15

Most from this category