News


నేటి వార్తల్లోని షేర్లు

Thursday 6th February 2020
Markets_main1580966690.png-31557

 

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు

ఎవెన్యూ సూపర్‌ మార్కెట్స్‌: ఈ కంపెనీ రూ.4000 కోట్ల నిధులు సమీకరించడానికి షేర్ల విక్రయాన్ని ప్రారంభించింది.

ఐఓసీ: ఐఓసీలో ఉన్న ప్రభుత్వ షేర్లను తిరిగి కోనుగోలు చేయమని కంపెనీకి ప్రభుత్వం చెప్పింది. తద్వారా కంపెనీలో తన వాటాను 51 శాతానికి తగ్గించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.

మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌: డిసెంబర్‌తో ముగిసిన ఈ కంపెనీ స్టాండెలోన్‌ నికర లాభం 56 శాతం తగ్గి రూ.61.60 కోట్లకు చేరింది. కాగా గత ఆర్థిక సంవత్సరం మూడోత్రైమాసికంలో నికర లాభం రూ.140 కోట్లుగా ఉంది.

డీఎల్‌ఎఫ్‌: డీఎల్‌ఎఫ్‌ క్యూ3లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.414.01 కోట్లకు చేరింది. కాగా గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో నికర లాభం రూ.335.15గా ఉంది. 

ఆంధ్రాబ్యాంక్‌: ఆంధ్రాబ్యాంక్‌ క్యూ3లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం  రూ.175 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో నికర నష్టం రూ.573.52 కోట్లుగా నమోదైంది.

బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌: ఈ కంపెనీ క్యూ3లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం స్వల్పంగా పెరిగి రూ.49.33 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో నికర ఆదాయం రూ.48.88 కోట్లుగా ఉంది.

వి-మార్ట్‌ రీటైల్‌: ఈ కంపెనీ క్యూ3లో నికర లాభం రూ.58.22 కోట్లకు చేరింది. కాగా గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.41.68 కోట్లుగా ఉంది.

హెచ్‌పీసీఎల్‌: ఈ కంపెనీ క్యూ3లో నికర లాభం రూ.747 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో రూ.248 కోట్లుగా ఉంది. 

గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌: ఈ కంపెనీ క్యూ3లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.51.15 కోట్లకు చేరింది. కాగా గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.48.56 కోట్లుగా ఉంది. 

బర్గర్‌ పెయింట్స్‌: బర్గర్‌ పెయింట్స్‌ క్యూ3లో నికర లాభం 36 శాతం పెరిగి రూ.182 కోట్లకు చేరింది.

 



You may be interested

మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు

Thursday 6th February 2020

మార్కెట్లో గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.20శాతం లాభపడింది. కరోనా వైరస్‌కు వాక్సిన్‌ విడుదలకావచ్చనే అంచనాలతో అంతర్జాతీయ వృద్ధి భయాలు తగ్గడంతో ప్రపంచవ్యాప్తంగా మెటల్‌ షేర్లకు డిమాండ్‌ నెలకొంది. అక్కడి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న మెటల్‌ షేర్లు దేశీయంగానూ రాణిస్తున్నాయి. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(2,665.40)తో పోలిస్తే 1.15శాతం

కేడిలా హెల్త్‌, డీమార్ట్‌ అధరహో..!

Thursday 6th February 2020

5 శాతం జంప్‌చేసిన కేడిలా హెల్త్‌ చరిత్రాత్మక గరిష్టానికి చేరిన డీమార్ట్‌  ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా ఓవైపు ఫార్మా రంగ కంపెనీ కేడిలా హెల్త్‌కేర్‌, మరోపక్క డిమార్ట్‌ బ్రాండ్‌ రిటైల్‌ స్టోర్ల నిర్వాహక సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ నెలకొంది. వెరసి రెండు

Most from this category