News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 15th January 2019
Markets_main1547530864.png-23587

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు..
సైయంట్‌:- కంపెనీ చరిత్రలో తొలిసారి షేర్ల బైబ్యాక్‌ ప్రకటించనుంది. ఈ నెల 17న జరిగే బోర్డు సమావేశంలో క్యూ3 ఫలితాలతో పాటు షేర్ల బై బ్యాక్‌ ఇష్యూకూ ప్రకటించనుంది.
యునైటెడ్‌ స్పిరిట్‌:- తన అనుబంధ సంస్థ ఫోర్‌ సీజన్స్‌ వైన్స్‌ లిమిటెడ్‌ను గ్రోవర్‌ జంపా వినియార్డ్స్‌ లిమిటెడ్‌, క్వింటెలా అసెట్స్‌ లిమిటెడ్‌ విక్రయించేందుక ఒప్పందాన్ని కుదర్చుకుంది. ఈ డీల్‌ విలువ రూ.32 కోట్లు ఉంటుందని అంచనా.
విప్రో:-  జనవరి 17-18 తేదీల్లో జరిగే బోర్డు మీటింగ్‌లో బోనస్‌ ఇష్యూ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోనుంది.
ఆర్‌ సిస్టమ్స్‌ ఇంటర్నేషనల్‌:- షేర్ల బై బ్యాక్‌ అంశంపై చర్చించేందుకు నేడు బోర్డు సమావేశం నిర్వహించనుంది.
ఇండో రమా సింథటిక్స్‌:- నిధుల సమీకరణ అంశంపై చర్చించేందుకు నేడు బోర్డు సమావేశం నిర్వహించనుంది.
ఐసీఐసీఐ బ్యాంక్‌:- బ్యాంక్‌ స్వతం‍త్ర్య డైరెక్టర్లుగా బీ.శ్రీరామ్‌, రామా బిజాపుర్కర్‌లను నియమితులయ్యారు.
బజాజ్‌ ఫైనాన్స్‌:- నియమ నిబంధనలను ఉల్లఘించింనందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆప్‌ ఇండియా రూ.కోటిల జరిమానా విధించింది.
శక్తి పంప్స్‌:- లేజర్‌ కాంట్రాక్టర్‌ సమస్యతో నేడు కూడా యూనిట్‌లో ఉత్పత్తి నిలిచిపోయింది.
కార్పోరేషన్‌ బ్యాంక్‌:- సవరించిన ఎంసీఎల్‌ రేట్లు నేటి నుంచి (జవనరి 15)నుంచి అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది.
యాక్సిక్యాడ్స్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీస్‌:- అమెరికా క్లయింట్‌ నుంచి 9.50లక్షల డాలర్ల రికవరీ సంబంధించి న్యాయబద్ధమై చర్చలు తీసుకునేందుకు బోర్డు అనుమతులు దక్కించుకుంది.
హిందూస్థాన్‌ నేషనల్‌ గ్లాస్‌ ఇండస్ట్రీస్‌:- ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో డిబెంచర్ల జారీ ద్వారా నిధులను సమీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.
నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించనున్న కొన్ని ప్రధాన కంపెనీలు:- జీ ఎంటర్‌టైన్‌మైంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ట్రిడెంట్‌, టిన్‌ప్లాంట్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా, జై భరత్‌ మారుతీ, డెన్‌ వర్క్స్‌, టీవీ 18 బ్రాడ్‌కాస్ట్‌, హిందూస్థాన్‌ మీడియా వెంచర్స్‌, కేపీఐటీ టెక్నాలజీస్‌, సెష్పాలిటీ రెస్టారెంట్స్‌, నెట్‌వర్క్స్‌ 18 మీడియా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌.You may be interested

10670 పాయింట్ల మద్దతు కోల్పోతే కల్లోలమే!

Tuesday 15th January 2019

కోటక్‌ సెక్యూరిటీస్‌ కొన్నాళ్లుగా ట్రేడ్‌వార్‌, యూఎస్‌ షట్‌డౌన్‌, ఐటీ కంపెనీల పేలవ ఫలితాలు, నీరసమైన ఆటో అమ్మక గణాంకాలు, రాబోయే ఎన్నికలపై రాజకీయ రచ్చ తదితర ఇబ్బందికర వార్తల నడుమ నిఫ్టీ సమతూకం కోల్పోకుండా జాగ్రత్తగా బాలెన్స్‌అవుతూ వస్తోందని కోటక్‌ సెక్యూరిటీస్‌ అభిప్రాయపడింది. స్వల్పరేంజ్‌లోనే కదలాడుతున్నా, నిఫ్టీ పెద్దగా పతనాలను చూడలేదు. ఈ నెగిటివ్‌ వార్తలన్నింటినీ సూచీలు ప్రైస్‌ఇన్‌ చేసినట్లు కనిపిస్తోంది. వీక్లీ చార్టుల్లో బుల్లిష్‌ రివర్సల్‌ పాటర్న్‌ కనిపిస్తోంది. హామర్‌,

69 స్టాకుల్లో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌

Tuesday 15th January 2019

దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 69 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బేరిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా నెగిటివ్‌గా  మారిన కంపెనీల్లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, సిండికేట్‌ బ్యాంక్‌, ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్స్‌, పీటీసీ, నాల్కో, ఏసియన్‌ పెయింట్స్‌, సన్‌టీవీ, ఐసీఐసీఐ లుంబార్డ్‌, సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌, జేఎస్‌డబ్ల్యు ఎనర్జీ తదితరాలున్నాయి. ఈ

Most from this category