News


గురువారం వార్తల్లో షేర్లు

Thursday 9th May 2019
Markets_main1557377335.png-25633

వివిధ వార్తలకు అనుగుణంగా నేడు ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
బలరామ్‌ చిని:-
 షేర్ల బైబ్యాక్‌ ఇష్యూ మే 16న ప్రారంభమై, ఇదే నెల 26న ముగిస్తుంది. 
రిలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌:- ఇక్రా రేటింగ్‌ సంస్థ ధీర్ఘాకాలిక బుణ సదుపాయాలపై రేటింగ్‌ను ‘‘డీ’’ నుంచి ‘‘బిబి’’కి సవరించింది. 
యస్‌ బ్యాంక్‌:- ఇండియా రేటింగ్‌ సంస్థ బ్యాంకు రేటింగ్‌ను ఎఎ(+) నుంచి ఎఎ(-) నుంచి నెగిటివ్‌కు డౌన్‌గ్రేడ్‌ చేసింది.
టీవీఎస్‌ మోటర్‌:- టాగ్‌బాక్స్‌ సెల్యూషన్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. 
పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌:- అట్లాంటిక్‌ గ్రూప్‌ నకు 6.5శాతం వాటాను రూ.935 కోట్లకు కొనుగోలు చేసేందుకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా నుంచి ఆమోదం దక్కించుకుంది. 
టాటా గ్లోబల్‌ బేవరేజెస్‌:- శిఖాశర్మ, భరత్‌ పూరీలను తమ బోర్డులో అదనపు, స్వతంత్ర డైరెక్టర్లుగా అయిదేళ్ల కాలానికి నియమించినట్లు తెలిపింది. 
దీపక్‌ ఫైర్టిలైజర్స్‌:- రెండు విడతల్లో విదేశీ కరెన్సీ కన్వర్టబుల్‌ బాండ్లను జారీ చేసి 30 మిలియన్ల డాలర్ల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.

నేడు క్యూ4 ఫలితాలను వెల్లడించే కొన్ని ప్రధాన కంపెనీలు:- హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఏషియన్‌ పేయింట్స్‌, అపోలో టైర్స్‌, వోల్టాస్‌, మహానగర్‌గ్యాస్‌, శంకర బిల్డింగ్‌ ప్రాజెక్ట్స్‌, సౌతిండియా బ్యాంక్‌, ఆస్ట్రా మైక్రో ప్రాడెక్ట్స్‌, సైబర్‌ సిస్టమ్స్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్‌, దాల్మియా భారత్‌, గాయత్రి షుగర్స్‌, గుజరాత్‌ మినరల్‌ డెవెలప్‌మెంట్‌ కార్పోరేషన్‌, గ్రాన్యూల్‌ ఇండియా, గుజరాత్‌ స్టేట్‌ పెట్రోనెట్‌, జీటీఎల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌, హెచ్‌సీసీ, హికాల్‌, హిందూజా వెంచర్స్‌, హిందూస్థాన్‌ మీడియా వెంచర్స్‌, ఇక్రా, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌, కల్పతరు ట్రాన్స్‌మిషన్ష్‌, మంగళం డ్రగ్స్‌, ఓరాకిల్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, పీటీఎల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, సోలార్‌ ఇండస్ట్రీస్‌, టైమెక్స్‌ గ్రూప్‌ ఇండియా, వరుణ్‌ బేవరీజెస్‌, వర్ధమాన్‌ టెక్స్‌టైల్స్‌ You may be interested

11250 పాయింట్ల వద్ద నిఫ్టీకి మద్దతు

Thursday 9th May 2019

నాణ్యమైన కంపెనీలనే ఎంచుకోవాలని నిపుణుల సూచన అంతర్జాతీయ పరిణామాలు, క్యు4లో మిశ్రమ ఫలితాలు, ఎన్నికల ఫలితాలపై ఆందోళన.. వెరసి దేశీయ మార్కెట్లను కుంగదీస్తున్నాయి. కేవలం వారం సమయంలో సెన్సెక్స్‌ 1200 పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్లు నష్టపోయాయి. దీంతో ఇన్వెస్టర్లు కేవలం ఆరు సెషన్లలో దాదాపు రూ. 5 లక్షల కోట్లు పోగోట్టుకున్నారు. ఏప్రిల్‌ 30న 152.54 లక్షల కోట్ల రూపాయలున్న బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ మే8 నాటికి

క్షణాల్లో నష్టాల్లోకి

Thursday 9th May 2019

ప్రపంచమార్కెట్ల మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ గురువారం నష్టంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 41 పాయింట్లు నష్టపోయి 37,748 వద్ద, నిఫ్టీ 37 పాయింట్లను కోల్పోయి 11,322 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభమైంది. ఫార్మా, ఐటీ. ఆర్థిక, ఎఫ్‌ఎంసీజీ, అటో, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. మెటల్‌, మీడియా, ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు స్వల్పంగా లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం గం.9:20.ని.లకు సెన్సెక్స్‌ 201

Most from this category