News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 28th September 2018
Markets_main1538107365.png-20655

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
కిర్లోస్కర్‌ ఇండస్ట్రీస్‌:- పారిశ్రామిక ప్రయోజనాల నిమిత్తం 675 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం నుంచి అనుమతులు దక్కించుకుంది.
డీబీ రియల్టీ:- నీల్‌కమల్‌ రియల్టీ టవర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో మొత్తం వాటాను కొనుగోలు చేసింది.
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు:- ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో ఈక్విటీ షేర్లను జారీ చేసి రూ.5431 కోట్ల నిధులను సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్చేంజ్‌:- షేర్ల విభజనకు అక్టోబర్‌ 22ను రికార్డు తేదిగా నిర్ణయించింది.
కర్ణాటక బ్యాంకు:- ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్‌ పాలసీ కోసం బజాజ్‌ అలయెన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీతో జతకట్టింది.
కెనరా బ్యాంకు:- అర్హత కలిగిన ఇన్వెస్టర్లకు క్యూఐపీ పద్దతిలో రూ.10లు ముఖవిలువ కలిగిన 25 కోట్ల ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.6,000 సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఆర్‌పీజీ లైఫ్‌ సైన్సెస్‌:- ఎండీ పదవికి సీటీ.రంగనాథ్‌ రాజీనామా చేశారు.
ఎస్‌టెక్‌ లైఫ్‌సైన్సెస్‌ లిమిటెడ్‌:- మహారాష్ట్ర యూనిట్లో వాణిజ్య ఉత్పత్తులను ప్రారంభించింది.
యస్‌ బ్యాంక్‌:- మొండిబకాయిల విషయమై ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని యస్‌ బ్యాంకు స్పష్టం చేసింది.
టాటా పవర్‌:- ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబంధించి వాణిజ్య ప్రతిపదిక ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు హెచ్‌పీసీఎల్‌తో జట్టు కట్టింది.
ఇండియన్‌ బ్యాంకు:- మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పద్మజ చంద్రూ బాధ్యతలు చేపట్టారు.
పంబాబ్‌ నేషనల్‌ బ్యాంకు:- పీఎన్‌బీ బ్యాంకు రుణాలు చెల్లించడంలో విఫలమైనందున హైదరాబాద్‌ ఆధారిత టెలికాం కంపెనీ వీఎంసీ సిస్టమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లు, ప్రమోటర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది.



You may be interested

బలపడిన రూపాయి..

Friday 28th September 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి శుక్రవారం మార్నింగ్‌ ట్రేడింగ్‌లో బలపడింది. పది పైసలు లాభంతో 72.49 వద్ద ప్రారంభమైంది. రూపాయి మునపటి ముగింపు 72.59గా ఉంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి గురువారం ఫ్లాట్‌గానే ముగిసింది. రూపాయి బుధవారం క్లోజింగ్‌ 72.61గా ఉంది. ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్‌లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ.. రూపాయి గత కొన్ని సెషన్లుగా 72.60-73 స్వల్ప రేంజ్‌లో కన్సాలిడేట్‌ అవుతూ వస్తోంది.  కాగా అమెరికా డాలర్‌-రూపాయి

లాభాల ప్రారంభం

Friday 28th September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,324 పాయింట్లతో పోలిస్తే 128 పాయింట్ల లాభంతో 36,452 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,977 పాయింట్లతో పోలిస్తే 31 పాయింట్ల లాభంతో 11,008 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగియడం, ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం మిశ్రమంగా ట్రేడవుతుండటం, వచ్చే రెండేళ్ల కాలంలో అమెరికా ఎలాంటి

Most from this category