News


సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 1st July 2019
Markets_main1561953563.png-26696

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌:-
దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ను ఆసియా కలర్ కోటెడ్ ఇస్పాట్ లిమిటెడ్ (ఎసీసీఐఎల్) దక్కించుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. జేఎస్‌డబ్ల్యూస్టీల్‌ సమర్పించిన బిడ్‌కు శుక్రవారం ఎసీసీఐఎల్ రుణదాతలు ఆమోదం తెలిపినట్లు సంబంధింత వర్గాలు తెలిపాయి. 
జెట్‌ ఎయిర్‌వేస్‌:- ఐబీసీ చట్టం ద్వారా కంపెనీ బిడ్‌ దక్కించుకునేందుకు హిందూజా ఎతిహాద్‌ కన్షారియం సిద్ధమైంది. టాటా గ్రూప్‌ బిడ్‌పై ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. 
రియలన్స్‌ క్యాపిటల్‌:- కంపెనీ త్రైమాసిక ఫలితాల ప్రకటనను మరోసారి వాయిదా వేసింది. 
సిండికేట్‌ బ్యాంక్‌:- క్యూఐపీ, ఎఫ్‌ఓపీ పద్ధతుల్లో ఈక్విటీ షేర్లను జారీ చేసి  ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ.500 కోట్ల మూలధన సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఎన్‌ఎండీసీ:- ఐరన్‌ ఓర్‌ ధర పెంచింది. టన్ను లూప్‌ ఓర్‌ ధర రూ.3100లుగానూ, ఫైన్‌ ఓర్స్‌ ధర రూ.2860లుగా నిర్ణయించింది.
యూనిటెడ్‌ వాన్‌ డార్‌ హార్ట్స్‌:- ముఖ విలువ రూ.10లు కలిగిన 3.80లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేసి మూలధన నిధులను సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. 
ఎకో లిమిటెడ్‌:- కంపెనీ స్వతంత్ర డెరెక్టర్‌గా ఆర్చన కపూర్‌ రాజీనామా చేశారు. 
రిలయన్స్‌ హోమ్స్‌:- సంస్థ శుక్రవారం నాన్‌ - కన్వర్టబుల్‌ డిబెంచర్లపై చెల్లించాల్సిన రూ.400 కోట్లను చెల్లించడంలో విఫలమైంది. అప్పులను చెల్లించడానికి జరుగుతున్న మోనటైజేషన్‌ ప్రక్రియ నుంచి రావాల్సిన ఆదాయం సరైన సమయంలో అందకపోవడంతో డిబెంచర్ల రుణాన్ని చెల్లించలేకపోయినట్లు శనివారం కంపెనీ వివరణ ఇచ్చింది.
ఏబీబీ ఇండియా:- తన అనుబంధ సంస్థలైన ఏబీబీ పవర్‌ ప్రాడెక్ట్స్‌, సిస్టమ్స్‌ ఇండియా లిమిటెడ్‌ కంపెనీల మధ్య ప్రతిపాదిత పథకానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది.
గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌:- క్యూఐపీ ఇష్యూ ద్వారా రూ.2100 కోట్ల సమీకరణ ప్రక్రియను పూర్తి చేసింది. ఈ మేరకు కంపెనీ శనివారం స్టాక్‌ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది
ఐనోక్స్‌ లైస్యూర్‌:- వాణిజ్య వ్యాపార అవసరాల నిమిత్తం హైదరాబాద్‌లో మల్టీపెక్స్‌ సినిమా థియేటర్లను లీజుకు తీసుకునేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీ:- రూ.10వేల కోట్ల విలువైన నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లపై కేర్‌ రేటింగ్‌ సంస్థ ఎఎ(+) రేటింగ్‌తో పాటు స్థిరత్వం రేటింగ్‌ను కేటాయించింది.
కల్పతరు పవర్‌ ట్రాన్స్‌మిషన్స్‌:- కంపెనీ తాజాగా రూ.975 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది.
జేకే పేపర్‌:- క్రిసెల్‌ రేటింగ్‌ సంస్థ అవుట్‌లుక్‌ రేటింగ్‌ను స్థిరత్వం నుంచి పాజిటివ్‌ రేటింగ్‌కు అప్‌గ్రేడ్‌ చేసింది.
ఏబీసీ ఇండియా:- భెల్‌ కంపెనీ నుంచి రూ.137.70 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది. You may be interested

68.90 వద్ద రూపీ ప్రారంభం

Monday 1st July 2019

డాలర్‌ మారకంలో రూపీ సోమవారం(జూన్‌ 28) ట్రేడింగ్‌లో 12 పైసలు బలపడి 68.90 వద్ద ప్రారంభమైంది. గత సెషన్‌లో రూపీ  69.02 వద్ద ముగిసింది. జీ20 సమ్మీట్‌ ఫలితాలకై మదుపర్లు వేచి ఉండడంతో పాటు రెండు అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థల మధ్య సంధీ కుదరడంతో రూపీ సానుకూలంగా ట్రేడవుతోంది. అమెరికా-చైనా సమావేశం తర్వాత ఆసియా మార్కెట్లు డాలర్‌ మారకంలో బలపడ్డాయి.  గత వారంలో రూపీ 55 పైసలు బలపడిన విషయం​తెలిసిందే.

పాజిటివ్‌ ప్రారంభం

Monday 1st July 2019

ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావంతో సోమవారం భారత్‌ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 205 పాయింట్ల లాభంతో 39,600 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 60 పాయింట్లు జంప్‌చేసి 11,849 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, వేదాంత, యస్‌బ్యాంక్‌ షేర్లు 1-2 శాతం గ్యాప్‌అప్‌తో ట్రేడింగ్‌ను ఆరంభించగా, గెయిల్‌, ఐఓసీ, బీపీసీఎల్‌, టైటాన్‌ షేర్లు స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. 

Most from this category