News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 3rd December 2019
news_main1575345029.png-30019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
బయోకాన్‌:-
తన భాగస్వామ్య ఫార్మా సంస్థ మైలాన్‌తో కలిసి  అమెరికా మార్కెట్లో కాన్సర్‌ చికిత్సలో వినియోగించే ఓగివ్రి బయోసిమిలర్‌ను విడుదల చేస్తున్న చేస్తున్నట్లు ప్రకటించింది. 
ఐఎఫ్‌సీఐ:- ఎన్‌ఎస్‌ఈలో తన మొత్తం వాటాను విక్రయించేందుకు బిడ్‌లను స్వీకరించింది.
ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌:- నిన్నటి రోజున క్యూఐపీ ఇష్యూ ప్రారంభమైంది. ఇష్యూలో భాగంగా ప్రతి షేరు ధర రూ.352.27లుగా నిర్ణయించింది. మూలధన నిధుల సమీకరణను ఇష్యూను చేపట్టినట్లు ప్రకటించింది. 
ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌ సర్వీసెస్‌:- తక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సాహించే దిశగా ఎఅండ్‌ఎం ఫైనాన్స్‌లో రూ.1433 కోట్ల యాంకర్‌ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రపంచ బ్యాంక్‌ గ్రూప్‌ విభాగం ఐపీఎఫ్ ప్రకటించింది. 
నెస్లే ఇండియా:- నేడు(డిసెంబర్‌ 03న) జరిగే బోర్డు సమావేశంలో మధ్యంతర డివిడిండ్‌ జారీకి ఆమోదం తెలపనుంది. 
క్రాంప్టన్‌ కన్జూ‍్యమర్‌:- కంపెనీ ప్రమోటర్‌ ఒకరు బ్లాక్‌ డీల్‌ ఒప్పందం ద్వారా 7.2శాతం నుంచి 8.8శాతం వాటాను విక్రయించేందుకు చూస్తున్నట్లు సీఎన్‌బీసీ ఒక ప్రకటనలో తెలిపింది. 
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా:- డిసెంబర్‌ 5న మూలధన నిధుల సమీకరణకు రుణదాతం ఆమోదం తెలిపారు. 
గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌:- యువజన డెవెలప్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 20శాతం వాటాను కొనుగోలు చేసింది. 
జైపీ ఇన్ఫ్రాటెక్‌:- యస్‌ బ్యాంక్‌కు బకాయిలకు తీర్చడంలో విఫలం కావడంతో బ్యాంకు దివాళా స్మృతి చట్టం కింది ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. 
కేఈఐ ఇండస్ట్రీస్‌:- పలు విడుతల్లో నిధుల సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. 
గతి:- ఫ్రిపరెన్షియల్‌ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ అంశానికి బోర్డు ఆమోదం తెలిపింది. 

 



You may be interested

పాజిటివ్‌ ప్రారంభం

Tuesday 3rd December 2019

అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నా, మంగళవారం భారత్‌ స్టాక్‌ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 80 పాయింట్ల లాభంతో 40,852 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 12,067 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 

వృద్ధి 5.1 శాతం మించదు

Tuesday 3rd December 2019

అంచనాలను కుదించిన క్రిసిల్‌ ఇంతక్రితం అంచనా 6.3 శాతం ముంబై: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 2019–20 ఆర్థిక సంవత్సరం అంచనాలను రేటింగ్స్‌ ఏజెన్సీ క్రిసిల్‌ తగ్గించింది. ఇంతక్రితం 6.3 శాతం ఉన్న ఈ రేటును 5.1 శాతానికి తగ్గిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఊహించినదానికన్నా మందగమన తీవ్రత ఎక్కువగా ఉందనీ తన తాజా నివేదికలో పేర్కొంది.  ‘‘పారిశ్రామిక ఉత్పత్తి, ఎగుమతులు, బ్యాంకింగ్‌ రుణ వృద్ధి, పన్ను వసూళ్లు, రవాణా, విద్యుత్‌ ఉత్పత్తి వంటి

Most from this category