News


గురువారం వార్తల్లో షేర్లు

Thursday 30th May 2019
Markets_main1559190573.png-25990

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
భార‌తీ ఎయిర్‌టెల్‌:- సింగ‌పూర్ టెలికాం దిగ్గజ కంపెనీ సైన్‌టెల్ కంపెనీ రైట్స్ ఇష్యూ ద్వారా 17 కోట్ల ఈక్విటీ షేర్లను స‌బ్ స్క్రైబ్ చేసుకుంది. ఈ ఈ సబ్‌స్క్రిప్షన్‌ విలువ రూ.3,740 కోట్లుగా ఉంది.
మ‌న్ ప‌సంద్‌:- జీఎస్టీ చెల్లింపు విష‌యంలో మోసానికి పాల్పడిన కంపెనీ అధికారులు అరెస్ట్ అయ్యారు. నిందితుల‌కు కోర్టు బెయిల్ నిరాక‌రించింది. 
చోళ‌మండ‌లం ఇన్వెస్ట్‌మెంట్‌:- యూఎస్ డాల‌ర్ల బాండ్ల  రూపంలో కంపెనీ 222 మిలియ‌న్ డాల‌ర్లను స‌మీక‌రించేందుకు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫైనాన్స్ కార్పోరేష‌న్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 
ఎస్‌బీఐ:- వ‌చ్చే ఆర్థిక సంవ‌త్సరంలో టైర్ - 2 బాండ్ల జారీ ద్వారా రూ.5000 కోట్లను స‌మీక‌రించ‌నుంది. 
అబాన్ ఆఫ్‌షోర్స్:- ఓవ‌ర్సీస్‌లో 400 మిలియ‌న్ డాల‌ర్లను, క్యూఐపీ ప‌ద్ధతిలో రూ.2500 కోట్ల స‌మీక‌ర‌ణ‌కు బోర్డు ఆమోదం తెలిపింది. 
యాక్సిస్ బ్యాంక్‌:- వారెంట్ మార్పిడి ప‌ద్ధతిలో  4.5 కోట్ల ఈక్విటీ షేర్ల జారీకి బోర్డు ఆమోదం తెలిపింది. 
డీహెచ్ఎఫ్ఎల్‌:- ద్రవ్య కొర‌త కారణంగా మే 29 ఎన్‌డీసీల‌పై రుణదాత‌ల‌కు వ‌డ్డీ చెల్లింపులో విఫ‌ల‌మైంది. 
వ‌క్రంజీ:- కంపెనీ కొత్త సీఓఓ, సీఎఫ్ఓగా గోపాల్ బిహాని నియ‌మితుల‌య్యారు. 
టాటా పవర్:- కంపెనీల అనుబంధ సం‍స్థలు నెలిటో సిస్టమ్స్‌లో పూర్తి వాటాను రూ. 15.6 కోట్లకు, జపాన్ సంస్థ డీటీఎస్ కార్పొరేషన్‌కు విక్రయించనున్నాయి.
జేపీ ఇన్‌ఫ్రాటెక్:- రుణదాతలకు రూ. 500 కోట్లు ఇచ్చేందుకు అదాని గ్రూప్ ముందుకు వచ్చిందన్న వార్తలను కొట్టిపారేసింది.  

నేడు క్యూ4 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- అపోలో హాస్పిటల్స్‌, కోల్‌ ఇండియా, హెచ్‌డీఐఎల్‌, ఐడీబీఐ బ్యాంక్‌, నాల్కో, పీసీ జ్యూవెలరీ, ప్రభాత్‌ డైరీ, రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌, సద్భావన్‌ ఇంజనీరింగ్స్‌, సెయిల్‌, సుజ్లాన్‌ ఎనర్జీతో పాటు సుమారు 1250 కంపెనీలు నేడు క్యూ4 ఫలితాలను విడుదల చేయనున్నాయి.You may be interested

తగ్గిన పసిడి ధర

Thursday 30th May 2019

ప్రపంచమార్కెట్లో పసిడి గురువారం తగ్గుముఖం పట్టింది. బాండ్స్‌ ఈల్డ్‌ ర్యాలీ చేయడం, డాలర్‌ ఇండెక్స్‌ రెండేళ్ల గరిష్టస్థాయిలో ట్రేడ్‌ అవుతుండం ఇందుకు నేపథ్యం. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 4.50డాలర్లు నష్టపోయి 1,276.65 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్న తరుణంలో ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మక ధోరణిగా యూఎస్‌ ట్రెజరీ

లాభాల ప్రారంభం

Thursday 30th May 2019

 ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్నా, గురువారం భారత్‌ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 90 పాయింట్ల లాభంతో 39,595 పాయింట్ల వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 11, 885 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. బజాజ్‌ ఆటో, పవర్‌గ్రిడ్‌, బీపీసీఎల్‌, భారతి ఎయిర్‌టెల్‌లు 1-2 శాతం జంప్‌చేయగా, హిందాల్కో, మహింద్రా, వేదాంత, గ్రాసిమ్‌లు 1 శాతం నష్టంతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి.  ట్రేడ్‌వార్‌ ఎఫెక్ట్‌....ఆసియా డౌన్‌ అమెరికా-చైనాల మధ్య ట్రేడ్‌వార్‌ ఉధృతరూపం దాల్చడంతో

Most from this category