News


నేటి వార్తల్లోని షేర్లు

Monday 16th March 2020
Markets_main1584333868.png-32497

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు

ఇండియా బుల్స్‌ హౌసింగ్స్‌: షల్‌ మీడియాలో తమపై వస్తున్న వార్తలు ఆవాస్తవమని, తాము యస్‌ బ్యాంక్‌ నుంచి ఎటువంటి లోన్‌లు తీసుకోలేదని ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌(ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌) వెల్లడించింది.

మారికో,ఇమామీ: సూపర్‌ వాస్‌మోల్‌ హెయిర్‌ కలర్‌ను రూ.1,500-1,800 కోట్లకు విక్రయించేందుకు  గోద్రేజ్‌ కన్జూమర్‌, మారికో, ఇమామీ, డాబర్‌, హెచ్‌యూల్‌లను సూపర్‌ వాస్‌ముల్‌ మాతృసంస్థ సంప్రదించినట్లు తెలస్తోంది.

ఐడీఎఫ్‌సీ: యస్‌బ్యాంక్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌లు ముందుకు వచ్చాయి. 25 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.250 కోట్లకు  ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ కొనుగోలు చేయనుండగా, 30 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.300 కోట్లకు ఫెడరల్‌ బ్యాంక్‌ కొననుంది.

కర్ణాటక బ్యాంక్‌: కర్ణాటక బ్యాంక్‌లో డిపాజిట్లు భద్రంగా లేవని ఇండియా టుడే తప్పుడు ప్రచారం చేస్తుందని, అటువంటి పరిస్థితులు ఏవీ మా బ్యాంక్‌లో లేవని, ఖాతాదారుల డిపాజిట్లు అన్ని భద్రంగానే ఉన్నాయని కర్ణాటక బ్యాంక్‌ వెల్లడించింది.

టాటా మోటార్స్‌:  కరోనా మహమ్మారీ విజృంభిస్తుండడంతో ప్రధాన కార్యాలయం, ప్రాంతీయ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరిని ఇంటివద్ద నుంచే పనిచేయమని టాటా మోటార్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ గ్వింటర్‌ బస్టెచెక్‌ ఇటర్నల్‌ మెమోలు జారీ చేశారు.



You may be interested

ఎస్‌బీఐ చీఫ్‌ను అవమానించిన ఆర్థిక మంత్రి

Monday 16th March 2020

సోషల్ మీడియాలో వైరల్‌గా ఆడియో క్లిప్‌ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్‌పై కేం‍ద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆడియో క్లిప్ ప్రకారం.. రుణవితరణ పెరగకపోవడానికి .. ముఖ్యంగా అస్సాం తేయాకు తోటల్లో పనిచేసే వారికి రుణాలు లభించకపోవడానికి ప్రధాన కారణం అయనేనంటూ నిర్మలా

సెన్సెక్స్‌ 2000 పాయింట్లు క్రాష్‌..!

Monday 16th March 2020

9400 దిగువకు నిఫ్టీ కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి భయాలు దేశీయ స్టాక్‌మార్కెట్‌ను మరోసారి కాటేశాయి. ఫలితంగా సోమవారం బెంచ్‌మార్క్‌ సూచీలు 4.50శాతం నష్టంతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌  1,520.53 పాయింట్లను కోల్పోయి 32582.95 వద్ద, నిఫ్టీ 440.60 పాయింట్లు నష్టపోయి 9514.60 వద్ద ప్రారంభమయ్యాయి.  ఇక కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి తీవ్రత రోజురోజూకు మరింత పెరుగుతుందే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య

Most from this category