News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 25th September 2018
Markets_main1537848311.png-20535

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
కజారియా కెమికల్స్‌:- తన అనుబంధ సంస్థ కజారియా ఫ్లోరోకెమికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన 30లక్షల ఈక్విటీ షేర్లను రూ.7.20 కోట్లకు కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
యూనికెమ్‌ ల్యాబ్స్‌:- రేటింగ్‌ సంస్థ ఇక్రా... యూనికెమ్‌ ల్యాబ్స్‌కు చెందిన రూ.30కోట్ల లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌కు ఎ(+) స్టేబుల్‌ అవుట్‌ లుక్‌ రేటింగ్‌ను కేటాయించింది.
వక్రంగీ:- మినిస్టరీ ఆఫ్‌ కార్పోరేట్‌ ఎఫైర్స్‌ శాఖ నుంచి ఎలాంటి షోకాజ్‌ నోటీసులను అందుకోలేదని ఎక్చ్సేంజ్‌లకు వివరణనిచ్చింది.
అడ్‌లాబ్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌:- ఏ.పీ.లోని అమరావతిలో ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్క్‌ ఏర్పాటుకు ‘‘రివర్‌బే’’ గ్రూప్‌తో మౌలిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
మంగళం డ్రగ్స్‌&ఆర్గానిక్స్‌:- వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌(డబ్ల్యూఓ)నుంచి ‘‘ఈఫెవిరిజ్‌’’ ఔషధాలకు తుది అనుమతులు దక్కించుకుంది.
ఏబీబీ:- ఎలక్ట్రానిక్స్‌ వాహనాల తయారీ ఉపయోగించే ‘‘ఛార్జీంగ్‌ సెల్యూషన్‌’’ పరికరాలను మార్కెట్‌లోకి విడుదల చేసింది.
ఓరియంటల్‌ బ్యాంక్‌:- రేటింగ్‌ సంస్థ కేర్‌ కొన్ని బాం‍డ్ల రేటింగ్‌ను సవరించింది.
యస్‌ బ్యాంక్‌:- ‘‘జీఎస్‌టీ అతిక్రమణ నేపథ్యంలో బ్యాంక్‌కు ఆర్‌బీఐ రూ.38 కోట్ల జరిమానా విధించింద’’నే వార్తలు అవాస్తమని ఎక్స్చేంజ్‌లకు వివరణ ఇచ్చింది.
అవెన్యూ సూపర్‌మార్ట్స్‌:- రేటింగ్‌ సంస్థ క్రిసెల్‌ రూ.200 కోట్ల కమర్షియల్‌ పేపర్లకు ఎ1(+)రేటింగ్‌ను కేటాయించింది.
ఇన్ఫోసిస్‌:- కెనడా దేశానికి చెందిన పబ్లిక్‌ సర్వీసెస్‌ మంత్రిత్వశాఖ నుంచి 80.3 మిలియన్‌ డాలర్ల ఆర్డర్లను దక్కించుకుంది. ఈ ఆర్డర్‌లో భాగంగా ఇన్ఫోసిస్‌ విద్యుత్‌ సేకరణలో అవసరమయ్యే సాంకేతిక పరిఙ్ఞానాన్ని ఆ శాఖకు అందించనుంది.
కెనరా బ్యాంక్‌:- జీటీఎల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌పై బ్యాంకు దివాళా చట్టాన్ని ధాఖలు చేసింది.
దేనా బ్యాంక్‌:- బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా&విజయా బ్యాంక్‌లతో విలీనానికి బోర్డు ఆమోదం తెలిపింది.
మోసార్‌ బేయర్‌ ఇండియా:- కంపెనీ లిక్విటిడీని పెంచుకునేందుకు ఎన్‌సీఎల్‌టీ అనుమతి ఇచ్చింది.
హిమాచల్‌ ఫ్యూచరిస్టిక్‌ కమ్యూనికేషన్‌:- బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి రూ.558.36కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది.
ఎస్‌బీఐ లైఫ్‌:- బీఎన్‌బీ పారిబా కార్డిఫ్ సంస్థ ఎస్‌బీఐ లైఫ్‌లో షేర్‌ హోల్డింగ్‌ వాటాను తగ్గించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.
మోనోశాంట్‌ ఇండియా:- చెరుకూరి రవిప్రకాశ్‌ ఎండీగా నియమితులయ్యారు.You may be interested

ఆల్‌టైమ్‌ కనిష్టానికి సమీపంలో రూపీ

Tuesday 25th September 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి మంగళవారం జీవిత కాల కనిష్ట స్థాయికి సమీపంలో ప్రారంభమైంది. క్రూడ్‌ ధరలు నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరుకోవడం ప్రతికూల ప్రభావం చూపింది. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 72.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన సోమవారం ముగింపు 72.63తో పోలిస్తే 0.44 శాతంమేర నష్టపోయింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మంగళవారం 72.96 వద్ద ప్రారంభమైంది.  క్రూడ్‌ ధరల పెరుగుదల

లాభాలు కొన్ని క్షణాలే..

Tuesday 25th September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,305 పాయింట్లతో పోలిస్తే 45 పాయింట్ల లాభంతో 36,350 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,967 పాయింట్లతో పోలిస్తే 2 పాయింట్ల స్వల్ప లాభంతో 10,969 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే ఇండెక్స్‌లు వెంటనే నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం 9:26 సమయంలో సెన్సెక్స్‌ 41 పాయింట్ల నష్టంతో 36,264 పాయింట్ల

Most from this category