News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 15th March 2019
Markets_main1552621409.png-24615

వివిధ వార్తల‌కు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమ‌య్యే షేర్ల  వివరాలు
ఐడీబీఐ బ్యాంక్‌:-
ఐడీబీఐ బ్యాంక్‌ను ప్రవేట్ రంగ సెక్టారులోకి చేరుస్తున్నట్లు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రక‌టించింది. జీవిత బీమా సంస్థ మెజారిటీ వాటాను కొనుగోలు నేపథ్యంలో ఈ వర్గీకరణ జరిగింది. ఈ ఏడాది జ‌న‌వ‌రి 21 నుంచి ఇది అమల్లోకి వ‌చ్చిన‌ట్లు ఆర్బీఐ తెలిపింది.
టైడ్ వాట‌ర్ ఆయిల్(ఇండియా):-  ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సరంలో రెండో మ‌ధ్యంతర డివిడెండ్‌ను ప్రక‌టించింది. రూ.5లు ముఖవిలువ కలిగిన ప్రతి షేరుకు రూ.85ల డివిడెండ్‌ చెల్లిస్తున్నట్లుగా కంపెనీ తెలిపింది. 
టెక్ మ‌హీంద్రా:- యూర‌ప్‌లో ఇంజ‌నీరింగ్ సేవ‌లు అందించే త‌న అనుబంధ సంస్థ టెక్ మహీంద్రా ఇంజ‌నీరిగ్ స‌ర్వీస్‌లో 100శాతం వాటా కొనుగోలుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం విలువ సుమారు 1.5మిలియ‌న్ డాలర్లుగా ఉంటుంది. 
ఎల్‌జీబీ ఫోర్జ్‌:- కంపెనీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీస‌రుగా ఆర్ రామ‌క్రిష్ణన్ రాజీనామా చేశారు.
సీఎంఐ:- ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సరం డిసెంబ‌ర్ త్రైమాసికంలో మూడు పేరుమోసిన కంపెనీలకు వెండ‌ర్‌గా నియ‌మించ‌బ‌డింది.
రాన్‌జీత్ మెకాట్రోనిక్స్‌:- ఎయిర్పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియా నుంచి రూ.20 కోట్ల విలువైన ఆర్డర్లను ద‌క్కించుకుంది.
క‌ప‌షి క‌మ‌ర్షియ‌ల్‌:- బోనస్ ఇష్యూను ప్రక‌టించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ.10లు ముఖ విలువ క‌లిగిన ప్రతి రెండు షేర్లకు మూడు షేర్లను జారీ చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది.
ఎస్సాల్  ప్రోప్యాక్‌:- రూ.35 కోట్ల విలువైన క‌మ‌ర్షియ‌ల్ పేప‌ర్ల ఇష్యూకు మెచ్యూరిటీ తేదిని మార్చి 14వ తేదిగా ప్రక‌టించింది.  అలాగే కంపెనీ అద‌న‌పు డైరెక్టర్‌గా 
ర‌మేశ్ గుప్తా నియ‌మితుల‌య్యారు. 
కోల్ ఇండియా:- ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సరంలో రెండ‌వ ఇంట‌ర్మ్ డివిడెంట్ ప్రక‌టించింది. రూ.5లు ముఖ విలువ క‌లిగిన ప్రతిషేరుకు రూ.5.85లు డివిడెండ్‌ చెల్లించాలని గురువారం జరిగిన సమావేశంలో కంపెనీ డైౖరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది
ఉజ్జీవ‌న్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌:- రెండవ మ‌ధ్యంత‌ర డివిడెండ్ ప్రక‌టించింది. 
స్టెరైడ్స్ ఫార్మా:- కంపెనీలో బ‌జాజ్ ఫైనాన్స్ 3.50శాతం నుంచి 1.75శాతానికి త‌గ్గించుకున్నట్లు మీడియా క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. 
జుబిలెంట్ ఫుడ్ వ‌ర్క్స్‌:- కంపెనీ ప్రముఖ ప్రమోట‌ర్ జుబిలెంట్ క‌న్జ్యూమ‌ర్ ప్రైవేట్ లిమిటెడ్ త‌న‌ఖా పెట్టిన 40లక్షల ఈక్విటీ షేర్ల‌ను విక్రయించింది. 
జీపీటీఎల్ హాత్‌వే:- ప్రమోట‌ర్ ఒక‌రు  6 ల‌క్షల విలువైన ఈక్విటీ షేర్లను త‌న‌ఖా పెట్టారు. 
స‌న్ ఫార్మా:- ప్రమోట‌ర్ సంఘ్వీ ఫైనాన్స్ ప్రవేట్ లిమిటెడ్ కంపెనీ 40ల‌క్షల ఈక్విటీ షేర్లను తనఖా పెట్టింది.You may be interested

ఎగరని విమానాలు.. చార్జీలకు రెక్కలు

Friday 15th March 2019

- 25 శాతం దాకా పెరిగే అవకాశం - 20 శాతం విమానాలను నిలిపివేసిన ఎయిర్‌లైన్స్‌ - పైలట్ల కొరత, ఇంజిన్ల సమస్యలు మొదలైన అంశాలు కారణం న్యూఢిల్లీ: పలు సమస్యలతో దేశీ ఎయిర్‌లైన్స్‌ పెద్ద సంఖ్యలో విమానాలను నిలిపివేయాల్సి వస్తుండటంతో.. విమాన ప్రయాణ చార్జీలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. స్వల్పకాలికంగా చార్జీలు 25 శాతం దాకా పెరగవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. వివిధ కారణాలతో ఇండిగో, జెట్‌ ఎయిర్‌వేస్, స్పైస్‌జెట్‌ దగ్గరున్న వాటిలో

 ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20 పాయింట్లు అప్‌ 

Friday 15th March 2019

అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారయ్యిందనేవార్తలతో ఆసియా మార్కెట్లు జోరుగా పెరిగిన నేపథ్యంలో నాలుగురోజులపాటు పెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ సూచీలు శుక్రవారం సైతం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది.  ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.35 గంటలకు 11,402 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,382  పాయింట్ల వద్ద ముగిసింది.

Most from this category