News


సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 14th October 2019
Markets_main1571024202.png-28861

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే కొన్ని ప్రధాన కంపెనీలు
ఇన్ఫోసిస్‌:-
క్యూ2 ఫలితాలను శుక్రవారం ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలు మార్కెట్‌ వర్గాల అంచనాలకు తగ్గట్లుగానే ఉన్నాయి. క్యూ2లో నికర లాభం 2.2శాతం క్షీణించి రూ. 4,019 కోట్లుగా, ఆదాయం 3.8శాతం పెరిగి రూ.22,629 కోట్లుగా నమోదయ్యాయి.
అవెన్యూ సూపర్‌ మార్ట్‌:- క్యూ2లో నికరలాభం 47.5శాతం వృద్ధి చెంది రూ.322.63 కోట్లను నమోదు చేసింది. ఆదాయం 22.26 శాతం వృద్ధిని సాధించి రూ.5,998.90 కోట్లను ఆర్జించింది.
రిలయన్స్‌ క్యాపిటల్‌:- రిలయన్స్ సెక్యూరిటీస్‌లో 100శాతం వాటాను నిర్వహణ కొనుగోలుకు రిలయన్స్ క్యాపిటల్ ఆమోదం తెలిపింది. 
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా:- బరోడా అసెట్ మేనేజ్‌మెంట్‌ను బీపీఎన్‌ పారిబాస్ అసెట్ మేనేజ్‌మెంట్‌తో విలీనం చేయడానికి బ్యాంక్ ఆఫ్ బరోడా ఒప్పందం కుదుర్చుకుంది
కేడిల్లా హెల్త్‌కేర్‌:- దబాసాలో ఏపీఐ తయారీ యూనిట్‌లో యుఎస్‌ఎఫ్‌డీఎ తనిఖీలను పూర్తి చేస్తుంది
ఎన్‌ఎండీసీ:- ఎన్‌సీడీల జారీ ద్వారా రూ.5000 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌:- కంపెనీ ధీర్ఘకాలిక బ్యాంక్‌ సదుపాయాలకు కేర్‌ రేటింగ్‌ సంస్థ ‘‘డీ’’ రేటింగ్‌ను కేటాయించింది. 
లుపిన్‌:- ఈ ఆర్థిక సం‍వత్సరం చివరి త్రైమాసికం నాటికి యూఎస్‌లో ఎటానెర్సెప్ట్, పెగ్‌ఫిల్‌గ్రాస్టిమ్ బయోసిమిలర్‌లను దాఖలు చేయాలని కంపెనీ యోచిస్తోంది.
డీఎల్‌ఎఫ్‌:- గురుగ్రాం హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ ద్వారా 376 ఫ్లాట్లను విక్రయించి రూ.700 కోట్లను ఆర్జించింది. 
టోరెంటో ఫార్మా:- అమెరికా మార్కెట్‌ నుంచి 74వేల హైపర్టెన్షన్ జనరిక్‌ ఔషధ బాటిల్స్‌ను రీకాల్‌ చేసింది.
నేడు క్యూ2 ఫలితాలను వెల్లడించే కొన్ని ప్రధాన కంపెనీలు:- హిందూస్థాన్‌ యూనిలివర్‌, డెల్టా కార్ప్‌, హాత్‌వే కేబుల్స్‌ You may be interested

లాభాల ప్రారంభం

Monday 14th October 2019

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ సోమవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 100 పాయింట్ల లాభంతో 38,227 వద్ద, నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 11,335.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించించాయి. అగ్రరాజ్యాలైన అమెరికా చైనాల మధ్య 15నెలల సుధీర్ఘ వాణిజ్య యుద్ధానికి ఉపశమనంగా శుక్రవారం ఇరుదేశాల మధ్య పాక్షిక ఒప్పందం కుదిరింది. ఫలితంగా గతవారంలో అమెరికా మార్కెట్లు దాదాపు 1శాతం లాభంతో ముగియగా, నేడు ఆసియా

అనిశ్చితిలో సురక్షిత పెట్టుబడుల కోసం..

Monday 14th October 2019

అనిశ్చితిలో సురక్షిత పెట్టుబడుల కోసం.. మిరే అసెట్‌ లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌ డి.జయంత్‌కుమార్‌, థర్డ్‌ పార్టీ ప్రొడక్ట్స్‌ హెడ్‌, కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ అంతర్జాతీయంగా అమెరికా-చైనా మధ్య వాణిజ్య పోరు, భౌగోళిక రాజకీయ అంశాలకుతోడు, దేశీయంగా ఆర్థిక వృద్ధి నిదానించడం వంటి అంశాల కారణంగా స్టాక్‌ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారికి లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ కాస్త సురక్షితమైనవి. ఎందుకంటే ఇవి స్థిరమైనవే కాకుండా, మార్కెట్లు కుదుటపడిన వెంటనే

Most from this category