News


నేటివార్తల్లోని షేర్లు

Tuesday 11th February 2020
Markets_main1581398514.png-31684


వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం స్టాక్‌మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు

లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌(ఎల్‌వీబీ):  అమెరికాకు చెందిన టిల్డన్‌ పార్క్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ లక్ష్మీవిలాస్‌ బ్యాంక్‌లో కొంత మేర వాటాను కొనుగోలు చేయనున్నట్లు ఆర్బీఐకి తెలిపింది. కాగా ఎల్‌వీబీ పెట్టుబడులు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.

భారత్‌ వైర్‌ రోప్స్‌:  మోతీలాల్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ వ్యవస్థాపకులు రామ్‌దేవ్‌ అగర్వాల్‌, మోతీలాల్‌ ఆస్వాల్‌లు  9.42 లక్షల విలువైన  షేర్లను కొనుగోలు చేయడంతో భారతీ వైర్‌ రోప్స్‌ షేర్లు 26 శాతానికిపైగా ర్యాలీ చేసి రూ.32కు చేరుకున్నాయి.

ఎంఅండ్‌ఎం: ఎంఅండ్‌ఎం, ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీల సంయుక్త వెంచర్‌కు సీసీఐ అనుమతి లభించింది.

పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఈ కంపెనీ నికర లాభం రూ.675 కోట్లకు చేరింది.

కల్పతరు పవర్‌ ట్రాన్స్‌ మిషన్‌: ప్రస్తుత ఆర్థిక తసంవత్సరం క్యూ3లో ఈ కంపెనీ  కన్సాలిడేటెడ్‌ నికర లాభం 16.66 శాతం పెరిగి రూ.133 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.144 కోట్లుగా ఉంది.

ఎన్‌డీటీవీ: ఎన్‌డీటీవీ మూడో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 54.95 శాతం పెరిగి రూ.11.25 కోట్లకు చేరింది. 



You may be interested

టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్ గా టాటా గ్లోబల్‌ బేవరేజెస్‌ పేరు మార్పు

Tuesday 11th February 2020

113 బిలియన్‌ డాలర్ల టాటా గ్రూపు కంపెనీ అయిన టాటా గ్లోబల్‌ బేవరేజెస్‌(టీజీబీఎల్‌) పేరును ఇక టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌గా మార్చారు. ఇదే గ్రూప్‌నకు చెందిన టాటా కెమికల్స్‌ లిమిటెడ్‌(టీసీఎల్‌) కన్జూమర్‌ ఉత్పత్తులను టాటా గ్లోబల్‌ బేవరేజెస్‌ లిమిటెడ్‌(టీజీబీఎల్‌)కు బదిలీ చేసిన నేపథ్యంలో టీజీబీఎల్‌ పేరును టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్ లిమిటెడ్‌(టీసీపీఎల్‌) గా మార్చినట్లు అధికారికంగా టాటా గ్రూప్‌ వెల్లడించింది. టీసీపీఎల్‌ ద్వారా భారత ఎఫ్‌ఎంసీజీ మార్కెట్లో తన వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది.

రూ.27.85 లక్షల కోట్లకు ఫండ్స్‌ ఆస్తులు

Tuesday 11th February 2020

జనవరిలో రూ.1.2 లక్షల కోట్ల రాక అధిక శాతం పెట్టుబడులు డెట్‌ పథకాల్లోకే డెట్‌ ఫండ్స్‌లోకి రూ.1.09 లక్షల కోట్లు న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫం‍డ్స్‌ పరిశ్రమ (అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు/ఏఎంసీ) నిర్వహణలోని ఆస్తులు జనవరిలో కొత్త రికార్డు గరిష్టాలకు చేరాయి. ఫండ్స్‌ ఆస్తులు రూ.27.85 లక్షల కోట్లకు చేరాయి. 44 ఏఎంసీలతో కూడిన మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశమ నిర్వహణలోని ఆస్తులు 2019 డిసెంబర్‌ చివరికి రూ.26.54 లక్షల కోట్లుగా ఉంటే, జనవరి చివరికి 5

Most from this category