STOCKS

News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 30th July 2019
Markets_main1564459481.png-27393

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌:-
యజమాని వీజీ సిద్ధార్థ నిన్న సాయంత్రం(జూలై 19న) నుంచి అదృశ్యమయ్యారు. అతని ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ వస్తుంది.
జీ లిమిటెడ్‌:- కంపెనీలో సుభాష్‌ చంద్ర వాటా కొనుగోలుకు అమెరికా ఆధారిత కేబుల్‌ కంపెనీ లుపా సిస్టమ్స్‌ బైండింగ్‌ ఆఫర్‌ నుంచి బైండింగ్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి.
ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్‌:- రైకా కమర్షియల్ వెంచర్స్ కంపెనీ ఓపెన్‌ మార్కెట్‌ ఆఫర్‌ పద్ధతిలో ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్‌ లిమిటెడ్‌కు చెందిన రూ.545 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు.
స్టెరైడ్‌ ఫార్మా సైన్స్‌:- చైనా ఫార్మా కంపెనీ షిహున్‌ ఫార్మాస్యూటికల్స్‌ హోల్డింగ్‌ గ్రూప్‌తో కలిసి జాయింట్‌వెంచర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 
పవర్‌ గ్రిడ్‌:- ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో బాండ్ల విక్రయం ద్వారా రూ.10వేల కోట్ల నిధుల సమీకరణకు షేర్ల హోల్డర్ల నుంచి అనుమతి పొందింది. 
ఎంఎంటీసీ:- బ్రిక్‌ రేటింగ్స్‌ ఇండియా సంస్థ కంపెనీ రుణ సదుపాయానికి రేటింగ్‌కు బిడబ్ల్యూఆర్‌ ఎ1(+) కేటాయించింది.
ముత్తూట్‌ ఫైనాన్స్‌:- ఆర్‌బిఐ నిబంధనలకు అనుగుణంగా బంగారం ధరలపై లోన్‌ టు వాల్యూను 75శాతం నుంచి 70శాతానికి తగ్గించింది. 
కోల్‌ ఇండియా:- కేంద్ర ప్రభుత్వం తన వాటాలో 1.7శాతానికి సమానమైన ఈక్విటీ షేర్లను రూ.2247 కోట్లకు విక్రయించింది.
నేడు క్యూ1 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- యాక్సిస్‌ బ్యాంక్‌, హీరోమోటోకార్ప్‌, టెక్‌ మహీంద్రా, బ్యాంక్‌ ఇండియా, చోళమండలం, పిరమల్‌, డిష్‌ టీవీ, ఎన్‌ఎండీసీ, గుజరాత్‌ గ్యాస్‌, వీఐపీ ఇండస్ట్రీస్‌, గ్రాన్యూల్‌ ఇండియా, కల్పతరు పవర్‌, ఎంఆర్‌పీఎల్‌, పీఎన్‌బీ హౌసింగ్‌, షాపర్‌ స్టాప్‌, వినతి ఆర్గానిక్స్‌, వెల్‌స్పన్‌ ఇండియా, యూనిటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, వైభవ్‌ గ్లోబల్‌, ఆర్‌పీజీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఎన్‌డీటీవీ, గల్ఫ్‌ఆయిల్‌, ఆంద్రా సిమెంట్స్‌, ప్రిజమ్‌ జాన్సస్‌, రెప్రో ఇండియా, సోలార్‌ ఇండస్ట్రీస్‌, స్వరాజ్‌ ఇంజన్స్‌, టీసీఐ ఎక్స్‌ప్రెస్‌ ఈహెచ్‌ఐ అసోసియేట్‌. You may be interested

రేట్ల కోత అంచనా..పెరిగిన చమురు

Tuesday 30th July 2019

ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న  యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్‌ సమావేశంలో వడ్డీ రేట్ల కోత ఉంటుందనే అంచనాల మధ్య చమురు ధరలు మంగళవారం ట్రేడింగ్‌లో పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.5 శాతం పెరిగి 64.01 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.6 శాతం పెరిగి బ్యారెల్‌కు 57.21 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. గత సెషన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ 0.4 శాతం, డబ్యూటీఐ క్రూడ్‌ 1.2 శాతం

‘కేఫ్ కాఫీ డే’ సిద్ధార్థ మిస్సింగ్‌

Tuesday 30th July 2019

ప్రసిద్ధ కాఫీ పార్లర్‌​ చైన్‌ కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి సిద్ధార్థ ఆచూకీ నిన్న రాత్రి నుంచి తెలియడం లేదు. గత రాత్రి మంగళూరు సమీపం‍లోని నేత్రావతి నది వద్ద ఉన్న వంతెన దగ్గర సిద్ధార్థ దిగాడని కారు డ్రైవర్‌ వివరించాడు. కారు దిగే సమయంలో సిద్ధార్థ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నడని, కారు దిగిన గంట సేపయినప్పటికి తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పి అప్రమత్తం చేశానని

Most from this category