News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 26th June 2019
Markets_main1561520387.png-26570

వివిధ వార్తల‌కు అనుగుణంగా బుధ‌వారం ప్ర‌భావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు
స్పైస్ జెట్‌:-
కొత్తగా ఎనిమిది నాన్-స్టాప్ ఇంట‌ర్నేష‌న‌ల్ విమానాలను లాంచ్ చేసింది. 
వెల్‌స్పన్ కార్ప్‌:- అర్హత క‌లిగిన షేర్ హోల్డర్లకు డివిడెండ్‌ను జారీ చేసేందుకు జూలై 05ను రికార్డు తేదిగా నిర్ణయించింది. 
ప‌నోర‌మా స్టుడియో ఇంట‌ర్నేష‌న‌ల్:- ఇండియాలో సినిమాల పంపిణి వ్యాపారం కొర‌కు పీపీఆర్ పిక్చర్స్ తో జ‌త క‌ట్టింది. 
విరించి:- ఫ్రిప‌రెన్షియ‌ల్ బేసిస్ ప‌ద్ధతిలో జ‌న‌వ‌రి 06వ తేదిన జారీ చేసిన 3.40 కోట్ల వారెంట్లకు అంతే ప‌రిమాణంలో ఈక్విటీ షేర్లును జారీ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. 
ఐసీఐసీఐ బ్యాంక్‌:- ఎప్లాయిస్ స్టాక్ ఆప్షన్ ప‌థ‌కంలో భాగంగా రూ.2లు ముఖవిలువ క‌లిగిన 3.40ల‌క్షల ఈక్విటీ షేర్లను కంపెనీ ఉద్యోగుల‌కు జారీ చేయ‌నుంది.
డీహెచ్ఎఫ్ఎల్‌:- అన్‌సెక్యూర్డ్ క‌మ‌ర్షియ‌ల్ పేప‌ర్లపై చెల్లించాల్సిన రూ.225 కోట్లను చెల్లించ‌డంతో కంపెనీ విఫ‌ల‌మైంది. బాకీప‌డిన మొత్తాన్ని కొద్దిరోజుల్లో చెల్లిస్తామ‌ని కంపెనీ తెలిపింది. 
జిందాల్ పాలీ ఫిల్మ్‌:- కంపెనీ కొత్త సీఈవోగా గౌరంగ్ దేశాయ్ నియ‌మితుల‌య్యారు. 
హిటాచి కార్పోరేష‌న్‌:- కంపెనీ సీఈవోగా భార‌త్ గ‌సోలియా ప‌ద‌వి విర‌మ‌ణ‌కు బోర్డు ఆమోదం తెలిపింది. ఈయ‌న స్థానంలో అవాన్ చైనా నియ‌మానికి బోర్డు ఆమోదం తెలిపింది. 
గోద్రేజ్ ప్రాప‌ర్టీస్‌:- క్యూఐపీ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇష్యూలో భాగంగా ప్రతి ఈక్విటీ షేరు ధర‌ను రూ. 928లుగా నిర్ణయించింది. 
ఎన్‌టీపీసీ:- ఉత్తర ప్రదేశ్ ప‌వర్ కంపెనీ నుంచి 40మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆర్డ‌ర్లు ద‌క్కించుకుంది. 
మైండ్‌ ట్రీ:- ఎల్‌ అండ్‌ టీ కంపెనీ కంట్రోలింగ్‌ వాటాను చేజిక్కించుకుంది. 
హెల్త్‌కేర్‌ గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజెస్‌:- ఫ్రిపరెన్షియల్‌ బేసిస్‌ పద్ధతిలో ప్రతి షేరు ధర రూ.285లు చొప్పున రూ.7.10లక్షల ఈక్విటీ షేర్ల జారీకి బోర్డు ఆమోదం తెలిపింది. 
రిలయన్స్‌ క్యాపిటల్‌:- బ్రిక్‌ రేటింగ్‌ సంస్థ ధీర్ఘకాలిక రుణ రేటింగ్‌కు  బ్రిక్‌ రేటింగ్‌ సంస్థ బిబిబి రేటింగ్‌ను కేటాయించింది. 
పంజాబ్‌ సింధ్‌ బ్యాంక్‌:- బాసెల్‌ -III నిబంధనలకు అనుగుణంగా టైర్‌ -II బాండ్లను జారీ చేసి రూ. 500 కోట్లను సమీకరణ ప్రక్రియను ప్రారంభించింది. 

నిన్నటి ట్రేడింగ్లో దేశీయఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు రూ. 1,157.87 కోట్ల విలువైన ఈక్వీటీ షేర్లును, దేశీయ ఇన్వెస్ట‌ర్లు రూ.377.22 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల‌ను కొనుగోలు చేశారు.



You may be interested

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Wednesday 26th June 2019

వడ్డీ రేట్ల కోతపై అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ నీళ్లుచల్లడంతో ప్రపంచ సూచీలు క్షీణించిన నేపథ్యంలో భారత్‌ మార్కెట్‌ బుధవారం గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 56  పాయింట్ల తగ్గుదలతో 39,371 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 28 పాయింట్ల క్షీణతతో 11,768 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, బీపీసీఎల్‌, ఐఓసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, యస్‌ బ్యాంక్‌లు 1-2 శాతం తగ్గుదలతో ప్రారంభమయ్యాయి. ఎన్‌టీపీసీ,

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 45 పాయింట్లు డౌన్‌

Wednesday 26th June 2019

ప్రపంచ మార్కెట్ల ప్రతికూలత కారణంగా బుధవారం భారత్‌ మార్కెట్‌ నెగిటివ్‌గా మొదలయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఈ ఉదయం 8.45 గంటలకు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 45 పాయింట్లు క్షీణించిం‍ది. ఇక్కడి ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుసంధానంగా సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 11,765 పాయింట్ల వద్ద కదులుతోంది. మంగళవారం ఇక్కడ ఎన్‌ఎస్‌ఈ జూన్‌ నిఫ్టీ ఫ్యూచర్‌ 11,810 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారాంతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌,

Most from this category