News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 15th May 2019
Markets_main1557893870.png-25741

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
గుజరాత్‌ ఇండస్ట్రీస్‌ పవర్‌ కంపెనీ:-
గుజరాత్‌ ఉర్జా వికాస్‌ నిగమ్‌ టెండర్‌ దక్కించుకునేందుకు విజయవంతంగా బిడ్‌ పక్రియను పూర్తి చేసింది. 
జెట్‌ ఎయిర్‌వేస్‌:- కంపెనీ సీఈవో పదవికి వినయ్‌ దుబే రాజీనామా చేశారు.
టోరెంటో పవర్‌:- ప్రైవేట్‌ పద్ధతితో రూ.270 కోట్ల విలువైన ఎన్‌సీడీల ఇష్యూను జారీ చేసింది. 
ఆర్చిడ్‌ ఫార్మా:- రైస్‌డ్రోనేట్‌ సోడియం ఔషధాల విక్రయాలకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకుంది.
ఫ్యూచర్‌ సప్లై చైన్‌:- వెల్‌కెన్‌ ఎక్స్‌ప్రెస్‌లో తన మొత్తం వాటాను విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
మంగళూర్‌ కెమికల్స్‌&ఫెర్టిలైజరస్‌:- మంగళూర్‌లోని తన అమ్మోనియా, యూరియా, ఏబీసీ ప్లాంట్లను మూసివేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. 
వొడాఫోన్‌ ఐడియా:- తన అనుబంధ సంస్థలైన వొడాఫోన్‌ ఇండియా డిజిటల్‌, ఐడియా టెలిసిస్టమ్స్‌ విలీనానికి బోర్డు ఆమోదం తెలిపింది.
ఎల్‌అండ్‌టీ ఫైనాన్షియల్‌:- రూ.195 కోట్ల విలువైన ఎన్‌సీడీలను జారీ చేసేందుకు ఎల్‌అండ్‌టీ ఫైనాన్షియల్‌ బోర్డు అనుమతినిచ్చింది.
డేటామెటిక్స్‌ గ్లోబల్‌:- డేటామెటిక్స్‌ డిజిటల్‌లో రూ.10.4 కోట్లకు మిగిలిన 18.91శాతం వాటాను కొనుగోలు చేసింది.
జేకే లక్ష్మీ సిమెంట్స్‌:- రూ.500 కోట్ల మూలధన సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఎన్‌ఎండీసీ:- కంపెనీ సామర్థ్య విస్తరణపై దృష్టిపెట్టింది. 100 డాలర్ల కోట్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. 
అదానీ గ్రూప్‌:- మయన్మార్‌లో కొత్త కంటెయినర్‌ టర్మినల్‌ను డెవలప్‌ చేయనుంది.

నేడు క్యూ4 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- లుపిన్‌, పెట్రోనెట్‌, ఎస్‌కేఎఫ్‌ ఇండియా, టోరెంటో, మహారాష్ట్ర స్కూటర్స్‌, జుబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, కేపీఐటీ టెక్నాలజీస్‌, కరూర్‌ వైశ్యా బ్యాంక్‌, హెచ్‌ఎఫ్‌సీఎల్‌, కాస్మో ఫిల్మ్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బాలాజీ అమెన్స్‌, అమరరాజాబ్యాటరీస్‌
 You may be interested

స్థిరంగా పసిడి

Wednesday 15th May 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్స్‌లో ఔన్స్‌ పసిడి ధర 1 డాలరు నష్టపోయి 1,295.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది. వాషింగ్టన్‌ - బీజింగ్‌ల మధ్య వాణిజ్య చర్చలపై మళ్లీ ఆశలు చిగురించడంతో ఇన్వెస్టర్లు ఆందోళనలు కొంత తగ్గుముఖం పట్టాయి. అలాగే డాలరుతో పాటు పలు ప్రపంచ ఈ‍క్విటీ మార్కెట్లు రికవరి బాట పట్టాయి. ఈ సోమవారం ఒక్కరోజులోనే పసిడి 20డాలర్ల లాభపడటంతో

గ్యాప్‌అప్‌ ప్రారంభం

Wednesday 15th May 2019

 ప్రపంచ ప్రధాన మార్కెట్లలో జరుగుతున్న షార్ట్‌ కవరింగ్‌ ర్యాలీలో భాగంగా ఆసియా మార్కెట్లు పెరిగిన నేపథ్యంలో భారత్‌ మార్కెట్‌ బుధవారం గ్యాప్‌అప్‌తో  ప్రారంభమమయ్యింది.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 220 పాయింట్ల లాభంతో 37,540 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,272 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, గెయిల్‌, పవర్‌గ్రిడ్‌, అదాని పోర్ట్స్‌, యూపీఎల్‌లు 1 శాతం వరకూ ట్రేడింగ్‌ ప్రారంభంలో లాభనపడ్డాయి. మరోవైపు యస్‌బ్యాంక్‌ 4

Most from this category