News


సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 8th July 2019
Markets_main1562557551.png-26874

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
మైండ్‌ ట్రీ:-
కంపెనీ సీఈవో, మేనిజింగ్‌ పదవికి డైరెక్టర్‌ పదవికి కె.నటరాజన్‌, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ పదవికి రోస్ట్నో రవణన్‌ రాజీనామా చేశారు. 
అధునిక్‌ ఇండస్ట్రీస్‌:- నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పదవికి మహేష్‌ అగర్వాల్‌ రాజీనామా చేశారు.
సిమైన్స్‌:- గుజరాత్‌లోని హలోల్‌ ఇండస్ట్రీయల్‌ ఏరియా పరిసర ప్రాంతంలోని తన భూభాగాన్ని ఎల్‌ఎం విండ్‌ పవర్‌ బ్లేడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు  రూ.158కోట్లకు విక్రయించింది.
టీమ్‌ లీజ్‌ సర్వీసెస్‌:- కాసియస్ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 25శాతం వాటాను కొనుగోలు చేసింది. దీంతో కంపెనీలో మొత్తం వాటా 76శాతానికి చేరుకుంది.
పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌:- రూ.1500 కోట్ల ఎన్‌సీడీల ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది.
యూనికెమ్‌ ల్యాబ్స్‌:- చైనాలోని తన అనుబంధ సంస్థ యునికైమో ఫార్మాస్యూటికల్‌ కంపెనీని విలీనం చేసుకుంది.
పీపీఏపీ అటోమోటివ్‌:- కంపెనీ సీఎఫ్‌ఓ గా మనీష్‌ ధరివాల్‌ రాజీనామా చేశారు.
ఆస్టిర్‌ సీ మెహతా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌:- కంపెనీ సీఎఫ్‌ఓ గా మమతా గౌతమ్‌ రాజీనామా చేశారు.
భెల్‌:- కంపెనీ రూ.4000 కోట్ల విలువైన కమర్షియల్‌ పేపర్ల ఇష్యూకు ఇండియా రేటింగ్స్‌ సంస్థ ఏ1(+) రేటింగ్‌ను జారీ చేసింది.
భారతీ ఇన్ఫ్రాటెల్‌:- క్రిసెల్‌ రేటింగ్‌ సంస్థ కమర్షియల్‌ పేపర్ల ఇష్యూకు ఎ1(+) రేటింగ్‌ను కేటాయించింది.
ఐఎఫ్‌సీఐ:- కంపెనీ ధీర్ఘకాలిక రుణ సదుపాయాల సౌకర్యాలకు కేర్‌ రేటింగ్‌ సంస్థ రేటింగ్‌ను బిబిబి నెగిటివ్‌ నుంచి బిబిబి(-) నెగిటివ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది.
టాటా గ్లోబల్‌ బేవరేజెస్‌:- కంపెనీ కమర్షియల్‌ పేపర్లకు కేర్‌ రేటింగ్‌ సంస్థ ఎ1(+) రేటింగ్‌ను కేటాయించింది. 
ఇండియా గ్రిడ్‌ ట్రస్ట్‌:- స్టెరిలైట్‌ పవర్‌ నుంచి రెండు పవర్‌ ట్రాన్స్‌మిషన్ల రూ.5025 కోట్లకు కొనుగోలు చేసింది.
నేడు క్యూ1 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- స్టీల్‌ స్ట్రిప్స్‌ వీల్స్‌, గోవా కార్బన్‌, డెల్టా కార్ప్‌You may be interested

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Monday 8th July 2019

కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనల పట్ల నిరుత్సాహానికి తోడు...ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాల కారణంగా  పోమవారం భారత్‌ సూచీలు గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 350 పాయింట్ల నష్టంతో 39,150 సమీపంలో ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 100 పాయింట్ల క్షీణతతో 11,710పాయింట్ల వద్ద మొదలయ్యింది.  ఆసియా సూచీల పతనం.. అమెరికా జాబ్స్‌ డేటా గత శుక్రవారం పాజిటివ్‌గా వెలువడటంతో ఆ దేశపు కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు తగ్గించబోదన్న అంచనాలు మొదలైన

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 50 పాయింట్లు డౌన్‌

Monday 8th July 2019

కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనల పట్ల నిరుత్సాహానికి తోడు...ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాల కారణంగా  పోమవారం భారత్‌ మార్కెట్‌ నెగిటివ్‌గా మొదలయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఈ ఉదయం 8.50 గంటలకు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 50 పాయింట్లు తగ్గింది. ఇక్కడి ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుసంధానంగా సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 11,770 పాయింట్ల వద్ద కదులుతోంది. శుక్రవారం ఇక్కడ ఎన్‌ఎస్‌ఈ జూలై నిఫ్టీ ఫ్యూచర్‌ 11,820 పాయింట్ల వద్ద ముగిసింది. ఆసియా సూచీల పతనం.. అమెరికా

Most from this category