News


నేటి వార్తల్లోని షేర్లు

Tuesday 28th January 2020
Markets_main1580190420.png-31262


వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్లు
ఇంటర్‌ గ్లోబ్‌: ఈ కంపెనీ క్యూ3 కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.185 కోట్ల నుంచి రూ.496 కోట్లకు పెరిగింది. వార్షిక ప్రాతిపదికన  ఆదాయం 25.5 శాతం పెరిగి రూ.9,932 కోట్లకు చేరింది.

టొరంటో ఫార్మా: ఈ కంపెనీ నికర లాభం 2 శాతం పెరిగి రూ.251 కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన ఆదాయం 4.1 శాతం పెరిగి రూ.1,966 కోట్లుగా నమోదైంది.

మారుతీ సుజుకీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా.. మోడల్‌ ఆధారంగా కార్ల ధరను రూ.10,000 వరకు పెంచింది. ముడి వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు, పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని సంస్థ అధికారికంగా వెల్లడించింది. 

ఆప్‌టెక్‌: బిలీనియర్‌ రాకేష్‌ ఝున్‌ఝన్‌వాలా తన కుటుంబానికి చెందిన ఆప్‌టెక్‌ లిమిటెడ్‌ షేర్ల విషయంలో ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై సెబీ దర్యాప్తు చేయనుంది.

సిప్లా, వొకార్డ్‌:  వోక్‌హర్డ్‌ కంపెనీ డొమస్టిక్‌ ఫార్ములేషన్‌ వ్యాపారాన్ని రూ.2,100-2,800 కోట్లకు అమ్మేందుకు ప్రతిపాదనలు చేయగా సిప్లా అండ్‌ ఏషియన్‌లు దీనిని కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డాయి.

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌: ఇక్బాల్‌ మిర్చీ మనీ లాండరింగ్‌, ఉగ్రవాదులకు ఫైనాన్స్‌ చేసిన  కేసులో కీలక సూత్రదారి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్‌ కపిల్‌ విద్వాన్‌ కావడంతో ఈడీ సోమవారం అరెస్టు చేసింది.

కాక్స్‌ అండ్‌ కింగ్స్‌: ప్రముఖ టూర్స్‌ అండ్‌ ట్రావెల్‌ కంపెనీ కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ రుణ చెల్లింపులు విఫలం కావడంతో రుణదాతలు ఫోరెన్సిక్‌ దర్యాప్తును నిర్ణయించాయి.

కోల్‌ ఇండియా: కోల్‌ ఇండియా విదేశీ సముపార్జన ప్రణాళికను ప్రముఖ మర్చంట్‌ బ్యాంక్‌లు వ్యతిరేకించాయి.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బాబ్‌): బాబ్‌ డిసెంబర్‌ మూడో త్రైమాసికంలో నమోదైన సబ్సిడి మొత్తం రూ.10,000 కోట్లు తర్వాతీ క్యూ3లో తగ్గుతుందని కొత్తగా నియమితులైన మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ చీఫ్‌ ఎక్సిక్యూటివ్‌ సంజీవ్‌ చధా వెల్లడించారు. 

యునైటెడ్‌ స్పిరిట్స్‌: ఈ కంపెనీ డిసెంబర్‌ 31తో ముగిసిన క్యూ3లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 16 శాతం పెరిగి రూ.232 కోట్లకు చేరింది. 

 You may be interested

సబ్‌ ఎడిటర్లు కావలెను

Tuesday 28th January 2020

సాక్షి పత్రిక అనుబంధ బిజినెస్‌ వెబ్‌సైట్‌ "బిజినెస్‌@ సాక్షి డాట్‌ కామ్‌‌"లో పనిచేసేందుకు సబ్‌ ఎడిటర్లు/సీనియర్‌ సబ్‌ ఎడిటర్లు కావలెను. మీడియా సంస్థల్లో, న్యూస్‌ వెబ్‌సైట్లలో బిజినెస్‌ విభాగంలో సబ్ ఎడిటర్లుగా, కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాలు సబ్‌ ఎడిటర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. బిజినెస్‌, ఎకానమీ, ఫైనాన్షియల్‌ మార్కెట్లపై అవగాహన కలిగి ఉండాలి. ఇంగ్లీషు నుంచి తెలుగులోకి ట్రాన్స్‌లేషన్ బాగా చేయగలగాలి.  35 సంవత్సరాల లోబడిన వయసు

3శాతం పతనమైన వేదాంత, సెయిల్‌

Tuesday 28th January 2020

చైనాలో మెటల్‌ ఉత్పత్తి తగ్గుముఖం పట్టవచ్చనే అందోళనలతో ప్రపంచ వ్యాప్తంగా మెటల్‌ ధరలు భారీగా దిగివస్తున్నాయి. మెటల్‌ ధరలు తగ్గముఖం పట్టడంతో అటు అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లోనూ మెటల్‌ షేర్ల భారీగా నష్టపోయతున్నాయి. ముఖ్యంగా స్టీల్‌ సంబంధింత షేర్లు ఎక్కువగా నష్టాలను చవిచూస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఉదయం ట్రేడింగ్‌ సెషనలో ఏకంగా 2శాతం నష్టాన్ని చవిచూసింది. ఉదయం గం.10:30ని.లకు

Most from this category