News


శుక్రవారం వార్తల్లో షేర్లు

Friday 31st May 2019
Markets_main1559277847.png-26009

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితయ్యే షేర్ల వివరాలు 
జెట్‌ ఎయిరవేస్‌:- బిడ్డింగ్‌ ప్రక్రియ కొనసాగుతున్న కారణంగా క్యూ4 ఫలితాలు ప్రకటన ఇప్పట్లో ఉండదని కంపెనీ వర్గాలు తెలిపాయి. 
భారతీ ఎయిర్‌టెల్‌:- గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఏవరేజ్‌ రెవెన్యూ పర్‌ యూజర్‌(ఏఆర్‌పీయూ) రేటు రూ.123లు నమోదైంది. కంపెనీ లిస్టింగ్‌ నాటి నుంచి ఏఆర్‌పీయూ ఇంత స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. ఇదే కాలానికి దేశీయంగా 16 లక్షల యూజర్లను కోల్పోయింది. మొత్తం 28.26 కోట్ల వినియోగదారులున్నారు.
సొనాటా సాఫ్ట్‌వేర్‌:-  కంపెనీ సీఎఫ్‌ఓగా ప్రసన్న రాజీనామా చేశారు. 
ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌:- కంపెనీ సీఎఫ్‌ఓ పదవికి దీపక్‌ ఖైతాన్‌ రాజీనామా చేశారు. అదే స్థానంలో బరూన్‌ అగర్వాల్‌ నియమితులయ్యారు. 
అస్ట్రాజెనికా:- బెంగళూర్‌లో నూతన డెవలప్‌మెంట్‌ ఆపరేషన్‌ సెంటర్‌ను ప్రారంభించింది. 
రామ్‌కో సిమెంట్స్‌:- వచ్చే ఏడాది నాటి నుంచి కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 20మిలియన్‌ టన్నుల లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు రూ.3,500 కోట్లతో 
ప్రాజెక్ట్‌ల విస్తరణ చేపట్టింది. 
లుపిన్‌:-  గోవా యూనిట్‌లో నియంత్రణ నిబంధనల ఉల్లంఘన జరగుతోందని యూఎస్‌ఎఫ్‌డీఏ హెచ్చరించింది.
టాటా టెలీసర్వీసెస్‌:- ప్రిఫరెన్షియల్‌ షేర్లు, నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల జారీ ద్వారా కంపెనీ రూ.35వేల కోట్ల వరకు నిధుల సమీకరించేందుకు సిద్ధమైనట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. 
నేడు క్యూ4 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- ఎన్‌కోర్‌ సాఫ్ట్‌వేర్‌, లక్ష్మీ ఓవర్సీస్‌ ఇండస్ట్రీస్‌, ఎంవీఎల్‌, నకోడా, ఆర్చిడ్‌ ఫార్మా, యూనిటెడ్‌ టెక్స్‌టైల్స్‌You may be interested

బుల్లిష్‌ రోలోవర్లే అధికం!

Friday 31st May 2019

జూన్‌ సీరిస్‌లోకి ఎక్కువగా రోలయిన లాంగ్స్‌ ఎన్‌డీఏ ప్రభుత్వం మరోమారు కొలువు తీరిన నేపథ్యంలో ఎకానమీలో పునరుజ్జీవం ఉంటుందన్న నమ్మకాలు ఎక్కువయ్యాయి. దీంతో సూచీల్లో భారీ పరుగు కనిపించింది. మరోపక్క మార్చి నుంచి భారీగా ర్యాలీ జరపడంతో సూచీల్లో అలసట వచ్చిఉంటుందని, ఇకపై ఎంతమేర పరుగు కొనసాగిస్తాయోనని కొందరు నిపుణులు సందేహపడ్డారు. కానీ తాజాగా జూన్‌ ఎఫ్‌అండ్‌ఓ రోలోవర్లు చూస్తే సూచీల్లో ఇంకా అలుపు రాలేదని, మరింత పరుగు ఉండొచ్చనే సంకేతాలు

నిఫ్టీ @ 12,000, సెన్సెక్స్‌ @ 40,000

Friday 31st May 2019

జూన్‌ డెరివేటివ్‌ సిరీస్‌కు తొలిరోజైన శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 40,000 పాయింట్ల స్థాయిని, నిఫ్టీ 12,000 పాయింట్ల స్థాయిని అధిగమించాయి. సెన్సెక్స్‌ 175 పాయింట్లు జంప్‌చేసి 40,010 పాయింట్ల స్థాయిని చేరగా, నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 12,002 పాయింట్ల స్థాయిని చేరింది. అయితే ఈ రెండు సూచీలూ...గతవారం లోక్‌సభ ఎన్నికల ఫలితాల సందర్భంగా సాధించిన కొత్త రికార్డులకు మరికాస్త దూరంలో వున్నాయి. ఆ రోజున సెన్సెక్స్‌

Most from this category