News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 16th July 2019
Markets_main1563254071.png-27087

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
కమ్మిన్స్‌ ఇండియా:-
కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా సందీప్‌ సిన్హా తన పదవికి రాజీనామా చేశారు.
బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌:- 1:2 నిష్పత్తిలో షేర్ల బోనస్‌ను ఇష్యూ చేసింది. ప్రమోటర్‌ గ్రూప్‌నకు చెందిన 42.75లక్షల వారెంట్లను ఈక్విటీ షేర్లగా మార్చుకునేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
జిందాల్‌ కాటెక్స్‌:- కంపెనీ ఛైర్మన్‌ పదవికి కనిక్‌ శర్మ రాజీనామా చేశారు. 
అశోక్‌ లేలాండ్‌:- డిమాండ్‌ తగ్గడంతో పట్నానగర్‌ యూనిట్‌ను జూలై 16 నుంచి జూలై 24వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. 
ఆదిత్యా బిర్లా ఫ్యాషన్‌:- ఫైనీష్‌ ఇంటర్నేషనల్‌ డిజైన్‌ లిమిటెడ్‌లో 51శాతం వాటాను కొనుగోలు చేసింది. 
కెపాసిటీ ఇన్ప్రా ప్రాజెక్ట్స్‌:- జూలై 19న కంపెనీ బోర్డు సమావేశాన్ని నిర్వహించనుంది. మూలధన నిధులను మరింత పెంచుకునేందుకు నిధుల సమీకరణ అంశంపై చర్చించనున్నారు. 
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌:- జూలై 20న కంపెనీ ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించనుంది. 
జై ప్రకాశ్‌ అసోసియేట్స్‌:- కంపెనీ స్వతంత్ర డైరెక్టర్‌ పదవికి చంద్ర ప్రకాశ్‌ జైన్‌ రాజీనామా చేశారు. 
గ్రేవ్స్‌ కాటన్‌:- తన అనుబంధ సంస్థ ఆంపీయర్‌ వెహికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 10.69లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. తద్వార కంపెనీలో తన వాటాను 72.11శాతం నుంచి 81.23శాతానికి పెంచుకుంది.
పీటీసీ ఇండియా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌:- కంపెనీ ఎన్‌సీడీలపై స్వల్పకాలికానికి ఎఎ(+)రేటింగ్‌ను పెంచింది. అలాగే స్థిరత్వం అవుట్‌లుక్‌ను కేటాయించింది.
యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా:- సైబర్‌ సెక్యూరిటీ నిబంధనల ఉల్లఘించిన నేపథ్యంలో ఆర్‌బీఐ రూ.10లక్షల జరిమానను విధించింది. 
ఐఎల్‌ఎఫ్‌ఎస్‌:- మొరాదాబాద్ బరేలీ ఎక్స్‌ప్రెస్‌వే, జార్ఖండ్ రోడ్ ప్రాజెక్ట్స్, పశ్చిమ గుజరాత్ ఎక్స్‌ప్రెస్‌వే సంస్థల రుణదాతలతో కంపెనీ బైండింగ్ టర్మ్ షీట్‌లో సంతకం చేసింది. 
అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌:- జూలై 12న కంపెనీ ప్రమోటర్‌ 4.31శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను తనఖా పెట్టారు.
వోడాఫోన్‌ ఇండియా:- రైట్స్‌ ఇష్యూ ద్వారా సమీకరించిన రూ. 25,000 కోట్ల మొత్తంలో రూ.4,300 కోట్లను రుణదాతలకు చెల్లించినట్లు కంపెనీ తెలిపింది.
జెట్‌ ఎయిర్‌వేస్‌:- ఇవాళ జరిగాల్సిన రుణదాతల సమావేశాన్ని వాయిదా వేసింది. 
నేడు క్యూ1 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, టీవీ 18 బ్రాడ్‌కాస్ట్‌, నెట్‌వర్క్‌ 18మీడియా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, నెక్ట్స్‌ మీడియా వర్స్క్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఆగ్రో టెక్‌ ఫుడ్స్‌, డీసీబీ బ్యాంక్‌, 5పైసా క్యాపిటల్‌, జై భారత్‌ మారుతి, వికాస్‌ మల్టీకార్ప్‌.You may be interested

స్వల్పంగా పెరిగిన పసిడి

Tuesday 16th July 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర మంగవారం స్పల్పంగా పెరిగింది . ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 3.50డాలర్లు పెరిగి 1,417 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా ఇవాళ ప్రకటించే రిటైల్‌ అమ్మకాల గణాంకాలు కోసం ట్రేడర్లు ఎదురుచూస్తున్నారు. బలమైన గణాంకాలు నమోదైనట్లేతే పసిడి ధర అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చని బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు డాలర్‌ ఇండెక్స్‌  స్థిరంగా ర్యాలీ చేస్తుండటం కూడా పసిడి ధరపై పెద్దగా ప్రభావాన్ని

68.54 వద్ద ప్లాట్‌గా రూపీ

Tuesday 16th July 2019

దేశియ ఎగుమతులు ఎనిమిది నెలల తర్వాత నెగిటివ్‌ జోన్‌లోకి పడిపోవడంతో రూపీ డాలర్‌ మారకంలో మంగళవారం(జులై 16) ట్రేడింగ్‌లో 68.54 వద్ద ప్లాట్‌గా ప్రారంభమైంది. జూన్‌ నెలలో ఎగుమతులు 9.71 శాతం తగ్గి 25.01 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. దీంతో పాటు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గడంతో జూన్‌ నెలలో 9 శాతం దిగుమతులు తగ్గి 40.29 బిలియన్‌ డాలర్లగా ఉంది. వాణిజ్య లోటు 15.28 బిలియన్‌ డాలర్లు కాగా

Most from this category