News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 4th June 2019
Markets_main1559623234.png-26075

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
ఎల్‌ అండ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌:-​ ప్రమోటర్‌ ఒకరు ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా 4 మిలియన్ల షేర్లను విక్రయించనున్నారు. ఇందుకు ఫ్లోర్‌ ధర రూ.1650లుగా నిర్ణయించారు. నేటి(జూన్‌ 4) ప్రారంభమయ్యే ఈ ఆఫర్‌ రేపటితో ముగిస్తుంది.
జీఈ పవర్‌ ఇండియా:- ఎన్‌టీపీసీ జేవీ(జాయింట్‌ వెంచర్‌) నుంచి కంపెనీ రూ.738 కోట్ల విలువైన కాంట్రాక్టును దక్కించుకుంది.
ఐసీఐసీఐ బ్యాంక్‌:- ఫిచ్‌ రేటింగ్‌ సం‍స్థ లాంగ్‌ టర్మ్‌ ఇష్యూవర్ డీఫాల్ట్‌ రేటింగ్‌కు బిబిబి(-) నుంచి బిబి(+)కు సవరించింది. అలాగే వైబిలిటి రేటింగ్‌ను బిబిబి(-) నుంచి బిబి కి పరిమితం చేసింది. దేశంలో ప్రైవేట్‌ రంగ బ్యాంకుల పనితీరు అంతంగా మాత్రంగా ఉన్న నేపథ్యంలో రేటింగ్‌లను డౌన్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు రేటింగ్‌ సంస్థ  చెప్పుకొచ్చింది. 
మహీంద్రా అండ్‌ మహీంద్రా:- తన అనుబంధ సంస్థ మహీంద్రా సస్టెన్ ఇండియాలో సోలార్‌ పవర్‌ ఉత్పత్తి, సరఫరా చేసేందుకు జపాన్‌ కంపెనీ మిత్సుషితో భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో జాయింట్‌ వెంచర్‌లో కంపెనీ మొత్తం వాటా 51శాతంగా ఉంటుంది.
డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌:- అమెరికా మార్కెట్లో జెనాటాన్‌ ఔషధాలను తిరిగి విక్రయించేందుకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకుంది.
విప్రో:- షేర్ల బై బ్యాక్‌ ఇష్యూకు జూన్‌ 21ని రికార్డు తేదిగా నిర్ణయించింది. 
సీఈఎస్‌ఈ వెంచర్స్‌:- హెర్బొలాబ్ ఇండియాలో 64.63శాతం వాటాను రూ.32.175 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఫ్యూచర్‌ రీటైల్‌:- ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో రూ.199 కోట్ల విలువైన ఎన్‌సీడీలను జారీ చేసేందుకు బోర్డు అనుమతులు దక్కించుకుంది.
టైటాన్‌ కంపెనీ:- కంపెనీ రూ.1000 కోట్ల రుణానికి బ్రిక్‌ రేటింగ్‌ ఇండియా సంస్థ ఎఎఎ రేటింగ్‌ కేటాయించింది. అలాగే బంగారంపై రుణానికి ఎ1+ రేటింగ్‌ను కేటాయించింది. 



You may be interested

3నెలల గరిష్టానికి పసిడి

Tuesday 4th June 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర 3నెలల గరిష్టానికి చేరుకుంది. ఆసియాలో మంగళవారం ఔన్స్‌ పసిడి ధర మరో 4డాలర్లు పెరిగి 1332 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇటీవల అమెరికా తెరలేపిన వాణిజ్య యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనం పట్టింది. ఫలితంగా అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మక ధోరణి అవలంభిస్తూ పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. అమెరికా

నష్టాల ప్రారంభం

Tuesday 4th June 2019

క్రితం రోజు రికార్డుస్థాయిలో ముగిసిన భారత్‌ సూచీలు ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాల ప్రభావంతో మంగళవారం నష్టాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 72 పాయింట్ల నష్టం‍తో 41,196 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 36 పాయింట్ల నష్టంతో 12,053 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో డాక్టర్‌ రెడ్డీస్‌లాబ్‌, యూపీఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, షేర్లు 1 శాతం వరకూ లాభపడగా, హెచ్‌సీఎల్‌ టెక్‌, బీపీసీఎల్‌, టీ టెలిఫిల్మ్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు

Most from this category