News


సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 24th December 2018
Markets_main1545623960.png-23183

వివిధ వార్తలను అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
ఎఫ్‌ఎంజీసీ షేర్లు:- జీఎస్‌టీ మండలి శనివారం నిర్వహించిన సమావేశంలో 23 రకాల వస్తు, సేవల పన్ను రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో నేటి ట్రేడింగ్‌లో ఎఫ్‌ఎంజీసీ షేర్లు ఫోకస్‌లో వుండొచ్చు.
సిమెంట్స్‌ షేర్లు:- సిమెంట్‌ ధరపై జీఎస్‌టీని తగ్గించాలని జూలైలో కౌన్సిల్‌ చర్చించనా, పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ నిర్ణయం ఆగిపోయింది. ఈ నేపథ్యంలో నేటి ట్రేడింగ్‌లో సిమెంట్‌ కంపెనీ షేర్లు ఫోకస్‌లో వుండొచ్చు.
చక్కెర షేర్లు:- దేశంలో ఇథనాల్‌ సామర్థా్‌న్ని పెంచే లక్ష్యంలో భాగంఆ చక్కెర మిల్లులకు రూ.7400 కోట్ల రుణాలు ఇచ్చే ప్రతిపాదనను కేంద్ర పరిశీలిస్తున్న తరుణంలో నేటి ట్రేడింగ్‌లో చక్కెర షేర్లు ర్యాలీ జరపవచ్చు.
హిమాచల్‌ ఫ్యూచరిస్టిక్స్‌ కమ్యూనికేషన్స్‌:- ఎల్‌ అండ్‌ టీ నుంచి రూ.150 కోట్ల విలువైన ఆర్డర్లును దక్కించుకుంది. ఈ ఆర్డర్లో భాగంగా మారిషన్‌ మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఢాకా మెట్రో ప్రాజెక్ట్‌లకు టెలీ కమ్యూనికేషన్స్‌ సేవలను అందించనుంది.
ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌:- శివిందర్‌ మోహన్‌ సింగ్‌, మల్విందర్‌ మోహన్‌ సింగ్‌ల నుంచి రూ.403 కోట్లు రికవరీ చేయాలని సెబీ శుక్రవారం ఆదేశించింది. వీళ్లిద్దరితో పాటు మరో ఏడు ఇతర సంస్థల నుంచి ఈ మొత్తంతో పాటు వడ్డీని కూడా మూడు నెలల్లో రికవరీ చేయాలని ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌, ఫోర్టిస్‌ హాస్పిటల్స్‌కు సెబీ ఆదేశాలు జారీ చేసింది.
రిలయన్స్‌ ఇండస్ట్రీస్:- వకెట్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌లో కంపెనీ 5.65శాతం వ్యూహాత్మక వాటా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసినట్లు కంపెనీ తెలిపింది.
ఈపీసీ ఇండస్ట్రీస్‌:- ప్రస్తుతం ఈపీసీ ఇండస్ట్రీస్‌గా ఉన్న కంపెనీ పేరును మహీంద్రా ఈపీసీ ఇరిగేషన్‌ లిమిటెడ్‌గా మార్చేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
యూనిటెక్‌ ల్యాబ్స్‌:- పక్షవాతం వ్యాధి చికిత్సలో వినియోగించే ప్రమీప్లో్‌ల్‌ డైహైడ్రోక్లోరైడ్‌ ఔషధాలకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకుంది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌:- తన అనుబంధ సంస్థ అదానీ వాటర్‌ లిమిటెడ్‌ను విలీనం చేసుకుంది.
అమ్‌టెక్‌ ఆటో:- బాండ్ల రెమిడేషన్‌ తుది గడువును పూర్తి చేయలేకపోవడంతో సెబీ రూ.15లక్షల జరిమానాను విధించింది.
గామన్‌ ఇండియా:- కంపెనీ వ్యతిరేకంగా ఎస్‌బీఐ ధాఖలు చేసిన పిటిషన్‌ను ముంబై హైకోర్టు కొట్టివేసింది.
ఎస్‌బీఐ:- బాసెల్‌-III నిబంధలనలకు అనుగుణంగా రూ.2045 కోట్ల విలువైన టైర్‌-I బాండ్ల విడుదలకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఇండిగో:- కోడ్‌ షేరింగ్‌తో పాటు ఇతర సాంకేతిక పరిఙ్ఞానాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు టర్కీష్‌ ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
అవెన్యూ సూపర్‌మార్ట్‌:- రూ.50కోట్ల విలువైన కమర్షియల్‌ బాండ్ల ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది.
యాక్సిస్‌ బ్యాంక్‌:- ప్రస్తుతం రిటైల్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆనంద్‌ రాజీవ్‌ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు.
ఎస్సాల్‌ ప్రోప్యాక్‌:- నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల ఇష్యూపై కంపెనీ రూ.50 కోట్ల వడ్డీని చెల్లించింది.
కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌:- తన అనుబం‍ధ సంస్థ కాఫీడే కబీనీ రిసార్ట్స్‌ లిమిటెడ్‌ విలీన ప్రక్రియను పూర్తి చేసింది.
ఎన్‌ఎండీసీ:- ఈ సంవత్సరంలో నవంబర్‌తో పూర్తయిన దొనమలై గనుల లీజును కర్ణాటక ప్రభుత్వం 2038 వరకు పొడిగించింది. అయితే ఇనుప ఖనిజంపై సగటు అమ్మకం విలువలో 80శాతం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలని షరతు పెట్టింది. ఈ నేపథ్యంలో కంపెనీ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది.You may be interested

రూపీ డౌన్‌..

Monday 24th December 2018

ఇండియన్‌ రూపాయి సోమవారం ప్రారంభంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే స్వల్పంగా నష్టపోయింది. ఆసియా ప్రధాన కరెన్సీలు మిశ్రమంగా ట్రేడవుతుండటం ఇందుకు కారణం. ఉదయం 9:10 సమయంలో రూపాయి 70.21 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ముగింపు స్థాయి 70.18తో పోలిస్తే 0.03 శాతం నష్టపోయింది.  భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.292 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు స్థాయి 7.277 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, ధరలు పరస్పరం వ్యతిరేక

పాజిటివ్‌ ఓపెనింగ్‌

Monday 24th December 2018

10,780 వద్ద నిఫ్టీ ప్రారంభం సెన్సెక్స్‌ 100 పాయింట్లు అప్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,754 పాయింట్లతో పోలిస్తే 26 పాయింట్ల లాభంతో 10,780 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,742 పాయింట్లతో పోలిస్తే 117 పాయింట్ల లాభంతో 35,859 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే కొద్దిసేపటి తర్వాత ఇండెక్స​ లాభాలు తగ్గాయి. ఇండెక్స్‌లు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి.  ఆసియా

Most from this category