News


శుక్రవారం వార్తల్లో షేర్లు..!

Friday 14th September 2018
Markets_main1536900054.png-20247

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌:- ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌  ఈ నెల 18 నుంచి షేర్ల బైబ్యాక్‌ను ప్రారంభించనుంది. వచ్చే నెల 3న ముగిసే ఈ షేర్ల బైబ్యాక్‌లో భాగంగా ఒక్కో షేర్‌ను రూ.1,100కు కొనుగోలు చేస్తారు. మొత్తం 3.64 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేస్తామని, ఈ షేర్ల బైబ్యాక్‌ విలువ రూ.4,000 కోట్లని సంస్థ తెలిపింది.
అలహాబాద్‌ బ్యాంక్‌:- సుమారు రూ.1900 కోట్ల మూలధన నిధులను సమీకరించేందుకు ఆమోదం తెలిపేందుకు సెప్టెంబర్‌ 19న బోర్డు సమావేశం నిర్వహించనుంది.
ఫోర్టీస్‌హెల్త్‌కేర్‌:- శివిందర్‌ సింగ్‌ తన అన్న మల్విందర్‌పై నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)లో ధాఖలు చేసిన కేసును ఉపసంహరించుకన్నారు. శివిందర్‌ సింగ్‌ తన భార్య సంతకాన్ని ఫోర్జరీ చేసి మల్విందర్‌ కంపెనీలో అక్రమ ఆర్థిక లావాదేవీలకు పాల్పడ్డారని మంగళవారం నాడు ఎన్‌సీఎల్‌టీలో కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
వేదాంత:- ఈస్ట్‌కోస్ట్‌లోని గోదావరి బేసిన్‌లో కొత్త హెడ్రోకార్బన్‌ నిక్షేపాలను కొనుగొన్నట్లు ప్రకటించింది.
డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌:- అమెరికా మార్కెట్లోకి నియోస్టిగ్మిన్‌ మోథిల్‌సల్ఫేట్‌ ఇంజెక్షన్‌ను విడుదల చేసింది. బ్లోక్షివేర్జ్‌ జనరిక్‌ వెర్షన్‌కు చెందిన ఈ ఇంజెక్షన్‌ ఇటీవలే యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకుంది. ఈ జనరిక్‌ వెర్షన్‌ అమెరికా మార్కెట్లో జూలై 2018 నాటికి ముగిసిన సంవత్సరంలో మొత్తం 111 మిలియన్‌ డాలర్ల విలువైన అమ్మకాలను జరిపింది.
రెడింగ్టన్‌ ఇండియా:- తన అనుబంధ సం‍స్థ రాజ్‌ప్రొటిమ్‌ సప్లయ్‌లో 76శాతం నుంచి 88 శాతానికి పెంచుకుంది.
కేడిల్లా హెల్త్‌కేర్‌:- తన అనుబంధ  సంస్థ జైడస్‌  రైడ్రోనేట్ సోడియం ఔషధాలకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకుంది.
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా:- కంపెనీ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ప్రశాంత్‌ కుమార్‌ను అడిట్‌ కమిటీ బోర్డు నియమించింది.
విప్రో:- ఎంటర్‌ప్రైజెస్‌ మేనేజ్‌మెంట్‌ సెల్యూషన్స్‌ విభాగంలో సేవలు అందించేందుకు అనాప్లాన్‌ కంపెనీతో జత కట్టింది.
5పైసా క్యాపిటల్‌:- రైట్స్‌ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇష్యూలో భాగంగా రూ.10లు ముఖవిలువ కలిగిన 1.20 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రతి షేరు ధర రూ.80లు చొప్పున మొత్తం రూ.101.912 కోట్లను సమీకరించనుంది.
ఐఎల్‌&ఎఫ్‌సీ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్స్‌:- ఇటీవల కంపెనీ జారీ చేసిన రూ.3550 కోట్ల ఎన్‌సీడీల జారీ ఇష్యూకు రేటింగ్‌ సంస్థ బ్రిక్‌వర్క్స్‌ AA- నుంచి BB-కు రేటింగ్‌ను సవరించింది.
ఇండియా ఇన్‌ఫ్రాస్పేస్‌:- శౌర్య కాస్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేసింది.
ఆర్మన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌:- ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో ఎన్‌సీడీలను జారీ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
వోల్టాస్‌:- తన గృహోపకరణ వ్యాపారంలో రూ.1000 కోట్ల పెట్టుబడులకు సిద్ధమైంది.
ఎన్‌బీసీసీ:- హెచ్‌సీసీ కంపెనీని రూ.285కోట్లకు కొనుగోలు చేసింది.
పీఎన్‌బీ:- రూ.1320 కోట్ల విలువైన 21 ఎన్‌పీఎ అకౌంట్లకు బిడ్లను ఆహ్వానించింది.
ఇమామి పేపర్స్‌ మిల్స్‌:- సెప్టెంబర్‌ 21 జరిగే బోర్డు సమావేశంలో మూలధన నిధుల సమీకరణ అంశంపై చర్చించనుంది.
నేడు త్రైమాసిక ఫలితాలు:- రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్స్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌, క్వాలిటీ, బీఎఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌.You may be interested

స్వల్పంగా పెరిగిన పసిడి

Friday 14th September 2018

డాలర్‌ ఇండెక్స్‌ తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం పసిడి ధర స్వల్పంగా పెరిగింది. ఆసియా మార్కెట్లో నేడుయ ఔన్స్‌ పసిడి భారత వర్తమానకాలం ఉదయం 11 గంటలకు ఔన్స్‌ పసిడి 2 డాలర్లు లాభపడి రూ.1,211 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా వెల్లడించే ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్‌ వర్గాల అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. దీంతో ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు అంచనాలపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు ట్రంప్‌ ‘‘అమెరికాతో చైనాకు ఎదురైన

కోలుకున్న రూపాయి

Friday 14th September 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి శుక్రవారం బలపడింది. ఆగస్ట్‌ నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యానికి దిగువునే నమోదు కావడం సానుకూల ప్రభావం చూపింది. ద్రవ్యోల్బణం 3.69 శాతంగా నమోదయ్యింది. ఇది పది నెలల కనిష్ట స్థాయి. దీంతో ఆర్‌బీఐ అక్టోబర్‌ 5న జరగనున్న తన తదుపరి పాలసీ సమావేశంలో వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించవచ్చనే అంచనాలున్నాయి.   ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 71.75

Most from this category