News


సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 15th July 2019
Markets_main1563164563.png-27054

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
జెట్‌ ఎయిర్‌వేస్‌:-
జూలై 16న క్రిడెట్‌ కమిటి తొలి సమావేశాన్ని నిర్వహించనుంది. రుణదాతలు ఎన్‌సీఎల్‌టీ ద్వారా రిసెల్యూషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు సిద్ధమయ్యారు. 
అలహదబాద్‌ బ్యాంక్‌:- భూషణ్‌ స్టీల్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ రూ.1175 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఆర్‌బీఐకు నివేదికనిచ్చింది.
భెల్‌:- ఎన్‌టీసీసీ నుంచి ఈపీసీ విభాగంలో రూ.100 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకుంది. ఈ ఆర్డర్లలో భాగంగా కంపెనీ 25 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌కు నిర్మించాల్సి ఉంటుంది.
కేడీడీఎల్‌:- మెటిరియల్‌ సబ్సీడరీ సంస్థ ఈథోస్‌ లిమిటెడ్‌కు చెందిన 3.76లక్షల ఈక్విటీ షేర్లను ప్రిఫరెన్షియల్‌ బేసిస్‌ పద్ధతిలో కొనుగోలు చేసింది. ఇందుకు రూ.10 కోట్ల ఖర్చు చేసింది. 
టాటా కాఫీ:- సంస్థ రుణాలకు సంబంధించి ఇక్రా తన క్రెడిట్ రేటింగ్‌ను పునరుద్ఘాటించింది.
సీసీఎల్‌ ఇంటర్నేషనల్‌:- కంపెనీ చీఫ్‌ ఆఫీసర్‌గా శివమ్‌ అగర్వాల్‌ తన పదవికి రాజీనామా చేశారు.
ఉర్జా గ్లోబెల్‌: వ్యాపార అవసరాల నిమిత్తం జపాన్‌ కంపెనీ నిప్పన్ షిన్యాకు కంపెనీతో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
టీడీ పవర్‌ సిస్టమ్స్‌:- డివిడెండ్‌ పేమెంట్‌ చెల్లింపునకు ఆగస్ట్‌ 02ను రికార్డు తేదిగా నిర్ణయించింది. 
ఒరిస్సా బెంగాల్‌ క్యారియర్‌:- కంపెనీ రుణ సదుపాయాలపై క్రిసెల్‌ రేటింగ్‌ సంస్థ స్థిర్వతం రేటింగ్‌ను కేటాయించింది. అలాగే కంపెనీపై ధీర్ఘకాలిక రేటింగ్‌ ‘‘బిబిబి’’ స్థాయికి సవరించింది. 
సిండ్‌కేట్‌ బ్యాంక్‌:- నేటి నుంచి అన్ని రుణాలపై ఎమ్‌సీఎల్‌ఆర్‌ రేట్లను  5 బేసిస్‌ పాయింట్లు తగ్గనున్నాయి.
ఐటీసీ:- కంపెనీ అదనపు డైరెక్టర్లుగా అజిత్‌ కుమార్‌, ఆనంద్‌ నాయక్‌ నియమితులయ్యారు. 
ఇండిగో:- డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఏవియేషన్‌ నుంచి కంపెనీకి చెందిన ఫ్లైట్‌ ఆపరేటింగ్‌ అండ్‌ సేఫ్టీ విభాగం 4 షోకాజ్‌ నోటీసులు అందుకుంటున్నట్లు కంపెనీ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. 
పరాగ్‌ మిల్‌ ఫుడ్స్‌:- రూ.390 కోట్ల రుణసదుపాయానికి  ఇక్రా రేటింగ్‌ సంస్థ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేసింది. 
ఇన్ఫోసిస్‌:- ట్రిఫాక్టా ఇంక్‌లో 6 మిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేయనున్న ఇన్ఫోసిస్‌
నేడు క్యూ1 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- టిన్‌ ప్లేట్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా, టాటా మెటాలిస్టిక్‌, అటోమోటివ్‌ స్టంపింగ్‌, బజాజ్‌ కన్జూ‍్యమర్‌ కేర్‌.You may be interested

17 పైసలు బలపడిన రూపీ

Monday 15th July 2019

దేశియ స్థూల ఆర్థిక వ్యవస్థ డేటా నిరుత్సాహ పరిచినప్పటికి సోమవారం(జులై 15) రూపీ డాలర్‌ మారకంలో 17 పైసలు బలపడి 68.52 వద్ద  ప్రారంభమైంది.  మైనింగ్‌, తయారిరంగాల వృద్ధి మందగించడంతో శుక్రవారం విడుదలైన పరిశ్రమ ఉత్పత్తి సూచీ(ఐఐపీ)లో ఫ్యాక్టరి ఔట్‌పుట్‌ వృద్ధి మే నెలలో 3.1 శాతానికి పడిపోయింది. గత ఏడాది ఇదే నెలలో 4.3 శాతంగా నమోదైన విషయం గమనర్హం. అంతేకాకుండా రిటైల్‌ ద్రవ్యోల్బణం జూన్‌ నెలలో 3.18

స్వల్పంగా తగ్గిన చమురు

Monday 15th July 2019

అతి పెద్ద చమురు దిగుమతిదారైన చైనా గత 27 ఏళ్లలో అతి తక్కువ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసిక జీడీపీ రేటును ప్రకటించనుందనే అంచనాల నేపథ్యంలో ఆయిల్‌ ధరలు స్వల్పం‍గా తగ్గాయి. చైనా- అమెరికా వాణిజ్య యుద్ధం వలన చైనా జీడిపీ రేటు మందగించింది.  బ్రెంట్‌ క్రూడ్‌ సెప్టెంబర్‌ ప్యూచర్‌ ధర 6 సెంటులు తగ్గి బ్యారెల్‌ 66.66 డాలర్లకు, అమెరికా క్రూడ్‌ అగష్టు ప్యూచర్‌ 5 సెంటులు తగ్గి బ్యారెల్‌ 60.16

Most from this category