News


గురువారం వార్తలోని షేర్లు

Thursday 20th June 2019
Markets_main1561007279.png-26431

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
అపోలో హాస్పిటల్‌:-
హెచ్‌డీఎఫ్‌సీ అపోలో మ్యూనిక్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలో మెజారిటా వాటాను కొనుగోలు చేసింది. అపోలో హాస్పిటల్‌ నుంచి రూ.1347 కోట్లకు రూ.51.2 శాతం వాటను కొనుగోలు చేయనుంది. ఈ మొత్తం వాటాను హెచ్‌డీఎఫ్‌సీ సొంత బీమా సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌లో విలీనం చేయనుంది. 
అదానీ​గ్రీన్‌ ఎనర్జీ:- తన అనుబంధ సం‍స్థ అదానీ రెన్యూవబుల్‌ ఎనర్జీ పార్క్‌... సోలార్‌ ఎనర్జీ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా నుంచి 600 మెగావాట్ల సామర్థ్యం గల  పవన, సౌర విద్యుత్‌ ప్రాజెక్ట్స్‌ ఆర్డర్లను దక్కించుకుంది.
ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌:- భారత్‌ ఫైనాన్షియల్‌ విలీనం వచ్చే నెల 4 నుంచి అమల్లోకి రానుంది 
రిలయన్స్‌ పవర్‌:- మధ్యప్రదేశ్‌ యూనిట్‌లో ఉద్గారాల నియత్రయణ వ్యవస్థను అమలు చేయడానికి మధ్యప్రదేశ్‌లో సెంట్రల్‌ ఎలక్ట్రాసిటి రెగ్యూలేటరీ కమీషన్‌ నుంచి అనుమతులు దక్కించుకుంది.
ఓఎన్‌జీసీ:- మొజాంబిక్ ఎల్‌ఎన్‌జి ప్రాజెక్ట్స్‌లో 20బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది.
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌:- బాసెల్‌-III నిబంధనలకు అనుగుణంగా టైర్‌-II బాండ్ల జారీ చేసి రూ.1500 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఎస్సెల్‌ ప్రోప్యాక్‌:- ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో రూ.30 కోట్ల నిధుల సమీకరణకు కమర్షియల్‌ పేపర్లను జారీ చేయనుంది. 
అమరరాజాబ్యాటరీస్‌:- ప్రతి ఈక్విటీ షేరుపై రూ.5.08ల డివిడెండ్‌ జారీకి బోర్డు ఆమోదం తెలిపింది.
ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌:- ఎన్‌సీడీల జారీ ద్వారా నిధుల సమీకరణ అంశంపై చర్చించేందుకు బోర్డు జూన్‌ 24న సమావేశం నిర్వహించనుంది. 
సౌత్‌ ఇండియా బ్యాంక్‌:- నిబంధనలకు ఉల్లఘించిన కేసులో ఆర్‌బీఐ రూ.10లక్షల జరిమానా విధించింది.
అశోక్‌ లేలాండ్‌:- యూనిట్‌ మెయింటెన్స్‌ కొరకు జూన్‌ 24-29 వరకు పాంట్నాగర్ ప్లాంట్‌ను మూసివేయనుంది.
సన్‌ఫార్మా:- యూఎస్‌ఎఫ్‌డీఏ హలోల్‌ ప్లాంట్‌పై 4 అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
బ్లూస్టార్‌:- ముంబయి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.253 కోట్ల విలువైన కాంట్రాక్టు దక్కించుకుంది.
ఎంఅండ్‌ఎం:- సెబీ విధించిన రూ.12 లక్షల జరిమానాపై అప్పీల్‌కు వెళ్లనున్నట్లు కంపెనీ తెలిపింది. You may be interested

ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ టార్గెట్‌ ధరను తగ్గించిన నోముర

Thursday 20th June 2019

ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌ గురువారం ఇంట్రాడేలో 1.31 శాతం నష్టపోయి రూ.131 వద్ద ట్రేడవుతోంది. జపాన్‌ బ్రోకరేజి సంస్థ నోముర తక్కువ సంపాదన అంచనాల నేపథ్యంలో ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ షేరు టార్గెట్‌ ధరను 7 శాతం తగ్గించింది. టార్గెట్‌ ధరను షేరుకు రూ.171 నుంచి రూ.159 కి తగ్గించి బై కాల్‌ను కొనసాగిస్తోంది. ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ ఓపెన్‌ ఆఫర్‌కు వెళ్లిన తర్వాత ఈ టార్గెట్‌ తగ్గింపు ఉండడం గమనార్హం. ‘‘మేము కంపెనీ

ఒక శాతం పెరిగిన చమురు ధరలు

Thursday 20th June 2019

అమెరికా చమురు నిల్వలు ఊహించని దానికంటే ఎక్కువగా పడిపోవడంతో పాటు ఒపెక్‌ దేశాలు, ఇతర ఉత్పత్తి దేశాల సమావేశానికి తేదీ ఖరారు కావడంతో గురువారం చమురు ధరలు ఒక శాతం పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 1.3శాతం పెరిగి బ్యారెల్‌ 62.64డాలర్ల వద్ద, డబ్యుటీఐ క్రూడ్‌ 1.5శాతం పెరిగి బ్యారెల్‌ 54.55డాలర్ల వద్ద  ట్రేడవుతున్నాయి. గత సెషన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ 0.5శాతం, డబ్యుటీఐ క్రూడ్‌ 0.26 శాతం నష్టపోయిన విషయం తెలిసిందే.

Most from this category