STOCKS

News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 23rd July 2019
Markets_main1563854769.png-27241

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
టీవీఎస్‌ మోటర్స్‌:-
సింగపూర్‌లో తన అనుబంధ సం‍స్థ  వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా అమెరికా ఆధారిత సార్టప్‌ కంపెనీ సినాప్టిక్ సిస్టమ్స్ లో 7మిలియన్‌ డాలర్ల పెట్టుబడుతున్నట్లు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. 
వడిలాల్‌ ఇండస్ట్రీస్‌:- కంపెనీ ఛైర్మన్‌ పదవికి రాజేష్‌ గాంధీ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో విజయ్‌ షా నియమితులయ్యారు. 
బంధన్‌ బ్యాంక్‌:- సంజీవ్‌ నారాయణి బిజినెస్‌ హెడ్‌గా నియమితులయ్యారు. 
ఆల్ఫాగో:- మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ కార్పోరేషన్‌ నుంచి రూ.72 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది.
బీఎస్‌ఈ:- చైనా దేశపు ప్రధాన ఎక్చే‍్సంజీ షాంఘైతో ఓఎంయూ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
కేఈఐ ఇండస్ట్రీస్‌:- కంపెనీ ధీర్ఘకాలిక బ్యాంకు రుణ సదుపాయాలకు ఇక్రా రేటింగ్‌ సంస్థ ‘‘ఎ’’ రేటింగ్‌ను/స్థిరత్వం అవుట్‌లుక్‌ కేటాయించింది.
ఎన్‌టీఎన్‌ఎల్‌:- ముంబైలో ప్రధాన కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలిపింది. 

నేడు క్యూ1 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- 
ఎల్‌ అండ్‌ టీ, హిందూస్థాన్‌ యూనిలివర్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎంటర్‌ప్రైజెస్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, సుందరం క్లేటన్‌, పొన్ని షుగుర్స్‌, జ్యోతి ల్యాబ్స్‌, టోరెంటో ఫార్మాస్యూటికల్స్‌, లిండే ఇండియా, ఏషియన్‌ హోటల్స్‌, జీఈ పవర్‌ ఇండియా, ఓరియంటల్‌ హోటల్స్‌, ప్రజ్‌ ఇండస్ట్రీస్‌, కజిరియా సిరామిక్స్‌, శాంతి గేర్స్‌, ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌, జేకే పేపర్స్‌, ఎస్‌కేఎఫ్‌ ఇండియా, ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, పోద్దార్‌ పిగ్మెంట్‌, న్యూక్లియస్‌ సాఫ్ట్‌వేర్‌ ఎక్స్‌పోర్ట్స్‌, ఎవరెస్ట్‌ ఇండస్ట్రీస్‌, ఇండియన్‌ ఓవర్సీస్ బ్యాంక్‌, క్రిసెల్‌, హెచ్‌టీ మీడియా, డీసీఎం శ్రీరాం.You may be interested

బలహీనంగా రూపీ..68.98 వద్ద ప్రారంభం

Tuesday 23rd July 2019

చమురు ధరలు పెరగడంతో పాటు, అమెరికా డాలర్‌ బలపడడంతో రూపీ మంగళవారం ట్రేడింగ్‌లో 6 పైసలు బలహీనపడి డాలర్‌ మారకంలో 68.98 వద్ద ప్రారంభమైంది. గత వారం ఇరాన్ బ్రిటిష్ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకోవడంతో మధ్యప్రాచ్యంలో సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందనే ఆందోళన నేపధ్యంలో గత సెషన్‌లో చమురు ధరలు పెరిగాయి. దీంతోపాటు లిబియా తన అతిపెద్ద చమురు క్షేత్రంలో ఉత్పత్తిని తిరిగి ప్రారంభించడం గమనర్హం.  గత సెషన్‌లో రూపీ డాలర్‌

స్వల్పంగా తగ్గిన చమురు

Tuesday 23rd July 2019

మధ్యప్రాచ్యంలో ముదురుతున్న ఒత్తిళ్ల వలన చమురు సరఫరాకు ఆటంకం కలగకుండా అవసరమైనప్పుడు ప్రతిస్పందిస్తామని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఎజెన్సీ (ఐఈఏ) తెలపడం‍తో మంగళవారం చమురు ధరలు స్వల్పంగా తగ్గి ట్రేడవుతున్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయ చమురు డిమాండ్‌ భయాలు కూడా మదుపర్లను వెంటాడుతున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 2 సెంట్లు తగ్గి బ్యారెల్‌కు 63.24 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ బ్యారెల్‌కు 6 సెంట్లు తగ్గి 56.16 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. బ్రిటీష్‌ ట్యాంకర్‌ను

Most from this category