News


గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 29th August 2019
Markets_main1567053486.png-28081

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం​ ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
ఇండిగో:-
కంపెనీ స్వతంత్ర డైరెక్టర్‌గా మలేవీటిల్‌ దామోదరన్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా అనిల్‌  పరాషర్ నియమితులయ్యారు. 
పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌:- సుమారు రూ.3000వేల కోట్ల విలువైన ఎన్‌సీడీల చెల్లింపుల తేదీని వాయిదావేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌:- ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.1.5లక్షల కోట్ల విలువైన ఎన్‌సీడీల జారీ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఎల్‌అండ్‌టీఫైనాన్స్‌ హోల్డింగ్స్‌:- కంపెనీ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ వ్యాపారాన్ని విభాగాన్ని ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ గ్రూప్ విలీనం చేసుకుంది. 
లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌:- బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఛీప్‌ ఎగ్జిక్యూటివ్‌ పదవికి పార్థసారథి ముఖర్జీ రాజీనామా చేశారు. అలాగే రుణ, ఈక్విటీ షేర్ల జారీ ద్వారా కంపెనీ రూ.500 కోట్ల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఖాదీం ఇండియా:- ఇన్ఫోమెరిక్స్‌ వాల్యూయేషన్‌ అండ్‌ రేటింగ్‌ సంస్థ కంపెనీ కమర్షియల్‌ పేపర్ల రుణ రేటింగ్‌ను ఎ1(+)కు పెంచింది. 
స్పిరింగ్‌ ఫీల్డ్స్‌ ఇన్ఫ్రావెంచర్‌:- నారాయణమ్మ, పుల్లారెడ్డీ ఇంజనీరింగ్స్‌ విద్యాసంస్థల నుంచి కంపెనీ రూ.2కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది.
సాతిన్‌ క్రిడెట్‌కేర్‌ నెట్‌వర్క్స్‌:- ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్దతిలో కంపెనీ రూ.120 కోట్ల నిధుల సమీకరణపై చర్చించేందుకు కమిటి ఈ నెల 31న సమావేశాన్ని నిర్వహించనుంది. 
జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా:- ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.2,500 కోట్ల నిధులను సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే సెప్టెంబర్‌ 16న జరిగే ఏజీఎంలో నిధుల సమీకరణకు షేర్‌హోల్డర్ల అనుమతి తీసుకోనుంది
సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా:- ఈనెల 31న జరిగే బోర్డు మీటింగ్‌లో మూలధన పెంపుపై నిర్ణయం తీసుకోనుంది.
కింగ్‌ఫా సైన్స్‌:- పూణే ప్లాంట్‌లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిందిYou may be interested

స్వల్పకాలానికి స్టాక్‌ సిఫార్సులు

Thursday 29th August 2019

నిపుణులు స్వల్పకాలానికి సిఫార్సులు చేస్తున్న స్టాకులు: సుదర్శన్‌ సుఖాని, ఎస్‌2ఎనలటిక్స్‌.కామ్‌ రికమండేషన్లు నెస్లే ఇండియా: కొనచ్చు; స్టాప్‌ లాస్‌: రూ. 12,100; టార్గెట్‌ ధర: రూ. 13,200 టాటా కన్సల్టెన్సి సర్వీసెస్‌(టీసీఎస్‌): కొనచ్చు; స్టాప్‌ లాస్‌: రూ. 2,200; టార్గెట్‌ ధర: రూ. 2,300 టాటా మోటర్స్‌: అమ్మొచ్చు; స్టాప్‌ లాస్‌: రూ. 121; టార్గెట్‌ ధర: రూ.109 టాటా స్టీల్‌: అమ్మొచ్చు; స్టాప్‌ లాస్‌: రూ. 341; టార్గెట్‌ ధర: రూ. 331 మితెష్‌ థక్కర్‌, మితెష్‌థక్కర్‌.కామ్‌

చమురు లాభాలకు బ్రేక్‌!

Thursday 29th August 2019

శాన్ఫ్రాన్సిస్కో ఫెడరల్ రిజర్వ్ ప్రెసిడెంట్ మేరీ డాలీ యుఎస్‌ ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళన వ్యక్తం చేయడంతో గురువారం ట్రేడింగ్‌లో  చమురు ధరలు పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్‌ 30 సెంట్లు లేదా 0.5 శాతం తగ్గి బ్యారెల్ 60.19 డాలర్లకు చేరుకోగా, డబ్యూటీఐ క్రూడ్‌ 15 సెంట్లు లేదా 0.3 శాతం తగ్గి 55.63 డాలర్లకు పడిపోయింది. కాగా గత సెషన్‌లో చమురు ధరలు 1.5 శాతం పెరగడం గమనార్హం.

Most from this category