News


సోమవారం వార్తలోని షేర్లు

Monday 24th June 2019
Markets_main1561350370.png-26512

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
డాక్టర్‌ రెడ్డీస్ ల్యాబ్స్‌:-
ఫైటోనాడియోన్ ఇంజెక్ట్ ఎమల్షన్ ఔషధాలను అమెరికా మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇన్ఫోసిస్‌:- కంపెనీ ఆదాయంలో మూడో వంతుగా ఉన్న డిజిటల్‌ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 33.8శాతం పెరిగినట్లు తెలిపింది. 62శాతం బైబ్యాంక్‌ పూర్తి అయినట్లు తెలిపింది. కంపెనీ డైరెక్టర్‌గా నందన్ నీలేకని పునర్‌నియాకపు అంశాన్ని పరిశీలించనున్నట్లు తెలిపింది.
బాలాపూర్‌ చిని:- కంపెనీ కమర్షియల్‌ పేపర్లకు క్రిసెల్‌రేటింగ్‌ సంస్థ ఎ1(+) రేటింగ్‌ను కేటాయించింది.
జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌:- ఫిచ్‌ రేటింగ్‌ సంస్థ కంపెనీపై రేటింగ్‌ను బి(+) నుంచి బి(-)కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. 
ఆల్కేమ్‌ ల్యాబ్స్‌:- ఊపిరితిత్తుల వ్యాధి చికిత్సలో వినియోగించే రోఫ్లుమిలాస్ట్ ఔషధాలకి యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి తాత్కాలిక అనుమతులు దక్కించుకుంది.
టాటా స్టీల్‌:- ఫిచ్‌ రేటింగ్‌  సంస్థ కంపెనీకి బిబి రేటింగ్‌ను, స్థిరత్వం అవుట్‌లుక్‌ కేటాయించింది.
యూపీఎల్‌:- షేర్ల బోనస్‌ ఇష్యూకు కంపెనీని జూలై 3ను రికార్డు తేదిగా నిర్ణయించింది.
బంధన్‌ బ్యాంక్:- గృహ్‌ఫైనాన్స్‌ విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది. 
మాక్స్‌ ఇండియా:- మాక్స్‌ హెల్త్‌కేర్‌లో 49.7 శాతం వాటాను కొనుగోలు చేసింది.
సిప్లా:- కంపనీ స్వతంత్ర డైరెక్టర్‌గా పీటర్‌ లంకౌ రాజీనామా చేశారు.
సన్‌ టీవీ:- ఐదేళ్ళ కాలవ్యవధితో కొత్త అదనపు డైరెక్టర్‌గా మతిపూరనా రామకృష్ణన్‌ను నియమించింది.
స్టార్‌ సిమెంట్‌:- కంపెనీ బైబ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 68లక్షల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది. ప్రతి ఈక్విటీ షేరు ధరను రూ.102లుగా నిర్ణయించింది. 
సీజీ పవర్‌:- ఈవీ రియల్ ఎస్టేట్‌కు 13 ఎకరాలకు భూమిని రూ.490 కోట్లకు విక్రయించింది. 
జెట్‌ఎయిర్‌వేస్‌:- ఎన్‌సీఎల్‌టీ ముంబయి బెంచ్‌ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా  దివాలా ప్రక్రియ ప్రారంభమైంది.
ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌:- వారెంట్ల జారీ ద్వారా బ్యాంక్‌లోకి మరో రూ.2,700 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు  హిందుజాలు సిద్ధమయ్యారు.
బీహెచ్‌ఈఎల్‌:- ఎన్‌టీపీసీ అనుబంధ సంస్థ నబీనగర్‌ పవర్‌ జనరేటింగ్‌ నుంచి రూ.840 కోట్ల ఆర్డర్‌ను దక్కించుకుంది.
టాటా స్టీల్‌:- కంపెనీ సీఈఓ, ఎండీగా టీవీ నరేంద్రన్‌ను తిరిగి నియమించేందుకు వాటాదారుల ఆమోదం కోరనుంది.

 You may be interested

ఆర్బీఐ డిప్యూటి గవర్నర్‌ విరాల్‌ రాజీనామా

Monday 24th June 2019

రిజర్వ్‌ బ్యాంక్‌ స్యయం ప్రతిపత్తి కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య తన పదవికి రాజీనామా చేశారు. మాజీ ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా తర్వాత ఇబ్బందిగానే పదవిలో కొనసాగిన ఈయన తన పదవి కాలం ముగియడానికి ఆరు నెలల ముందే వైదొలిగారు. ఆర్థిక సరళీకరణ తర్వాత తక్కువ వయుసున్న డిప్యూటీ గవర్నర్‌గా పేరుపొందిన ఆచార్య 2017 జనవరి 23న పదవిని స్వీకరించారు.

బలహీనపడిన రూపీ

Monday 24th June 2019

డాలర్‌ మారకంలో రూపీ సోమవారం(జూన్‌ 24) 5పైసలు బలహీనపడి 69.60వద్ధ ప్రారంభమైం‍ది. అమెరికా- ఇరాన్‌ దేశాల మధ్య ముదురుతున్న ఘర్షణ వాతవరణం కారణంగా సోమవారం ముడి చమురు ధరలు పెరిగాయి. ఫలితంగా రూపీ 5 పైసలు బలహీనపడింది. శుక్రవారం సెషన్‌లో రూపీ 69.55 వద్ద ముగిసిన విషయం తెలిసిందే.  ఫెడ్‌ వడ్డి రేట్లను భవిష్యత్‌లో తగ్గిస్తుందనే వార్తల నేపథ్యంలో విదేశి పెట్టుబడులు పెరిగడంతో గత వారం రూపీ 21 పైసలు

Most from this category