News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 1st October 2019
Markets_main1569900019.png-28643

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
వాహన కంపెనీలు నేడు ఆగస్ట్‌ నెల విక్రయ గణాంకాలను విడుదల చేయనున్న నేపధ్యంలో అటో రంగ షేర్లులో యాక్టివిటీ అధికంగా ఉండే అవకాశం ఉంది.
బీపీసీఎల్‌, కంటైనర్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా, షిప్పింగ్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా:- గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ ప్యానెల్ బీపీసీఎల్‌,  షిప్పింగ్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో మొత్తం వాటాను విక్రయించడంతో సహా 5 కంపెనీలలో పెట్టుబడుల ఉపసంహరణకు ఆమోదం తెలిపినట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి.
పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌:- ఇటీవల కంపెనీ జారీ చేసిన రూ.500 కోట్ల విలువైన నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల ఇష్యూకు క్రిసెల్‌ రేటింగ్‌ సంస్థ ఎ1(+) రేటింగ్‌ను కేటాయించింది.
ఎన్‌బీసీసీ:- మణిపూర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎంఓయూపై సంతకం చేసింది. ఈ ప్రాజెక్ట్‌ విలువ రూ.400 కోట్లుగా ఉంది.  
మహీంద్రా అండ్‌ మహీంద్రా:- కంపెనీ బ్యాంక్‌ రుణ సదుపాయాలపై రేటింగ్‌ను.. క్రిసెల్‌ రేటింగ్‌ సంస్థ ‘‘క్రిసెల్‌ ఎఎఎ(స్థిరత్వం)’’నికి అప్‌గ్రేడ్‌ చేసింది.  
పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌:- మూలధన కేటాయింపులో భాగంగా కేంద్రానికి ఫ్రిఫరెన్షియల్‌ షేర్లను జారీ చేసి రూ.3000 కోట్లను సమీకరించింది. 
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా:- మూలధన కేటాయింపులో కేంద్రం నుంచి రూ.7000 కోట్లను స్వీకరించింది. 
పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌:- కంపెనీ ఛైర్మన్‌గా సునీల్‌ మెహతా రాజీనామా చేశారు.
కేడిలా హెల్త్‌కేర్‌:- మెడిక్యూర్‌ ఇంక్‌ కు జిపిటామాగ్ ఔషధ విక్రయ హక్కులను దక్కించుకుంది.
వోకాహార్డ్‌:- కంపెనీ బ్యాంకు సదుపాయాల దృష్ట్యా కేర్‌ రేటింగ్‌ సంస్థ ... కంపెనీ రేటింగ్‌ణు బిబిబి(-) నుంచి బిబి(+)కు అప్‌గ్రేడ్‌ చేసింది.
భారత్‌ రసాయన్‌ లిమిటెడ్‌:- కంపెనీ రూ.20 కోట్ల విలువైన కమర్షియల్‌ పేపర్ల ఇష్యూకు జారీ చేసింది. ఇష్యూకు కేర్‌ రేటింగ్‌ సంస్థ ఎ1(+)గా అప్‌గ్రేడ్‌ చేసింది.
కరూర్‌ వైశ్యా బ్యాంక్‌:- కంపెనీ సర్టిఫికేట్‌ ఆఫ్‌ డిపాజిట్‌ ప్రోగ్రామ్‌ రేటింగ్‌ను క్రిసిల్‌ రేటింగ్‌ సంస్థ ఎ1(+)గా పునరుద్ఘాటించింది. 



You may be interested

52 వారాల గరిష్ఠానికి బీపీసీఎల్‌!

Tuesday 1st October 2019

  బీపీసీఎల్‌(భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌) లోని ప్రభుత్వం మొత్తం వాటాను విక్రయించేందుకు సెప్టెంబర్‌ 30న సమావేశమైన డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్యానెల్‌ అంగీకరించడంతో  మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో  బీపీసీఎల్‌ షేరు 8 శాతం లాభపడి రూ. 511.55 వద్ద ఏడాది గరిష్ఠాన్ని తాకింది. దీంతోపాటు గత సెషన్‌లో చమురు ధరలు భారీగా పడిపోవడంతో కూడా ఈ షేరు ర్యాలీ చేస్తోంది. గత సెషన్‌లో రూ.470.10 వద్ద ముగిసిన ఈ షేరు, మంగళవారం రూ.

గ్యాస్‌ ధర 12 శాతం తగ్గింపు

Tuesday 1st October 2019

రెండున్నరేళ్ల తర్వాత తగ్గించిన కేంద్రం  న్యూఢిల్లీ: దేశీయ సహజ వాయువు ధరను కేంద్ర ప్రభుత్వం 12 శాతం తగ్గించింది. రెండున్నరేళ్ల కాలంలో గ్యాస్‌ ధరను కేంద్రం తగ్గించడం ఇదే మొదటిసారి. ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియాలు ఉత్పత్తి చేసే గ్యాస్‌ ధరను ఒక్కో మిలియన్‌బ్రిటిష్‌ థర్మల్‌ యూనిట్‌కు 3.69 డాలర్ల నుంచి 3.23 డాలర్లకు తగ్గించింది. అలాగే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నేతృత్వంలోని కేజీ-డీ6 వంటి కష్ట సాధ్యమైన చమురు క్షేత్రాల్లో ఉత్పత్తయ్యే గ్యాస్‌

Most from this category