News


నేటివార్తల్లోని షేర్లు

Monday 9th March 2020
Markets_main1583736352.png-32360

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు
ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌: ఎస్‌బ్యాంక్‌లో బాండ్లరూపంలో రూ.662 కోట్లరూపాయల  బాకీ  మాత్రమే ఉందని, ఎటువంటి టర్మ్‌లోన్‌లు లేవనీ ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ వెల్లడించింది.  

ఇండస్‌లాండ్‌ బ్యాంక్‌: అదనపు టైర్‌-1 ఇన్‌స్ట్రుమెంట్‌ ద్వారా నిధులు సమీకరించాలనే ప్రణాళికను వాయిదా వేసుకున్నట్లు ఇండస్‌ ల్యాండ్‌ బ్యాంక్‌ ప్రకటించింది.

సెయిల్‌: ఇండియన్‌ రైల్వేస్‌కు 15.5 లక్షల టన్నుల స్టీల్‌ను సరఫరా చేసే ఆర్డర్‌ కోసం ఇండియన్‌ రైల్వేస్‌తో చర్చలు జరుపుతున్నట్లు సెయిల్‌ వెల్లడించింది. 

డీఎల్‌ఎఫ్‌: నాన్‌ కనవర్టబుల్‌ డిబెంచర్స్‌ జారీ ద్వారా రూ.1,000 కోట్ల నిధులు సమీకరించే ప్రతిపాదనకు డీఎల్‌ఎఫ్‌ ప్యానల్‌ బోర్డు ఆమోదం తెలిపింది.

బీపీసీఎల్‌: భారత పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌)లో ప్రభుత్వానికి ఉన్న మొత్తం 53 శాతంవాటాను  విక్రయించేందుకు బిడ్లను ఆహ్వానిస్తోంది.

టాటా స్టీల్‌: కరోనా వ్యాప్తితో చైనానుంచి సరఫరా అయ్యే కన్జూమబుల్స్‌ నిలిచిపోవడంతో టాటా స్టీల్‌ ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకునేందుకు ఆర్డర్లు ఇస్తుంది.

 కాక్స్‌అండ్‌ కింగ్స్‌:  డెట్‌రిడెన్‌ విభాగానికి చెందిన అధికారులు ఫైనాన్సియల్‌ క్రెడెటార్స్‌ జాబితాను రూపొందించగా  కాక్స్‌ అండ్‌ కింగ్స్‌  రూ.2,285 కోట్లు తీసుకొని అతిపెద్ద రుణగ్రహీతగా నిలిచింది.

ముక్తా ఆర్ట్స్‌: ముంబై కేంద్రగా పనిచేస్తోన్న మూక్తా ఏ2 సినిమాస్‌ 2021 నాటికి 25 స్ర్కీన్‌లు పెంచాలనీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ 25తో ముక్తా సినిమాస్‌ స్ర్కీన్‌లు 100 చేరతాయి.
 



You may be interested

కోవిడ్‌ పరిణామాలే నడిపిస్తాయ్‌..

Monday 9th March 2020

కరోనా వైరస్‌ పైనే మార్కెట్‌ దృష్టి కీలకంగా మారిన యస్‌ బ్యాంక్‌  ఈ వారంలో ట్రేడింగ్‌ 4 రోజులకే పరిమితం హోలీ సందర్భంగా మంగళవారం మార్కెట్‌కు సెలవు న్యూఢిల్లీ: ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ (కోవిడ్‌–19) వల్ల ప్రపంచానికి పెద్ద ప్రమాదమే పొంచి ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారణం ఈ వైరస్‌ బాధితుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా లక్ష దాటిపోగా, 3500 మందికిపైగా చనిపోయారు. ఈ స్థాయిలో విజృంభిస్తోన్న

చమురు- 2 రోజుల్లో 40 శాతం ఆవిరి

Monday 9th March 2020

ఇంట్రాడేలో 30 శాతం కుప్పకూలిన ధరలు ఉత్పత్తిలో కోతలకు రష్యా వెనకడుగు 8 డాలర్ల డిస్కౌంట్‌ ప్రకటించిన సౌదీ అరేబియా ఏడేళ్ల గరిష్టానికి బంగారం ధరలు  ప్రపంచ చమురు దేశాలకు షాక్‌నిస్తూ సౌదీ అరేబియా ధరలలో భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. దీంతో నేటి(ఆదివారం అర్ధరాత్రి) ట్రేడింగ్‌లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. 1991 తదుపరి ఒక్క రోజులోనే 30 శాతం పతనమయ్యాయి. వెరసి గల్ఫ్‌ వార్‌ తదుపరి భారీ స్థాయిలో నష్టపోయాయి. ప్రస్తుతం లండన్‌ మార్కెట్లో

Most from this category