News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 9th April 2019
Markets_main1554785555.png-25014

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
భారతీ ఎయిర్‌టెల్‌:-
మూలధన నిధుల సమీకరణకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. వివిధ పద్ధతుల ద్వారా కంపెనీ సుమారు రూ.25వేల కోట్లను సమీకరించనుంది. 
పనాసియా బయోటెక్‌:- ఇండియా రిసర్జెన్స్ ఫండ్ సంస్థ రూ.992 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. పిరమిల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, బైన్‌ క్యాపిటల్‌ క్రిడెట్‌ కం‍పెనీలు ఇండియా రిసర్జెన్స్‌ ఫండ్‌ సంస్థకు ప్రమోటర్‌ కంపెనీలుగా వ్యవహరిస్తున్నాయి. 
ఉషా మార్టిన్‌:- కంపెనీ సీఎఫ్‌ఓగా రోహిత్‌ నందా రాజీనామా చేశారు. ఈ స్థానంలో అంర్బాన్ సన్యాల్ కొత్త సీఎఫ్‌ఓగా పదవీబాధ్యతలు తీసుకోనున్నారు.
వోల్టాస్‌:- ఇండియాలో జపాన్‌  షిమా సికీ ఉత్పత్తులను విక్రయించేందకు సదరు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. 
ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌:- కంపెనీ సీఎఫ్‌ఓ గిరీశ్‌ గుప్తా స్థానంలో వివేక్‌ కుమార్‌ గోయల్‌ నియమితులయ్యారు. అలాగే సింగపూర్‌లోని అనుబంధ సం‍స్థ ఆర్‌హెచ్‌టీ హెల్త్‌ ట్రస్ట్‌లోని 27.82శాతం వాటాను విక్రయించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. 
ప్రభాత్‌ టెలికామ్‌:- హాంగ్‌కాంగ్‌ దేశానికి చెందిన షిమి పీటీఈ లిమిటెడ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా కంపెనీ దేశంలో ప్రధాన రాష్టా‍్లల్లోని షిమి పీటీఈ టెలికామ్‌ పరికరాలతో పాటు ఇతర ఉత్పత్తులను పంపిణీతో పాటు విక్రయాలు చేయాల్సి ఉంటుంది. 
ఇండో-రమా సింథటెక్స్‌:- కంపెనీ సీఈవో, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా మాగంటి నారయణన్‌ సుధీంద్ర రావ్‌ నియమితులయ్యారు. ఈయన 3ఏళ్ల పాటు తన సేవలన్ని కంపెనీకి అందించనున్నారు. 
ఏషియన్‌ పేయింట్స్‌:- ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నం యూనిట్‌లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగినట్లు ఎక్చే‍‍్సంజ్‌లకు సమాచారం ఇచ్చింది. ప్రమాదంలో ఎలాంటి ఆస్తి నష్టంగానీ, ప్రాణ నష్టంగానీ జరగలేదని తెలిపింది. 
ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌:- ఏడాది కాలంపై ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను 5బేసిస్‌ పాయింట్లు తగ్గించినట్లు ప్రకటించింది. 
డీఎల్‌ఎఫ్‌:- జీఐసీ ప్రతి షేరు ధర రూ.192లు చొప్పున మొత్తం 7 కోట్ల ఈక్విటీ షేర్లను బ్లాక్‌మార్కెట్లో విక్రయించినట్లు తెలుస్తోంది. 
నేడు క్యూ1 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- బజాజ్‌ కన్జూ‍్యమర్‌ కేర్‌, సింప్లెక్స్‌ ప్రాజెక్ట్స్‌You may be interested

లోక్‌సభ ఎన్నికలు, క్యూ4 ఫలితాలే కీలకం..!

Tuesday 9th April 2019

- గురువారం (ఏప్రిల్‌ 11న) జరిగే తొలి విడత పోలింగ్‌పై మార్కెట్‌ దృష్టి - శుక్రవారం ఐటీ దిగ్గజాలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ ఆర్థిక ఫలితాలు వెల్లడి - ఈవారంలోనే ఫిబ్రవరి ఐఐపీ, మార్చి ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు  - బుధవారం ఈసీబీ పాలసీ ప్రకటన, ఎఫ్‌ఓఎంసీ మినిట్స్‌ విడుదల ముంబై: దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికల వేడి పెరుగుతోంది. లోక్‌ సభ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్‌, మే నెలల్లో మొత్తం ఏడు విడతల్లో పోలింగ్‌ జరగనుండగా.. ఈవారంలోనే తొలి

లాభాల ప్రారంభం

Tuesday 9th April 2019

 ఆసియా సూచీల సానుకూల ‍ప్రభావంతో మంగళవారం స్టాక్‌ సూచీలు స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 పాయింట్ల లాభంతో 38,730 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో 11,612 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. భారతి ఎయిర్‌టెల్‌, వేదాంత, విప్రో, టెక్‌ మహింద్రా, ఎస్‌బీఐలు 1-2 శాతం మధ్య లాభాలతో మొదలయ్యాయి. ఆసియన్‌ పెయింట్స్‌, ఐఓసీ, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, బీపీసీఎల్‌, గెయిల్‌లు నష్టాలతో ట్రేడింగ్‌ ఆరంభించాయి. 

Most from this category