STOCKS

News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 29th October 2019
Markets_main1572322161.png-29194

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్లు వివరాలు
టెలికాం కంపెనీలు:- టెలికాం కంపెనీలకు మరింత ఎదురుదెబ్బ తగిలింది. టెల్కోల రాబడి నిర్వచనం, కేంద్రానికి లైసెన్సు ఫీజులపై చెల్లించాల్సిన జరిమానాను 4నెలల్లోగా చెల్లించాలని ఆర్డర్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేడు భారతీ ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా కంపెనీ షేర్లు ఎక్కువ వాల్యూమ్స్‌తో ట్రేడయ్యే అవకాశం ఉంది.
డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌:- యూఎస్‌ఎఫ్‌డీఏ ఏపీలో శ్రీకాకుళం ఏపీఐ ప్లాంట్‌ తనిఖీలను పూర్తి చేసింది. నిర్వహణ లోపం కారణంగా నాలుగు అబ్జర్వేషన్లతో కూడిన ఫామ్‌ 483ను జారీ చేసింది. 
రిలయన్స్‌ జియో:- రూ. 1.08 లక్షల కోట్ల వరకు ఐడెంటీని లయబిలిటీను బదిలీ చేయడానికి కంపెనీ, కొంతమంది రుణదాతల మధ్య ఒప్పంద పథకాన్ని బోర్డు ఆమోదించింది. 
ఎడెల్వీజ్‌ ఫైనాన్స్‌ సర్వీస్‌:- అమెరికా ఆధారిత కంపెనీ ఆర్థర్‌ జే.గల్లాఘర్‌ అండ్‌ కో కంపెనీ మైనార్టీ వాటాను చేజిక్కించుకుంది. 
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- డిజిటల్ ప్లాట్‌ఫాం కార్యక్రమాల కోసం పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థను ఏర్పాటు చేయడం, డిజిటల్ ప్లాట్‌ఫామ్ కోసం అనుబంధ సంస్థగా ఏర్పడటానికి ఓసీపీఎస్‌ ద్వారా రూ .1.88 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టే యోచనలో ఉంది.
ఎన్‌టీపీసీ:- శ్రీలంకలోని కేరవాలాపిటి వద్ద 300 మెగావాట్ల ఎల్‌ఎన్‌జి విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధికి సిలోన్ విద్యుత్ బోర్డుతో కలిసి జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేయనుంది.
ఐసీఐసీఐ బ్యాంక్‌:- జీఎస్‌టీఎన్‌లోని మొత్తం వాటాను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు బదిలీ చేసే ప్రక్రియను బ్యాంక్ ప్రారంభించింది.
ఎంఅండ్‌ఎం:- ప్యుగోట్ మోటోసైకిల్స్‌లో 100శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధమైంది.
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:- రుణాలు తిరిగి చెల్లించడంలో విఫలమవడంతో టాటా మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎన్‌సీఎల్‌టీను ఆశ్రయించనుంది.
నేడు క్యూ2 ఫలితాలను విడుదల చేసే కొన్ని ప్రధాన కంపెనీలు:- అట్లాస్‌ సైకిల్స్‌, హిందూస్థాన్‌ జింక్‌, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ, ఎస్‌కేఎఫ్‌ ఇండియా, టాటామెటాలిక్స్‌, వండర్‌లా హాలిడే. 

 You may be interested

టాటా మోటర్స్‌ 15 శాతం ర్యాలీ!

Tuesday 29th October 2019

టాటా మోటర్స్‌ సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు అంచనాల కంటే బాగుండడంతో ఈ కంపెనీ షేరు మంగళవారం ట్రేడింగ్‌లో ర్యాలీ చేస్తోంది. ఆదివారం ముహురత్‌ ట్రేడింగ్‌లో 17 శాతం లాభపడిన ఈ షేరు, మంగళవారం సెషన్లో ఉదయం 9.45 సమయానికి 15 శాతం లాభపడి రూ. 170 వద్ద గరిష్టస్థాయిని చేరచ్చు. దీపావళి బలిప్రతిపద సందర్భంగా సోమవారం దేశీయ ఈక్విటీ మార్కెట్లు పనిచేయలేదు. గత సెషన్‌లో రూ. 147.70 వద్ద ముగిసిన టాటా

పెరిగిన రూపాయి

Tuesday 29th October 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో మంగళవారం సెషన్‌లో 14 పైసలు బలపడి 70.74 వద్ద ప్రారంభమైంది. కాగా చమురు ధరలు తగ్గడంతో పాటు, దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభపడడంతో అక్టోబర్‌ 25(శుక్రవారం) సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 14 పైసలు బలపడి 70.88 వద్ద ముగిసింది. దీపావళి బలిప్రతిపాద సందర్భంగా అక్టోబర్‌ 28న ఫారెక్స్‌ మార్కెట్లు పనిచేయలేదు. అంతర్జాతీయంగా చమురు డిమాండ్‌ ఆందోళనలు వెంటాడుతుండడంతో చమురు ధరలు మంగళవారం

Most from this category