News


గురువారం వార్తల్లో షేర్లు

Thursday 22nd August 2019
Markets_main1566444859.png-27926

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు

 ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌:- ఫిడిలిటి మేనేజ్‌మెంట్‌ కంపెనీలో  వాటాను విక్రయించాలని యోచిస్తోంది.బుక్‌ సైజ్‌ 200 మిలియన్‌ డాలర్లుగా ఉంది. 
కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌:- కంపెనీలో వాటా కొనుగోలుకు ఐటీసీ ఆసక్తి చూపుతుందనే వార్తలను ఖండించింది. 
ఎన్‌ఎండీసీ:- ప్రతి టన్ను లూప్‌, ఫైన్స్‌ ఐరన్‌ ఓర్‌ ధరలపై రూ.200లను తగ్గించింది. ఆగస్ట్‌ 20 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. 
హెచ్‌పీసీఎల్‌:- వ్యాపార విస్తరణలో భాగంగా కంపెనీ రానున్న ఐదేళ్లలో రూ.74,000 వేల కోట్లను ఖర్చు చేయనుంది. 
రెడింగ్టన్ ఇండియా:- ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌ కంపెనీ 2.05శాతం వాటాను విక్రయించింది. 
జై కార్ప్‌:- అనుబంధ సం‍స్థ జై రియల్టీ వెంచర్‌ లిమిటెడ్‌ విలీనానికి బోర్డు ఆమోదం తెలిపింది.
బయోకాన్‌:- మలేషియాలో ఇన్సూలియన్‌ గ్లారిజైన్‌ మానుఫ్యాక్చరింగ్‌ ఫ్యాకల్టీ ఈయూ జీపీఎం సర్టిఫికేషన్‌ను దక్కించుకుంది. 
టాటా స్పాంజ్‌ ఐరన్‌:- కంపెనీ పేరు టాటా స్టీల్‌ లాంగ్‌ ప్రోడెక్ట్స్‌ లిమిటెడ్‌గా మార్చుకునేందుకు బోర్డు అనుమతి పొందింది. 
ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌:- తన వినియోగదారులకు గూగుల్‌ క్లౌడ్‌ సేవలను మరింత వేగవంతగా అందించడానికి గూగుల్‌ క్లౌడ్‌తో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 
వీ-మార్ట్‌:- నాగాలాండ్‌, ఝార్ఖాండ్‌, రాజస్థాన్‌లో కొత్త స్టోర్‌లను ప్రారంభించింది. 
ఎన్‌డీటీవీ:- సీఐబీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడాన్ని ఖండించింది. అలాగే ఆ అంశంపై న్యాయపరమైన సలహాలను తీసుకునేందుకు సిద్ధమైంది. 
టేస్టీ డైరీ సెష్పాలిటీస్‌:- కంపెనీ దీర్ఘకాలిక బ్యాంకు రుణసదుపాలపై క్రిసెల్‌ రేటింగ్‌ను బిబిబి(-) స్థిరత్వం రేటింగ్‌ను కేటాయించింది. 
భెల్‌ లిమిటెడ్‌:- ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ కంపెనీ దీర్ఘకాలిక ఇష్యూయర్‌ రేటింగ్‌ను ఎఎ(+)కు పెంచింది. అలాగే అవుట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి నెగిటివ్‌కు రేటింగ్‌కు డౌన్‌గ్రేడ్‌ చేసింది.
ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌:- కంపెనీ దీర్ఘకాలిక, స్వల్పకాలిక బ్యాంకు రుణ సదుపాయాలను డౌన్‌గ్రేడ్‌ చేసింది.
నేడు క్యూ1 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- ఎవరెస్ట్‌ కంటో సిలిండర్‌, అ‍డ్వాన్డ్స్‌ లైఫ్‌ స్టైల్‌, బిర్లా కాస్ట్‌సైన్‌, కన్నమెటల్‌ ఇండియా, సుప్రీం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ ఇండియా. You may be interested

అమెజాన్‌ అతిపెద్ద క్యాంపస్‌ ప్రారంభం

Thursday 22nd August 2019

గచ్చిబౌలిలో 30 లక్షల చదరపు అడుగుల్లో స్థాపన నిర్మాణానికి రూ.1,500 కోట్లకుపైగా వ్యయం 15,000 మంది ఉద్యోగులు కూర్చునేలా ఏర్పాటు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో బుధవారం ప్రారంభించింది. గచ్చిబౌలిలో 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని నిర్మించారు. ఆఫీస్‌ స్పేస్‌ 18 లక్షల చదరపు అడుగులు కైవసం చేసుకుంది. మొత్తం 15,000 మంది ఉద్యోగులు కూర్చునేలా ఏర్పాట్లున్నాయి. 39 నెలల్లోనే నిర్మాణం పూర్తి

డిస్కౌంట్‌లో 12 స్టాకులు .. కొనవచ్చా..?

Wednesday 21st August 2019

ఇటీవల బెంచ్‌మార్క్‌ సూచీలు దిద్దుబాటుకు లోనైనప్పటికీ.., వాటి చరిత్రాత్మక యావరేజ్‌ స్థాయిల వద్ద కొద్ది ప్రీమియంతో ట్రేడ్‌ అవుతున్నాయి. అయితే సూచీల చారిత్రాత్మక యావేరేజ్‌లో పోలిస్తే చాలా షేర్లు ఆకర్షణీయమైన వాల్యూవేషన్‌ వద్ద దొరుకుతున్నాయి. నిఫ్టీ-50లోని 12 కంపెనీల షేర్లు వాటి ఐదేళ్ల పీఈ యావరేజ్‌ పోలిస్తే డిస్కౌంట్‌తో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇలా ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద ఉన్న స్టాకుల్లో సన్‌ఫార్మా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ,

Most from this category