News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 5th July 2019
Markets_main1562301030.png-26810

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
యస్‌ బ్యాంక్‌:-
ఎవర్‌గ్రీన్‌ తనఖా పెట్టిన 9.47శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను స్వాధీనం చేసుకుంది. 
డీఎల్‌ఎఫ్‌:- గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హత కలిగిన షేర్‌ హోల్డర్లకు డివిడెండ్‌ జారీకి రికార్డు తేదికి జూలై 23గా నిర్ణయించింది.
మారుతి సుజుకీ:- డీలర్లతో కలిసి కార్ల ధరలను మాన్యుపులేట్‌ ఆరోపణలపై కాంపిటీషన్‌ కమీషన్‌ ఆప్‌ ఇండియా సమగ్ర విచారణకు ఆదేశించింది.
జీఎంఆర్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌:- జీఎంఆర్‌ చత్తీస్‌ఘడ్‌ ఎనర్జీలో మొత్తం 47.62శాతం వాటాను అదానీ పవర్‌కు విక్రయించింది.
ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌:- ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఎఫ్‌సీ) 550 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. మొదటి విడుతలో భాగంగా ఐఎఫ్‌సీ 275డాలర్ల నిధులను జారీ చేసింది.
కమర్షియల్‌ ఫైన్‌ బ్యాగ్స్‌:- మధ్యప్రదేశ్‌ ఇండస్ట్రీయల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ నుంచి ఇండస్ట్రీయల్‌ కారిడర్‌ నిర్మాణానికి ఆర్డర్లు దక్కించుకుంది.
అగర్వాల్‌ ఇండస్ట్రీయల్‌ కార్పోరేషన్‌:- స్వల్పకాలికానికి రూ.100 కోట్ల బ్యాంకు రుణ సదుపాయానికి  కేర్‌ రేటింగ్‌ సంస్థ బిబిబి రేటింగ్‌ను జారీ చేసింది. 
రైన్‌ ఇండస్ట్రీస్‌:- ఇండియా రేటింగ్‌ సంస్థ కంపెనీ అవుట్‌లుక్‌ను పాజిటివ్‌ నుంచి స్థిరత్వం కు కేటాయించింది. 
ఉషా మార్టిన్‌:- ఐరన్‌ ఓర్‌ మైన్‌, కోల్‌ మైన్‌ నిర్వహణ వ్యాపారాలకు టాటాస్పాంజ్‌కు బదిలీ చేసింది.



You may be interested

స్థిరంగా పసిడి ధరలు

Friday 5th July 2019

ప్రపంచమార్కెట్లో మార్కెట్లో పసిడి ధరలు స్థిరంగా ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌ ఇండెక్స్‌ స్థిరమైన ర్యాలీ, ఆసియా మార్కెట్లు రెండు నెలల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతుండటం ఇందుకు కారణమవుతున్నాయి. ఆసియా శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప నష్టంతో 1,420డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా నేడు విడుదల చేసే జూన్‌ మాసపు వ్యవసాయేతర ఉద్యోగ గణాంకాల విడుదల కోసం పసిడి ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు.

పడిన చమురు ధర

Friday 5th July 2019

అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండడంతో చమురు డిమాండ్‌ భయాలు మదుపర్లను వెంటాడుతున్నాయి. ఫలితంగా శుక్రవారం(జులై 5) ట్రేడింగ్‌లో చమురు ధరలు పడిపోయాయి. బెంచ్‌మార్కు బ్రెంట్‌ క్రూడ్‌ ధర 0.1శాతం నష్టపోయి బ్యారెల్‌కు 63.23 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 1.1 శాతం నష్టపోయి బ్యారెల్‌కు 56.71డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. అంతేకాకుండా ఇరాన్‌ ఈయూ ఆంక్షాలను బేఖాతరు చేస్తు సిరియాకు ఆయిల్‌ సరాఫరా చేయడంతో బ్రిటీష్‌ ఆయిల్‌ మెరైన్‌ ఇరాన్‌ ఆయిల్‌

Most from this category