News


నేటి వార్తల్లోని షేర్లు

Monday 17th February 2020
Markets_main1581916759.png-31847

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం స్టాక్‌ మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు

ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌: రూ.337.4 కోట్ల షేర్లను కొనుగోలు చేయడానికి వాటాదారులు అంగీకరించినట్లు ఈ కంపెనీ వెల్లడించింది.

డీఎల్‌ఎఫ్‌:  జాయింట్‌ వెంచర్లలో ఉన్న భూములు విక్రయించడం ద్వారా రూ.2,000 కోట్ల నిధులు సమీకరించాలని డీఎల్‌ఎఫ్‌ భావిస్తోంది.

ఆయిల్‌ ఇండియా: మూడు పార్టీలకు లీజుకిచ్చిన బ్యాండ్‌ విడ్త్‌ కు సంబంధించి గతంలో చెల్లించాల్సిన రూ.48,500 కోట్ల విషయంలో టెలికం విభాగంపై టీడీఎస్‌ఏటీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయనున్నట్లు ఆయిల్‌ ఇండియా చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుశీల్‌ చంద్ర మిశ్రా వెల్లడించారు.

ఐడీబీఐ బ్యాంక్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌: ఐడీబీఐని ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో విలీనం చేసేందుకు ఎల్‌ఐసీ చర్యలు వేగవంతం చేసింది.

బీపీసీఎల్‌: బీపీసీఎల్‌ ప్రైవేటీకరణ ప్రతిపాదనకు ఇంటర్‌ మినిస్టీరియల్‌ గ్రూపు ఆమోదం తెలిపింది. మంత్రుల గ్రూపు ఆమోదించిన తర్వాత బీసీసీఎల్‌ బిడ్స్‌కు నోటీసు జారీ చేస్తుంది.

లుపిన్‌: యూఎస్‌పీ 0.5 శాతం కలిగిన మోక్సీఫ్లోక్సాసిన్‌ ఆప్తమాలిక్‌ సొల్యూషన్‌ని  లుపిన్‌ కంపెనీ విడుదల చేసింది.



You may be interested

ఎయిర్‌టెల్‌ రూ.10వేల కోట్ల చెల్లింపు

Monday 17th February 2020

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ సోమవారం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాంకు రూ.10వేల కోట్లను చెల్లించింది. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. సవరించిన స్థూల రాబడి(ఏజీఆర్‌) లెక్కల ప్రకారం ఎయిర్‌టెల్‌ టెలికాం శాఖకు మొత్తం రూ.35వేల కోట్లను చెల్లించాల్సి ఉంది. బకాయిలను చెల్లించకుండా ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియాలు కాలయాపన చేస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో బకాయిలు పడిన మొత్తాన్ని చెల్లించని టెలికాం కంపెనీలకు శుక్రవారం

ఈ పెట్టుబడులు అందరికీ తగవు..!

Monday 17th February 2020

ఎండోమెంట్‌ పాలసీల్లో ప్రయోజనం తక్కువే యులిప్‌ ప్లాన్లలో చార్జీల భారం స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లో రిస్క్‌ పాళ్లు అపరిమితం డెట్‌ ఫండ్స్‌లోనూ కొన్నింటిలో హై రిస్క్‌  సెక్టోరల్‌ ఫండ్స్‌ అన్ని కాలాలకూ తగవు  పీఎంఎస్‌ సేవలు ధనిక ఇన్వెస్టర్లకే పెట్టుబడికి ముందు తగినంత అవగాహన అవసరం పెట్టుబడుల కోసం ఎన్నో సాధనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, అందరికీ అన్నీ సరిపోలవు. ఆయా ఉత్పత్తుల్లో సానుకూల, ప్రతికూలతలు ఉంటాయి. రిస్క్‌ కూడా ఉత్పత్తిని బట్టి మారిపోతుంది. రాబడులు కూడా అన్నింటిలోనూ ఒకే మాదిరిగా

Most from this category