News


నేటి వార్తల్లోని షేర్లు

Friday 28th February 2020
Markets_main1582867356.png-32158

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు

టాటా పవర్‌: సుంకాలు పెంచకపోతే గుజరాత్‌, హర్యాణ, పంజాబ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రల డిస్కంలకు  మార్చి నుంచి పవర్‌ సరపరాను నిలిపివేస్తామని టాటా పవర్‌ వెల్లడించింది.

హెచ్‌యూఎల్‌: గ్రామీణ ప్రాంతాల్లో ఆశించినస్థాయిల్లో కొనుగోళ్లు లేకపోవడం వల్ల వ్యాపార వృద్ధి సాఫ్ట్‌గా సాగుతుందని యూనిలీవర్‌ కంపెనీ వెల్లడించింది. యూనీలీవర్‌ మొత్తం విక్రయాల్లో ఇండియాలో జరిగేవి 9 శాతంగా ఉన్నాయని కంపెనీ తెలిపింది.

ఎన్‌బీసీసీ: దక్షిణ ఢిల్లీలోని నౌరోజి నగర్‌, సరోజీ నగర్‌లలో ఉన్న 80 లక్షల చదరపు అడుగుల కమర్షియల్‌ స్థలం ద్వారా రూ.32,000కోట్ల నిధులు సమీకరించవచ్చని నేషనల్‌ బిల్డింగ్స్‌ కనస్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ అంచనా వేస్తోంది.

టైటాన్‌ కంపెనీ: మోర్గాన్‌ స్టాన్లీ ఫ్రాన్స్‌ ఎస్‌ఏఎస్‌  టైటాన్‌ కంపెనీకి చెందిన రూ.125 కోట్ల విలువైన షేర్లను బహిరంగ మార్కెట్‌లో  అఫ్‌లోడ్‌ చేసింది.

పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌: ఇటలీకి చెందిన టెనాక్స్‌ ఎస్‌పీఏలో భారత అనుబంధ సంస్థలోని 70 శాతం వాటాను రూ.80 కోట్లకు కొనుగోలు చేసినట్లు పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించింది.

 



You may be interested

5నిమిషాల్లో రూ.5లక్షల కోట్లు ఆవిరి..!

Friday 28th February 2020

మార్కెట్లో నెలకొన్న అమ్మకాల సునామీతో శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభమైన కేవలం 5నిమిషాల్లోనే ఏకంగా రూ.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ మొత్తం మార్కెట్‌ క్యాప్‌ రూ.150లక్షల కోట్ల దిగువకు చేరుకుంది. కరోనా వైరస్‌ భయాలతో వరుసగా ఆరో రోజూ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ 6రోజుల్లో బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాప్‌ దాదాపు రూ.10లక్షల కోట్లు హరించుకుపోయింది. కరోనా వైరస్ అంటువ్యాధి పశ్చిమదేశాలకు చేరుకోవడంతో దలాల్

రూ.42,600 వద్ద స్థిరంగా పసిడి

Friday 28th February 2020

కరోనా వైరస్‌ వివిధ దేశాలకు విస్తరిస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలినప్పటికీ బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. శుక్రవారం దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల పసిడి రూ.42,611.00 వద్ద  స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ నిన్నటితో పోలిస్తే 4 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం ధర 1,640.15 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. (గురువారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌

Most from this category