News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 12th July 2019
Markets_main1562906508.png-26999

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
కేపీఆర్‌ఎల్‌ మిల్‌:-
ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ ఇష్యూపై 20 శాతం పన్ను విధింపు ప్రతిపాదన నేపథ్యంలో కంపెనీ రూ. 260 కోట్ల బైబ్యాక్‌ ఇష్యూ ప్రణాళికను రద్దు చేసుకుంటున్నట్లు కంపెనీ ఎక్చ్సేంజీలకు, ఇన్వెస్టర్లకు సమాచారం ఇచ్చింది.
సల్జార్‌ ఎలక్ట్రానిక్స్‌:- కైసీ ఇండస్ట్రీస్ కొనుగోలును ప్రక్రియను పూర్తి చేసింది. 
యూనిటెడ్‌ బేవరీజెస్:- కంపెనీ కొత్త సీఎఫ్‌ఓగా బెరెండ్‌ ఒడినిక్‌ నియమితులయ్యారు.
ఎవర్‌రెడీ ఇండస్ట్రీస్‌:- ప్రమోటర్లు తాకట్టు పెట్టిన 39లక్షల ఈక్విటీ షేర్లను యస్‌ బ్యాంక్‌ సొంతం చేసుకుంది.
హిమాచల్‌ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్:- తన అనుబంధ సం‍్థ హెచ్‌టీఎల్‌ వివిధ రకాల ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్‌ తయారీ కొరకు భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ నుంచి రూ.200 కోట్ల విలువై ఆర్డర్ల దక్కించుకుంది. 
మన్‌పసంద్‌ బేవరీజెస్‌:- కంపెనీ ప్రమోటర్‌ ధీరేంద్ర సింఘ్‌ తన మొత్తం వాటాను తనఖా పెట్టి రూ.100 కోట్ల రుణాన్ని పొందారు. ఈ మొత్తం రుణాన్ని కంపెనీ మూలధన అవసరాలకు వినియోగిస్తున్నట్లు ఈయన తెలిపారు. 
మాక్‌ ఛార్లెస్‌:- రూ.10లు ముఖవిలువ కలిగిన ప్రతి ఈక్విటీ షేర్లపై రూ.10ల డివిడెండ్‌ను ప్రకటించింది.
గ్లెన్‌మార్క్‌, టోరెంట్‌:- భారత్‌లో డయాబెటిస్‌ ఔషధాలను ఇరు సంస్థలు కలిసి విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి 
వేదాంతా:- ఉత్పత్తి సామర్థ్య విస్తరణ కోసం వచ్చే మూడేళ్ళలో రూ.55వేల కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు ప్రకటించింది.
నేడు క్యూ1 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- ఇన్ఫోసిస్‌, ఇండస్‌ఇండ్‌, కర్ణాటక బ్యాంక్‌,  సంగమ్‌, టీఆర్‌ఎఫ్‌, హాత్‌వే కేబుల్‌ అండ్‌ డాట్‌ కామ్‌, జీఎన్‌ఏ ఎలెక్సా, ఇన్ఫోమీడియా ప్రెస్‌, 3ఐ ఇన్ఫోటెక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీయల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌.You may be interested

స్థిరంగా పసిడి

Friday 12th July 2019

క్రితం ట్రేడింగ్‌లో 1శాతం వరకు క్షీణించిన పసిడి ధర శుక్రవారం ట్రేడింగ్‌లో స్థిరంగా ట్రేడ్‌ అవుతున్నాయి. ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 2డాలర్లు స్వల్ప లాభంతో 1,408.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత,  మరోసారి తెరపైకి వచ్చిన పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇంకా తగ్గముఖం పట్టని అమెరికా చైనా వాణిజ్య యుద్ధ ఉద్రికత్తలు పసిడి ధరకు మద్దతునిస్తు‍న్నాయి. కీలక వడ్డీరేట్లపై కోత ఉండవచ్చని ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌

68.45 వద్ద రూపీ ప్రారంభం

Friday 12th July 2019

రూపీ డాలర్‌ మారకంలో 13 పైసలు బలపడి 68.45 వద్ద శుక్రవారం(జులై 12) ప్రారంభమైంది. అమెరికా ఫెడ్‌ వడ్డి రేట్ల కోత ఉంటుందనే అంచనాల నేపథ్యంలో గత సెషన్‌లో ఆసియా కరెన్సీలు బలపడ్డాయి. డాలర్‌ మారకంలో రూపీ గత సెషన్‌లో 7 పైసలు బలపడి 68.58 వద్ద ముగిసింది. శుక్రవారం ఉదయం 9.56 సమయానికి రూపీ డాలర్‌ మారకంలో 5 పైసలు బలహీనపడి 68.50 వద్ద ట్రేడవుతోంది.

Most from this category