News


సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 29th July 2019
Markets_main1564373013.png-27364

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
టాటాస్టీల్‌ స్పాంజ్‌ ఐరన్‌:-
ఇండియ రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ ‘‘స్థిరత్వం’’ అవుట్‌లుక్‌ రేటింగ్‌ కేటాయించింది. 
ఉషా మార్టిన్‌:- బ్యాంకు రుణ సదుపాయ సౌకర్యాలపై  ఇండియ రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ రేటింగ్‌ను బిబి(+)నుంచి బిబిబి(+)కు పెంచింది. 
నవనీత్‌ ఎడ్యుకేషన్‌:- క్రిసెల్‌ రేటింగ్‌ సంస్థ రూ.300 కోట్ల కమర్షియల్‌ పేపర్ల ఇష్యూకు ఎ1(+) రేటింగ్‌ను కేటాయించింది. 
ఆర్తి డ్రగ్స్‌:- కంపెనీ ధీర్ఘకాలిక రేటింగ్‌ను క్రిసెల్‌ రేటింగ్‌ సంస్థ క్రిసెల్‌6+/స్థిరత్వం నుంచి క్రిసెల్‌ ఎ/పాజిటివ్‌కు అప్‌గ్రేడ్‌ చేసింది. 
మన్‌పసంద్‌ బేవరీజెస్‌:- గతంతో అరెస్టైన అధికారులకు గుజరాత్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 
కేడిలా హెల్త్‌కేర్‌:- అంకలేశ్వర్‌ యూనిట్‌ను తనిఖీలు చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ నో అబ్జర్వేషన్‌ లెటర్‌ను జారీ చేసింది. 
పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌:- ఆంద్రప్రదేశ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ రూ.512.78 కోట్ల విలువైన ఆర్డర్లను రద్దు చేసింది. 
జీటీపీఎల్‌ హాత్‌వే:- కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసరుగా విరెన్‌ థక్కర్‌ రాజీనామా చేశారు. 
మిండా ఇండస్ట్రీస్‌:-  రూ.30 కోట్ల విలువైన కమర్షియల్‌ పేపర్లను జారీ చేసింది. 
అలహదబాద్‌ కంపెనీ:- క్యూఐపీ, ఎఫ్‌పీఓ, రైట్స్‌ ఇష్యూ పద్దతిల్లో ఈక్విటీ షేర్ల జారీ ద్వారా కంపెనీ రూ.400 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది. 
గ్రాన్యూల్‌ ఇండియా:- హైదరాబాద్‌ యూనిట్‌కు యూఎస్‌ఎఫ్‌డీ ఒక 483 అబ్జర్వేషన్‌ ఫామ్‌ను జారీ చసింది. 

నేడు క్యూ1 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- డాక్టర్‌ రెడ్డీస్‌, డీఎల్‌ఎఫ్‌, సుప్రీం ఇండస్ట్రీస్‌, ఐఎఫ్‌బీ అగ్రో ఇండస్ట్రీస్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా, సోనోఫి ఇండియా, భరత్‌ ఎలక్ట్రానిక్స్‌, ఓరియంట్‌ సిమెంట్‌, జీహెచ్‌సీఎల్‌, లాయిడ్‌ స్టీల్‌ ఇండస్ట్రీస్‌, ఇండియా గ్రిడ్‌ ట్రస్ట్‌, గోకుల్‌దాస్‌ ఎక్స్‌పోర్ట్స్‌, సన్‌ఫార్మా అడ్వాన్డ్‌ రీసెర్చ్‌ కంపెనీ, సెంచూరీ ఎంకా, జేఎంసీ ప్రాజెక్ట్స్‌, కాస్ట్రోల్‌ ఇండియా, దాల్మియా షుగర్స్‌, శ్రీరాం సిటీ యూనియన్‌ ఫైనాన్స్‌, చెన్నై పెట్రోలియం కార్పోరేషన్‌, కన్సాయ్‌ నెరోలాక్‌ పెయింట్స్‌, టాన్స్‌పోర్ట్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా, అలెంబిక్‌ ఫార్మాస్యూటికల్స్‌, టాటా స్పాంజ్‌ ఐరన్‌, కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌, వీ2 రిటైల్‌, ఈఐడీ ప్యారీ ఇండియా, కేపీఆర్‌ మిల్‌, ముత్తూట్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌.You may be interested

స్థిరంగా చమురు

Monday 29th July 2019

బహుళ పార్టీ అణు ఒప్పందంపై సంతకం చేసిన వారితో జరిగిన అత్యవసర సమావేశం ‘నిర్మాణాత్మక’ంగా ఉందని ఇరాన్‌ అభివర్ణించడంతో సోమవారం(జులై 29) ఆయిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. డబ్యూటీఐ క్రూడ్‌ 0.2 శాతం తగ్గి బ్యారెల్‌కు 56.08 డాలర్లకు పడిపోయింది. కాగా డబ్ల్యుటిఐ గత వారం 1 శాతం లాభపడింది. బ్రెంట్‌ క్రూడ్‌ 0.4 శాతం పెరిగి బ్యారెల్‌కు 63.23 డాలర్లకు చేరుకుంది.  గత వారం ఈ ధరలు 1.6

11,300పైన నిఫ్టీ ప్రారంభం...కొద్ది నిముషాల్లో నష్టాల్లోకి

Monday 29th July 2019

-ఐసీఐసీఐ బ్యాంక్‌ 4 శాతం జంప్‌ ఆసియా మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నా, సోమవారం భారత్‌ సూచీలు గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 160 పాయింట్ల లాభంతో 38,043 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,300పైన 23 పాయింట్ల లాభంతో 11,307 వద్ద ఆరంభమయ్యింది. అయితే ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్ది నిముషాల్లోనే సూచీలు నష్టాల్లోకి జారిపోయాయి. 9.35 గంటల సమయానికి నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో 11,243 పాయింట్ల స్థాయికి పడిపోగా, సెన్సెక్స్‌

Most from this category