News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 3rd July 2019
Markets_main1562127806.png-26749

వివిధ వార్తలకు సంబంధించిన బుధవారం ప్రభావితమయ్యే షేర్లు వివరాలు 
షాపర్స్‌ స్టాప్‌:-
ఆదిత్య బిర్లా సన్‌ లైన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలో 2శాతం వాటాను కొనుగోలు చేసింది.
బీహెచ్‌ఈఎల్‌:- కంపెనీ  సీఎండీ నలిన్‌ సింఘాల్‌ నియామకం జరిగేంత వరకు ప్రస్తుతం డైరెక్టర్‌గా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న డి.బందోపాధ్యాయ అదనపు బాధ్యతలు తీసుకోనున్నారు. 
కల్పతరు పవర్‌ ట్రాన్స్‌పోర్ట్స్‌:- శుభమ్‌ లాజిస్టిక్స్‌లో మిగిలిన 20శాతం వాటాను రూ.65కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా కంపెనీలో మొత్తం వాటాను సొంతం చేసుకున్నట్లైంది. 
ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌:- జైపూర్‌, తెలంగాణాల్లోని తన అనుబంధ సంస్థ కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసినట్లు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. 
గ్రాఫైట్‌ ఇండియా:- బెంగళూర్‌లో వైట్‌ఫీల్డ్‌ ఫ్లాంట్‌ను శాశ్వతంగా మూసివేసేందుకు నిర్ణయం తీసుకుంది. 
ప్రిసిస్టెంట్‌ సిస్టమ్స్‌:- కంపెనీ స్వతంత్ర డైరెక్టర్‌గా సంజయ్‌ కుమార్‌ భట్టాచార్య రాజీనామా చేశారు. 
టాటా స్పాంజ్‌ ఐరన్‌:- కంపెనీ ప్రకటించిన రూ.1,650 కోట్ల రైట్స్‌ ఇష్యూలో ప్రమోటర్‌ కంపెనీ టాటాస్టీల్‌  90శాతం సబ్‌స్రైబ్‌ చేసుకోనుంది.
మైండ్‌ ట్రీ:- జూన్‌ 17-28 తేదీల మధ్య జరిగిన కొనుగోలుతో ఎల్‌అండ్‌టీ వాటాను 60.06శాతానికి పెంచుకుంది. 
రిలయన్స్‌ హోమ్స్‌ ఫైనాన్స్‌:- కంపెనీకి చెందిన రూ.400 కోట్ల నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లకు కేర్‌ రేటింగ్‌ సంస్థ ‘‘డీ’’ రేటింగ్‌ను కేటాయించింది. 
అదానీ పవర్‌:- సుప్రీం కోర్టు గుజరాత్‌ ఉజ్వల వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ కుదుర్చుకున్న పవర్‌ పర్చేజింగ్‌ అగ్రిమెంట్‌ను రద్దు చేసింది.
యూకో బ్యాంక్‌, అలహదాబాద్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌: కేవైసీ నిబంధనలకు ఉల్లఘించినందుకు ఆర్‌బీఐ ప్రతి బ్యాంకుపై రూ.50లక్షల జరిమానా విధించింది. 
టాటా కమ్యూనికేషన్స్‌:- కంపెనీ సీఈవో, ఎండీగా వినోద్‌ కుమార్‌ రాజీనామా చేశారు.
ఎలక్ట్రోస్టీ్‌ల్‌ క్యాస్టింగ్‌:- వెస్ట్‌ బెంగాల్‌లో ఫెర్రర్‌ ఫ్లాంట్‌లో వాణిజ్య ఉత్పత్తులను జూన్‌ 1 నుంచి ప్రారంభించనుంది. You may be interested

చమురు భారీ పతనం

Wednesday 3rd July 2019

ఒపెక్‌, ఒపెక్‌ ప్లస్‌ దేశాలు చమురు ఉత్పత్తి కోత కాలపరిమితిని పొడిగించినప్పటికి అంతర్జాతీయంగా చమురు డిమాండ్‌ బలహీనంగా ఉండడం వలన గత రాత్రి అమెరికా ట్రేడింగ్‌లో చమురు ధరలు ఏకంగా 4 శాతం మేర పడిపోయాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 64.8 డాలర్ల స్థాయి నుంచి 62 డాలర్ల స్థాయికి, డబ్యూటీఐ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 58 డాలర్ల స్థాయి నుంచి 56 డాలర్ల స్థాయికి పడిపోయాయి. అయితే

68.85 వద్ద ప్రారంభమైన రూపీ

Wednesday 3rd July 2019

డాలర్‌ మారకంలో రూపీ బుధవారం(జులై 3) ట్రేడింగ్‌లో బలపడి 68.85 వద్ద ప్రారంభమైంది. ఈ వారం బడ్జెట్‌ వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచి చూసే దోరణిని అనుసరించడంతో గత సెషన్‌లో రూపీ ప్లాట్‌గా 68.93 వద్ద ముగిసింది. చమురు ధరలు తగ్గినప్పటికి డాలర్‌ బలపడడంతో రూపీ ప్లాట్‌గానే ముగిసింది. అమెరికా తయారిరంగ వృద్ధి రేటు అంచనాల కంటే ఎక్కువగా ఉండడంతో పీఎమ్‌ఐ నివేదిక వెలువడిన తర్వాత డాలర్‌ మూడు నెలల

Most from this category