News


నేటి వార్తల్లోని షేర్లు

Friday 14th February 2020
Markets_main1581658221.png-31786

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు

నెస్లే ఇండియా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో పరిమాణాత్మక వృద్ధి పెరగడంతో నెస్లే ఇండియా నికర లాభం 38.40 శాతం పెరిగి రూ.473.02 కోట్లకు చేరింది.

జయప్రకాశ్‌ అసోసియేట్స్‌: ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఈ కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర నష్టం రూ.874.44 కోట్లకు చేరింది. కాగా క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర నష్టం రూ.400.72 కోట్లుగా ఉంది.

పీసీ జ్యువెల్లర్‌: ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఈ కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 73 శాతం పెరిగి రూ.35.61 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో కాన్నలిడేటెడ్‌ నికర లాభం రూ.133.03 కోట్లుగా ఉంది. 

ఐటీడీసీ: క్యూ3లో ఇండియా టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఐటీడీసీ) కన్సాలిడేటెడ్‌ నికర లాభం 50.77 శాతం పెరిగి రూ.9.74 కోట్లకు చేరింది.

ఫ్యూచర్‌ రిటైల్‌: క్యూ3లో ఈ కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 16.72 శాతం తగ్గి రూ.164.56 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ​3లో నికర లాభం రూ.197.60 ‍ కోట్లుగా ఉంది.



You may be interested

ఎల్‌ఐసీ విలువ ఎంత?!

Friday 14th February 2020

పలు రకాల మదింపులు చేస్తున్న నిపుణులు రూ. 9.5 లక్షల కోట్లుండొచ్చని అంచనా లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో వాటాలు విక్రయించాలన్న ప్రభుత్వ ఆలోచన దేశీయ మార్కెట్లో అతిపెద్ద మార్కెట్‌వాల్యూ ఉన్న లిస్టెడ్‌ కంపెనీని సృష్టించబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎల్‌ఐసీలో వాటా విక్రయం ద్వారా రూ. 70 వేల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఐపీఓ కార్యరూపం దాలిస్తే దేశంలో అతిపెద్ద ఐపీఓగా చరిత్ర సృష్టిస్తుంది. ఐపీఓ విజయవంతంగా

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి బ్రిటన్ హైకోర్టులో ఊరట

Friday 14th February 2020

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భాగస్వామ్య కంపెనీ షెల్‌కు బ్రిటన్‌ హైకోర్టులో ఊరట లభించింది. వెస్ట్రన్‌ ఆఫ్‌షోర్‌ లో ఉన్న పన్నా-ముక్త, తపతీ ఆయిల్‌  అండ్‌ గ్యాస్‌  క్షేత్రాలు రికవరీ  ధరలు చెల్లించాలని భారత ప్రభుత్వం వేసిన పిటీషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో నిఫ్టీలో రిలయన్స్‌ ఇండస్ట్రీ షేరు 0.34 శాతం తగ్గి 1,469.20 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  

Most from this category