News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 2nd July 2019
Markets_main1562041796.png-26725

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
కాక్స్‌ అండ్‌ కింగ్స్‌: ఈ కంపెనీ రేటింగ్‌ను కేర్‌(సీఏఆర్‌ఏ) ఏఏ- నుంచి బీబీకి మార్చింది.
హీరో మోటర్‌ కార్ప్‌: 2018 జూన్‌లో 6,52,028 యూనిట్ల అమ్మకాలు జరగగా 2019 జూన్‌లో వాహన విక్రయాలు 6,16,526 యూనిట్లకు పడిపోయాయి.
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌: రిజల్యూషన్‌ ప్రణాళికను జులై 5 కల్లా అమలు చేయాలని రుణదాతల మధ్య అంగీకారం కుదిరింది. ఈ కంపెనీ జూన్‌ నెలలో కొన్ని బ్యాంకుల రుణాలను తీర్చడంలో ఆలస్యం చేసింది. అంతేకాకుండా కంపెనీ కొన్ని బ్యాంకులలో ఎస్‌ఎమ్‌ఏ-0 విభాగంలో ఉంది.
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌: కొన్ని ఐబీఎమ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులను పొందడం పూర్తయ్యింది.
జేఎస్‌డబ్యూ ఎనర్జీ: ఛత్తీస్‌గడ్‌లోని జేఎస్‌పీఎల్‌ 1000 మే.వా. థర్మల్‌ ప్లాంట్‌ కొనుగోలు ఒప్పందం రద్దయ్యింది.  
కాక్స్‌ అండ్‌ కింగ్స్‌: రూ. 50 కోట్ల చెల్లింపులను కంపెనీ చెల్లించలేకపోయింది.
గెయిల్‌ ఇండియా: ఫిచ్‌ రేటింగ్‌ సంస్థ ఈ కంపెనీ రేటింగ్‌ను బీబీబీ- గా నిర్ణయించింది.
మొయిల్‌: మాంగనీస్‌ సిల్కో గ్రేడ్స్‌పై కంపెనీ 5 శాతం ధరలను పెంచింది.
ఆయిల్‌ ఇండియా: విదేశి రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ ఈ కంపెనీ ఐడీఆర్‌ను బీబీబీ- గా నిర్ణయించింది. 
ఎస్‌బీఐ: మౌలిక రంగ ప్రాజెక్టులలో వేగం పెంచేందుకు ఎస్‌బీఐ, ఎన్‌ఐఐఎఫ్‌లు ఎంఓయూలను కుదుర్చుకున్నాయి.
ఇక్రా:  తదుపరి నోటీసు వచ్చేవరకు నరేష్ తక్కర్‌ను సెలవులో ఉంచి, విపుల్ అగర్వాల్‌ను తాత్కాలిక చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియమించాలని కంపెనీ నిర్ణయించింది.
టాటా మోటార్స్‌: వాణిజ్య, ప్రయాణ వాహనాల అమ్మకాలు 14 శాతం తగ్గాయి. వైఓవై ప్రకారం ఈ అమ్మకాలు 56,773 యూనిట్ల నుంచి 49,073 యూనిట్లకు పడిపోయాయి.
టీవీఎస్‌ మోటర్‌​‍్స కంపెనీ: ద్విచక్ర వాహనాల అమ్మకాలు 3,01,201 యూనిట్ల నుంచి 2,83,461(వైఓవై ప్రకారం) యూనిట్లకు తగ్గాయి. 
ఎయిచర్‌ మోటర్స్‌: మొత్తం మోటర్‌సెకిల్‌ల అమ్మకాలు 74,477 యూనిట్ల నుంచి 58,339 యూనిట్లకు పడిపోయాయి.
భారతీ ఎయిర్‌టెల్‌: కంపెనీలో మొబైల్‌ వినియోగ వ్యాపారాలైన టీటీఎస్‌ఎల్‌, టీటీఎమ్‌ఎల్‌ల విలీనం పూర్తయ్యింది. జులై 12వ తేదిని టీటీఎమ్‌ఎల్‌ షేర్లను జారీ చేయడానికి కంపెనీ సిద్ధపడుతోంది. 

 You may be interested

68.97 వద్ద ప్రారంభమైన రూపీ

Tuesday 2nd July 2019

డాలర్‌ మారకంలో రూపీ మంగళవారం(జులై 2) ట్రేడింగ్‌లో 2 పైసలు బలహీనపడి 68.97 వద్ద ప్రారంభమైంది. అమెరికా- చైనాల మధ్య సంధి కుదరడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడింది. ఫలితంగా గత సెషన్‌లో డాలర్‌ మారకంలో రూపీ 9 పైసలు బలపడి 68.95 వద్ద ముగిసింది. అంతర్జాతీయ సంకేతాల కంటే దేశియ కారకాలు రూపీని ప్రభావితం చేయనున్నాయి. ఈ వారంలో బడ్జెట్‌ ఉండడంతో రూపీ లో కదలికలు హెచ్చుగా ఉండే అవకాశం

లాభాల ప్రారంభం

Tuesday 2nd July 2019

క్రితం రోజు అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ మంగళవారం భారత్‌ స్టాక్‌ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 125 పాయింట్ల పెరుగుదలతో 39,812 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 25 పాయింట్లు జంప్‌చేసి 39,812 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. పలు దేశాల తయారీ రంగం నెమ్మదించిందన్న వార్తలతో ప్రపంచవృద్ధి మందగిస్తుందన్న భయాలు నెలకొనడంతో ఆసియా మార్కెట్లు స్వల్ప క్షీణతతో ట్రేడవుతున్నాయి. హాంకాంగ్‌ మినహా మిగిలిన ఆసియా సూచీలన్నీ తగ్గాయి.  క్రితం రోజు

Most from this category