News


మంగళవారం వార్తల్లో షేర్లు

Tuesday 11th June 2019
Markets_main1560226662.png-26213

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఇంజనీరింగ్స్‌:-
నేషనల్‌ హై వే ఆథారిటీ నుంచి రూ.150 కోట్ల విలువైన రెండు ప్రాజెక్ట్‌లను దక్కించుకున్నట్లు కంపెనీ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది.
లుపిన్‌:- జూన్‌ 13న బోర్డు జరిగిన సమావేశంలో తన అనుబంధ సంస్థ న్యూక్లియర్‌ హెల్త్‌కేర్‌ సంస్థ విలీన అంశంపై చర్చించనుంది. 
ఎవర్‌రెడీ ఇండస్ట్రీస్‌:- కంపెనీ ధీర్ఘకాలిక రుణ సౌకర్యంపై ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ రేటింగ్‌ను ఇండియా ఎ(+) నుంచి ఇండియా బిబిబి డౌన్‌గ్రేడ్‌ చేసింది. 
జెన్సార్‌:- వ్యాపార అవసరాల నిమిత్తం అంతర్జాతీయ కంపెనీలైన నెట్‌యాప్‌, సిస్సో కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 
యస్‌ బ్యాంక్‌:- ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌లో విడుతల వారీగా 2శాతం వాటా విక్రయాన్ని నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అజయ్‌ కుమార్‌ విరమించుకున్నారు. 
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- యూనిట్‌ నిర్వహణ ప్రక్రియలో భాగంగా జామ్‌నగర్‌ రిఫైనరీ యూనిట్‌లో 3వారాల పాటు పనులు నిలిపివేయనుంది. 
మూత్తూట్‌ ఫైనాన్స్‌:- ముత్తూట్ క్యాపిటల్ సర్వీసెస్ జూన్ 7, 2019 నాటికి రూ.84.95 కోట్ల లావాదేవి ప్రక్రియను పూర్తి చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో సెక్యూరిటీ / డైరెక్ట్ అసిగ్మెంట్ లావాదేవీల ద్వారా కంపెనీ మొత్తం రూ .196.88 కోట్ల మొత్తం నిధులు సేకరించింది.
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:- ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో తన మొత్తం వాటాను బీసీపీ టాప్కో VII కంపెనీకి విక్రయించింది. 
ఫ్యూచర్‌ కన్జ్యూమర్‌:- కేర్‌ రేటింగ్‌ సం‍స్థ వాణిజ్య పేపర్లకు ఏ1 రేటింగ్‌ణు కేటాయించింది.
ఎస్‌హెచ్‌ కేల్కర్‌:- బై బ్యాక్‌ ఇష్యూకు జూన్‌ 20ను రికార్డు తేదిగా నిర్ణయించింది. 
స్టైరిలైట్‌ టెక్నాలజీస్:- కంపెనీ షేర్లపై తనఖాను పూర్తి తొలగిస్తున్నట్లు ప్రమోటర్లు ప్రకటించారు.You may be interested

ఏపీలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ భారీ ప్రాజెక్టు

Tuesday 11th June 2019

మొత్తం పెట్టుబడి రూ.2,500 కోట్లు కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సిమెంటు తయారీ సంస్థ అల్ట్రాటెక్‌... ఆంధ్రప్రదేశ్‌లో భారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి సంస్థకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. కర్నూలు జిల్లా పెట్నికోట వద్ద రానున్న ఈ ప్రాజెక్టుకై అల్ట్రాటెక్‌ సుమారు రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇప్పటికే కంపెనీ 431.92 హెక్టార్ల స్థలాన్ని ప్లాంటు కోసం కొనుగోలు

పాజిటివ్‌ ప్రారంభం

Tuesday 11th June 2019

అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో మంగళవారం స్టాక్‌ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 116 పాయింట్ల లాభంతో 39,900 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 37 పాయింట్లు జంప్‌చేసి 11,960 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, కోల్‌ ఇండియా, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌లు 1 శాతం వరకూ ట్రేడింగ్‌ ప్రారంభంలో జంప్‌చేయగా, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్‌, మహింద్రా షేర్లు 1-2 శాతం మధ్య

Most from this category